breaking news
pandameru
-
అనంత అతలాకుతలం.. ముంచేసిన పండమేరు (ఫొటోలు)
-
పండమేరుకు జలకళ
రాప్తాడు: పండమేరు వంకకు జలకళ వచ్చింది. గత నాలుగైదు రోజులుగా పై తట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పండమేరు పరవళ్లు తొక్కుతోంది. ఈ ఏడాదిలో మొదటిసారిగా పండమేరు పారుతుండటంతో అటు ప్రజలు, ఇటు రైతుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ భాగం నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో పండమేరు వంకలో ఐదు అడుగుల నీరు ప్రవహిస్తోంది. దీంతో వరిమడుగు, గాండ్లపర్తి, యర్రగుంట, బోమ్మేపర్తి, బుక్కచెర్ల, అయ్యవారిపల్లి గ్రామాల వద్ద రాకపోకలు స్తంభించాయి. ఇదేవిధంగా ఈ వంక మరో రెండు రోజులు ప్రవహిస్తే అనంతపురం చెరువులోకి నీరు చేరుతుందని రాప్తాడు గ్రామ ప్రజలు తెలిపారు. మండలంలో 16 పంచాయతీ గ్రామాల్లో వర్షం కురవడంతో వంకలు, వాగులు, కుంటలు, చెక్ డ్యామ్లు నిండాయి.