breaking news
Particulate matter
-
కాలుష్య కణాలగుట్టువిప్పిన గణితవేత్త
పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడుతూ భూతాపోన్నతికి కారణమవుతున్న పొగ, కాలుష్యకారక కణాల గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. వీటి కారణంగా ఏ స్థాయిలో కాలుష్యం సంభవిస్తోందో, వాతావరణ మార్పులో వీటి ప్రభావ స్థాయిలను పర్యావరణ వేత్తలు ఇప్పటికే అంచనావేయగల్గుతున్నారు. అయినాసరే ఆకస్మిక వర్షాలు, వరదలు వంటి వాటిని ఇప్పటికీ సరిగా అంచనావేయలేని పరిస్థితి. వీటికి కారణంగా గోళాకృతిలో లేని ఇతర రకాల కణాలు కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారుగానీ వీటి పరిమాణాన్ని, ప్రభావాన్ని గణించే విధానాన్ని అభివృద్దిచేయలేకపోయారు. గత 15 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని మాక్వరైటన్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్రవేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ స్టార్ట్ హాకిన్స్ పరిష్కారం కనుగొన్నారు. దీంతో మరింత ఖచి్చతత్వంతో వాతావరణ అంచనా సుసాధ్యంకానుంది. 2008లో వాతావరణ భౌతికశాస్త్రవేత్త మైఖేల్ బాక్స్ చేసిన ఒక ప్రసంగాన్ని హాకిన్స్ విన్నారు. వాతావరణమార్పులకు కారణమవుతున్న అన్ని ఆకృతుల కాలుష్యకణాలను లెక్కించకుండా మనం చేసే వాతావరణ అంచనాలు భవిష్యత్తులో అంత నిరుపయోగంగా మారే ప్రమాదంఉంది’’అని మైఖేల్ బాక్స్ చేసిన ప్రసంగం హాకిన్స్‌ను ఆలోచనల్లో పడేసింది. ఈ గజిబిజి ఆకృతుల కణాలను లెక్కగట్టే విధానాన్ని అభివృద్ధిచేసి ఈ పొల్యూషన్ పొడుపు ప్రశ్నకు సమాధానం వెతకాలని నిశ్చయించుకుని ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఆ పనిలో సఫలీకృతులయ్యారు. ఏమిటీ కణాలు? వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే ధూళి కణాలు గోళాకృతిలో ఉంటాయి. కానీ రాజస్థాన్‌లోని థార్ఎడారిసహా పలు గనుల తవ్వవం వంటి చోట్ల శిలలు క్రమంగా ఒరుసుకుపోయి, కోతకు గురై అత్యంత సూక్ష్మ శిలా కణాలు ఉద్భవించి గాల్లో కలుస్తున్నాయి. జీవఇంథనాలు మండించినపుపడు వెలువడే కొన్ని రకాల నుసి సైతం భిన్నాకృతిలో ఉంటోంది. ఢిల్లీలో చలికాలంలో నిర్మాణ పనుల వేళ గాల్లో కలిసే పరిశ్రమల వ్యర్థ్యాల నుంచి సైతం వేర్వేరు ఆకృతుల్లో ధూళి కణాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రస్తుతమున్న వాతావరణ సిద్ధాంతాలతో గణించడం కష్టం. ఈ కణాలు గాల్లో అధికమై సూర్యరశ్మి భూమిపై పడకుండా అడ్డుకుని భూమిని చల్లబరచవచ్చు లేదంటే భూమి నుంచి వేడి బయటకు పోకుండా అడ్డుకుని భూతాపోన్నతికి కారణం కావచ్చు. ఈ రెండు దృగి్వషియాలను సైతం గోళాకృతియేతర కణాల కోణంలో లెక్కించాల్సి ఉంది. ప్రసరణ దిశలో ఏదైనా వస్తువు అడ్డుగా ఉంటే కాంతి దిశను మార్చుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని ఈ అసాధారణ ఆకృతి కణాలకు అన్వయిస్తూ కంప్యూటేషన్ మెథడ్‌ను హాకిన్స్ రూపొందించారు. ఇప్పుడీ గణిత సూత్రాలు భవిష్యత్తులో వైద్య ఇమేజింగ్ సాంకేతికతల ఆధునీకరణకూ ఉపయోగపడనున్నాయి. అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ వంటి సాంకేతికతలు తరంగాలు మన శరీరంలో ఎలా ప్రయాణిస్తాయనే సూత్రాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. కొత్త గణిత సూత్రాలతో అత్యాధునిక అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ తీయొచ్చు. పలు రకాల కోటింగ్లలోనూ విరివిగా వాడొచ్చు. ఈ సూత్రాలను కాంతి విక్షేపణకు సంబంధించిన ప్రతి రంగంలోనూ ఉపయోగించవచ్చు. వడగాల్పులు, రుతుపవన అంచనాలు, కాలుష్య ప్రభావాలు వంటిలోనూ ఈ సూత్రాలను వాడొచ్చు. దీంతో వాతావరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయొచ్చు. ఈ పరిశోధనా వివరాలు ‘క్వాంటేటివ్ స్పెక్ట్రోస్కోపీ, రేడియేటివ్ ట్రాన్స్ఫర్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలుష్యంతో కరోనా ముప్పు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయట! ఎందుకంటే అక్కడ కాలుష్యం అధికం కాబట్టి. కాలుష్య సూచి ‘పీఎం(పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5’కు ఎక్కువగా గురయ్యేవారికి కరోనా సులువుగా సోకుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్, వారణాసి, లక్నో, సూరత్ తదితర 16 పెద్ద నగరాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఈ నగరాల్లో శిలాజ ఇంధనాల వినియోగం అధికం కావడంతో పీఎం 2.5 ఉద్గారాలు భారీస్థాయిలో వెలువడుతున్నాయని, కరోనా వ్యాప్తికి ఇవి కూడా కారణమని అధ్యయనం స్పష్టం చేసింది. కాలుష్యం మనిషిలో రోగ నిరోధక శక్తిని హరిస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్కళ్ యూనివర్సిటీ–భువనేశ్వర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ–పుణే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–రూర్కెలా, ఐఐటీ–భువనేశ్వర్‌కు చెందిన పరిశోధకులు çకలిసి దేశవ్యాప్తంగా 721 జిల్లాల్లో అధ్యయనం నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 5 వరకూ ఆయా నగరాల్లో కాలుష్య ఉద్గారాలు, గాలి నాణ్యత, కోవిడ్–19 పాజిటివ్ కేసులు, మరణాల సమాచారాన్ని క్రోడీకరించారు. పీఎం 2.5 ఉద్గారాలకు, కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పునకు, తద్వారా మరణాలకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇళ్లలో వంట, ఇతర అవసరాల కోసం జీవ ఇంధనాలను మండించడం కూడా ఉద్గారాలకు కారణమవుతోందని తెలిపారు. మరో 46,617 పాజిటివ్ కేసులు: దేశంలో 24 గంటల్లో 46,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 59,384 మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. దీంతో రికవరీ రేటు 97.01%కి పెరిగింది. అదే సమయంలో ఒక్క రోజులో 843 మరో మంది మరణించడంతో మొత్తం మరణాలు 4,00,312కు పెరిగాయి. అలాగే, యాక్టివ్ కేసులు మరింత తగ్గి 5,09,637కు చేరాయి. 6 రాష్ట్రాలకు కేంద్ర నిపుణుల బృందాలు: కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గకపోవడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. ఆయా రాష్ట్రాలకు నిపుణుల బృందాలను పంపించనున్నట్లు తెలిపింది. ఒక్కో బృందంలో ఇద్దరేసి చొప్పున నిపుణులు ఉంటారంది. ఈ బృందాలు కరోనా నియంత్రణ చర్యల అమల్లో సహకరిస్తాయని తెలిపింది. రెండో వేవ్ ముగిసిపోలేదు దేశంలో కరోనా ఆంక్షలు తొలగించడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా, కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ హెచ్చరించారు. కరోనా నియంత్రణ చర్యలు కొనసాగించాలని, జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇప్పుడే అస్త్రసన్యాసం చేస్తే కరోనా వ్యాప్తికి మళ్లీ జీవం పోసినట్లే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో జూన్ 23 నుంచి 29 దాకా వారం రోజులపాటు కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే నమోదయ్యిందని గుర్తుచేశారు. కరోనా వ్యాక్సినేషన్లో వేగం పెంచినట్లు తెలిపారు. గర్భిణులూ కోవిడ్ టీకాకు అర్హులే దేశంలో గర్భవతులు కూడా ఇకపై కోవిడ్ టీకా తీసుకోవచ్చు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) సిఫారసుల ఆధారంగా గర్భవతులను కూడా టీకాకు అర్హులుగా చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. గర్భిణులు ఇకపై కోవిన్ యాప్‌లో నమోదు చేసుకుని లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కోవిడ్ టీకా వేయించుకోవచ్చని వివరించింది. గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు తెలిపింది. -
ఢిల్లీలో అత్యంత ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం
-
ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
ఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. కాగా తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మొత్తం పొగ కమ్మేయడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొగ చూరడంతో రన్‌వే కనిపించడం లేదు. దీంతో 12 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. -
కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
-
కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం 1,800 స్కూళ్లకు సెలవు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలపై ఎన్జీటీ ఆగ్రహం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతోంది. ఢిల్లీలో వాహనాలు వెదజల్లుతున్న వాయువులతోపాటు నగరం చుట్టుపక్కలున్న పరిశ్రమలనుంచి వస్తున్న కాలుష్యంతో హస్తినలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొంతకాలంగా ప్రపంచ కాలుష్యనగరాల్లో ప్రధానంగా నిలిచిన ఢిల్లీలో.. గత మూడ్రోజులుగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. కాలుష్యాన్ని కొలిచే పరికరాలు, గాల్లో దుమ్ము, ధూళి, పొగ, రసాయనాలు ప్రమాదస్థాయిని మించిపోయినట్లు సూచించాయి. గాలి నాణ్యత, వాతావరణ అంచనా, పరిశోధన వ్యవస్థ (సఫర్) వెల్లడించిన వివరాల ప్రకారం.. 10 పర్టికులేట్ మ్యాటర్ (కాలుష్య స్థాయి) ఉండాల్సిన కాలుష్యం 500 మార్కును చేరింది. భారీ ఎత్తున కురుస్తున్న పొగమంచు, నగరంలో కాలుష్యం పెరిగిపోవటంతో.. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. శనివారం తన పరిధిలోని 1800 స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు ఎమ్సీడీ (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) ప్రకటించింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు శుక్రవారం కూడా సెలవు ప్రకటించాయి. మరికొన్ని స్కూళ్లు ఆవరణలో జరిగే ప్రార్థన, క్రీడల తరగతులను రద్దుచేశాయి. గుర్గావ్, ఢిల్లీలో శాఖలున్న శ్రీరామ్ స్కూలు సోమవారందాకా సెలవు ప్రకటించింది. 10, 12వ తరగతి విద్యార్థులలే హాజరుకావాలంది. భావితరానికి భయంకరమే! దేశరాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆందోళన వ్యక్తం చేసింది. రోజురోజుకూ తీవ్రమవుతున్న కాలుష్య సమస్య నివారణకు కేంద్రం, ఆప్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడింది. ఢిల్లీలో 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కాలుష్యం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మన పిల్లలకు ఎలాంటి భయంకరమైన భవిష్యత్‌ను ఇవ్వబోతున్నామో ఆలోచించుకోవాలనింది. ‘మీ కోసమో (అధికారులు), ప్రజల కోసమో కాదు. మనకోసం కాలుష్యాన్ని నివారించాలి. మనం ఏదైనా సాధించగలం. ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోంది’ అని ఎన్జీటీ చైర్పర్సన్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ప్రమాదకర వాయు కాలుష్యం, ప్రజల ఆరోగ్యంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం, అధికారులు ఏ మాత్రం బాధపడకుండా.. ఒకరినొకరు నిందించుకుంటున్నారని ఎన్జీటీ మండిపడింది. కాలుష్యం ఇంతగా పెరిగిపోతున్న నేపథ్యంలో పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను రోడ్లపై తిరగనివ్వొద్దంటూ మళ్లీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలుకాకపోడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.