breaking news
Part-time employees
-
గళమెత్తిన గురుకుల ఉద్యోగులు
సాక్షి,అమరావతి/ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించా లని అంబేడ్కర్ గురుకులాల పార్ట్ టైం ఉద్యోగులు గళమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం మహా ధర్నా చేపట్టారు. ధర్నాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ..విద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తోన్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1,800 మంది పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏళ్ల తరబడి సేవలందిస్తున్నప్పటికీ, వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సకాలంలో అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ..పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార విభాగం, సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో గురుకుల పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా చంద్రం, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల పార్ట్‌టైమ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బొల్లిపోగు ఇస్మాయిల్, కార్యదర్శి కె.వర్మ పాల్గొన్నారు. -
వ్యవసాయ వర్శిటీ తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాస్తారోకో
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాయచూరులో,తాలూకా కేంద్రాల్లో గురువారం రాస్తారోకో చేశారు. రాయచూరులో ఏడో మైలు క్రాస్ వృత్తం వద్ద ఏఐఆర్డబ్ల్యూ, ఏఐఆర్ఎస్ఓ, ఆర్వైఎఫ్వై నేతృత్వంలో దాదాపు 15 నిమిషాల పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు మానసయ్య ,రాజశేఖర్ , నూర్జహాన్ తదితరులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక రైతు సంఘం రాష్ట్రధ్యక్షడు మానసయ్య మాట్లాడుతూ రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 20 ఏళ్ల నుంచి తాత్కాలిక ఉద్యోగులుగా విధులు నిర్వహించిన వారిని తొలగిస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి బి.వి.పాటిల్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.తాత్కాలిక ఉద్యోగులు 8 రోజుల నుంచి జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నా విశ్వవిద్యాలయం పాలకమండలి స్పందించలేదని విమర్శించారు. వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


