breaking news
parents murdered
-
ప్రేయసిని చంపినట్టే, తల్లిదండ్రులను కూడా..
భోపాల్: సోషల్ మీడియాలో పరిచయమైన ప్రేయసిని దారుణంగా హత్య చేసి, ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పాతిపెట్టిన భోపాల్ వాసి ఉద్యాన్ దాస్ పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు చెప్పాడు. ఏడేళ్ల క్రితం తన తల్లిదండ్రులను కూడా ఇలాగే చంపి, ఇంట్లో శవాలను పాతిపెట్టినట్టు నేరం అంగీకరించాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉద్యాన్ దాస్.. తన దగ్గరకు వచ్చిన ఆన్ లైన్ ఫ్రెండ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆకాంక్ష శర్మతో కొన్ని రోజులు కలిసున్న తర్వాత గొడవపడి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె శవాన్ని ఓ మెటల్ బాక్స్‌లో పెట్టి కాంక్రీట్ వేసి కప్పెట్టాడు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 2010లో చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో తన తల్లిదండ్రులను ఇదే రీతిలో చంపినట్టు ఉద్యాన్ వెల్లడించాడు. వారి శవాలను ఇంట్లో పాతిపెట్టినట్టు చెప్పాడు. వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకున్నందుకు వారిని హత్య చేసినట్టు తెలిపాడు. భోపాల్ పోలీసులు ఈ విషయాన్ని రాయ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు. రాయ్‌పూర్‌లో హత్య జరిగిన ఇంట్లో ఆదివారం మృతదేహాలను వెలికితీస్తామని పోలీసులు చెప్పారు. ఉద్యాన్ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులు. వారికి భోపాల్, రాయ్ పూర్, ఢిల్లీలో మూడు ఇళ్లు ఉన్నాయి. వారిని హత్య చేసిన తర్వాత భోపాల్ వెళ్లాడు. ఇళ్ల అద్దెల ద్వారా నెలకు 80 వేల రూపాయలు వస్తుందని పోలీసులు తెలిపారు. తండ్రి మరణించినట్టు డెత్ సర్టిఫికెట్ తీసుకుని, తల్లికి 30 వేల రూపాయలు పెన్షన్ వచ్చేలా చేశాడని, జాయింట్ బ్యాంకు ఎకౌంట్ ద్వారా ఈ డబ్బును డ్రా చేసేవాడని చెప్పారు. ‘ఆన్లైన్’ ప్రేయసిని అతి దారుణంగా.. -
చదవమన్నారని.. తల్లిదండ్రులను చంపేసింది
తనను దత్తత తీసుకుని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను తన బోయ్‌ఫ్రెండుతో కలిసి చంపేసిందో యువతి. పైగా మృతదేహాలను 72 రోజుల పాటు అదే ఇంట్లో ఉంచింది. ఈ సంఘటన గుజరాత్‌లోని బరోడా నగరంలో తిరుపతి సొసైటీ ప్రాంతంలో జరిగింది. శ్రీహరి వినోద్ (63), ఆయన భార్య స్నేహ (60) ఇద్దరినీ చంపిన నేరంలో 16 ఏళ్ల యువతితో పాటు ఆమె 21 ఏళ్ల బోయ్‌ఫ్రెండు సపన్ పురానీ ఇద్దరినీ అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ డీజే పాటిల్ చెప్పారు. ఆగస్టు మూడోతేదీ రాత్రి ఈ హత్యలు జరిగాయి. తాళం వేసి ఉన్న ఇంట్లోంచి ఏదో దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల వాళ్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బలవంతంగా తలుపు తెరిచి చూస్తే అందులో రెండు శవాలున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఆ దంపతులు తమకు పిల్లలు పుట్టకపోవడంతో ఏడాది వయసున్న ఆ అమ్మాయిని 15 ఏళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయి.. హత్య అనంతరం తర బోయ్‌ఫ్రెండుతో కలిసి ఉంటోందని పోలీసులు చెప్పారు. మధ్యమధ్యలో ఆ బోయ్‌ఫ్రెండు మాత్రం ఇంటికి వచ్చి, మృతదేహాల మీద సెంటు చల్లుతూ ఉండేవాడని తెలిపారు. పోలీసులకు అనుమానం వచ్చి దత్తత కుమార్తెను ప్రశ్నించగా మొత్తం విషయం బయటపడింది. తన తల్లిదండ్రులు తనను కొట్టేవారని, తనకు చదువుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా చదివించేవాళ్లని ఆమె చెప్పింది. అందుకే తన బోయ్‌ఫ్రెండుతో కలిసి చంపేసినట్లు పోలీసులకు తెలిపింది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)