breaking news
Parishad election campaign
-
అభివృద్ధి చేయకుండా ఓట్లెలా అడుగుతారు: ఉత్తమ్
అనంతగిరి: టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని వెంకట్రాంపురం, వాయిలసింగారం, త్రిపురవరం, చనుపల్లి గ్రామాలలో ఆదివారం ఆయన పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రతి గ్రామానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, మిషన్ భగీరథ నీరు, ఇంటికో ఉద్యోగం, రైతుల రుణమాఫీపై ఇచ్చిన హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేంద్ర కేబినెట్లో ఉన్నత స్థాయిలో తెలంగాణ రథసారథులు ఉంటారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. డబ్బుకోసం పార్టీ మారిన రాజకీయ నాయకులు తల దించుకునేలా ప్రజల నిర్ణయం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి వాసు, ముస్కు శ్రీనివాసరెడ్డి, బుర్రా సుధారాణి, పుల్లారెడ్డి పాల్గొన్నార -
అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాల రద్దు
లింగపాలెం/కామవరపుకోట న్యూస్‌లైన్ :వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పథకాలపై సంతకాలు చేస్తారని ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం లింగపాలెం మండలంలోని ఆశన్నగూడెం, బాదరాల, వేములపల్లి, ముడిచెర్ల, రంగాపురం, పుప్పాలవారిగూడెం, కె.గోకవరం, కామవరపుకోట మండలంలోని తడికలపూడి, సాగిపాడు, కళ్లచెరువు, గుంటుపల్లి గ్రామాల్లో తోట చంద్రశేఖర్, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ విస్తృత ప్రచారం నిర్వహించారు. లింగపాలెం జెడ్పీటీసీ అభ్యర్థి మందలపు సాయిబాబా, కామవరపుకోట జెడ్పీటీసీ అభ్యర్థి వడ్లపట్ల సత్యనారాయణ,ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే డ్వాక్రా రుణాలను రద్దు చేస్తారన్నారు. రూ.వందకే 150 యూనిట్ల విద్యుత్ వాడకం సహా అమ్మఒడి, పింఛన్ల మొత్తం పెంపు, రైతులకు స్థిరీకరణ నిధి, ఇళ్ల నిర్మాణం హామీలపై సంతకాలు చేస్తారని చంద్రశేఖర్ చెప్పారు. బడుగు, బలహీనవర్గాల ప్రజల అభివృద్ధికి జగన్మోహన్రెడ్డి కృషి చేస్తారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇస్తున్న హామీలను నమ్మవద్దని సూచించారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లనే కేంద్రం, రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసగించటం చంద్రబాబునాయుడు నైజమని చంద్రశేఖర్ విమర్శించారు. ఆల్‌ఫ్రీ చంద్రబాబు మాటలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆశన్నగూడెంలోని చర్చిలో చంద్రశేఖర్, రాజేష్‌కుమార్ ప్రార్థనలు చేశారు. కళ్లచెరువులో క్రైస్తవ భక్తులు నిర్వహిస్తున్న శిలువ మార్గం కార్యక్రమంలో చంద్రశేఖర్ పాల్గొన్నారు. మద్దాల రాజేష్‌కుమార్ శిలువను మోశారు.ముసునూరి వెంకటేశ్వరావు, నాయకులు బొమ్మారెడ్డి నాగచంద్రారెడ్డి, పానుగంటి దామోదరావు, ఏపూరి సూరిబాబు పాల్గొన్నారు.