దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతోంది. ఢిల్లీలో వాహనాలు వెదజల్లుతున్న వాయువులతోపాటు నగరం చుట్టుపక్కలున్న పరిశ్రమలనుంచి వస్తున్న కాలుష్యంతో హస్తినలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొంతకాలంగా ప్రపంచ కాలుష్యనగరాల్లో ప్రధానంగా నిలిచిన ఢిల్లీలో.. గత మూడ్రోజులుగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. కాలుష్యాన్ని కొలిచే పరికరాలు, గాల్లో దుమ్ము, ధూళి, పొగ, రసాయనాలు ప్రమాదస్థాయిని మించిపోయినట్లు సూచించాయి