ఎర్ర శేఖర్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
సోదరుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎర్ర శేఖర్ తమ్ముడు జగన్మోహన్ దేవరకద్ర గ్రామంలో దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో.. తన భర్తను ఆయన సోదరుడు, ఎమ్మెల్యే ఎర్ర శేఖరే హత్య చేయించారని జగన్మోహన్ భార్య ఆశ్రిత ఆరోపించారు.
పెద్దచింతకుంట పంచాయతీకి తాను దాఖలు చేసిన నామినేషన్ ఉపసంహరించుకోకపోతే తన భర్తను చంపేస్తానని ఎర్ర శేఖర్ బెదిరించాడని ఆమె అప్పట్లో తెలిపారు. తన సోదరుడి హత్యకు కారకుడైన ఎర్రశేఖర్‌ను కఠినంగా శిక్షించాలని జగన్మోహన్ సోదరి శ్రీదేవి కూడా డిమాండ్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తమ్ముడైన జగన్మోహన్(41)ను దేవరకద్ర పాత బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రివాల్వర్‌తో కాల్చి చంపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉండడంతో ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.. తాజాగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నాలు మొదలుపెట్టారు.