breaking news
Pakistan ODI captain
-
బాబర్‌కు షాకిచ్చిన షాహిన్ ఆఫ్రిది!
పాకిస్తాన్ క్రికెట్లో గత కొన్నేళ్లుగా అనిశ్చితి కొనసాగుతోంది. ఆ జట్టు కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు తరచూ మారుతూ ఉంటారు. నాయకత్వ బృందంలో ఇలా నిలకడలేని కారణంగా ఇప్పటికే జట్టు ఎన్నో ఘోర పరాభవాలు చవిచూసింది. అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరులో మాత్రం మార్పు రావడం లేదు.ఇందులో భాగంగా ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి షాన్ మసూద్‌ను తొలగించి.. తిరిగి బాబర్ ఆజంకే పగ్గాలు అప్పగించారు. త్వరలోనే వన్డే జట్టు సారథ్యం బాధ్యతలనూ తిరిగి బాబర్‌కే అప్పగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి 2022 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలో వైఫల్యాల తర్వాత బాబర్ ఆజం స్వయంగా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో టెస్టులకు షాన్ మసూద్, వన్డేలకు మహ్మద్ రిజ్వాన్, టీ20 ఫార్మాట్‌కు సల్మాన్ ఆఘా సారథులుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత వన్డేల్లో రిజ్వాన్‌ను షాహిన్, తాజాగా టెస్టుల్లో మసూద్‌ను బాబర్ రీప్లేస్ చేశారు.ఇక వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి సమయం దగ్గరపడుతున్న వేళ యాజమాన్యం సారథిగా మరోసారి బాబర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడే వన్డే పగ్గాలు అప్పగించాలని బాబర్ షరతు విధించినట్లు టెలికామ్ ఆసియా స్పోర్ట్ ఇటీవల తన కథనంలో పేర్కొంది.ఈ పరిణామాల నేపథ్యంలో వన్డే కెప్టెన్ మార్పు గురించి షాహిన్ ఆఫ్రిదికి తాజాగా ప్రశ్న ఎదురైంది. నేషనల్ చాంపియన్‌షిప్స్ 2026 ఆరంభం సందర్భంగా ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇప్పటి వరకైతే నేనే వన్డే కెప్టెన్’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. దీనిని బట్టి తన పదవి ఎప్పుడైనా ఊడిపోవచ్చనే సంకేతాలు ఇచ్చాడు.కాగా 2025లో షాహిన్ ఆఫ్రిది వన్డే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడి సారథ్యంలో ఇప్పటికి 11 వన్డేలు ఆడిన పాకిస్తాన్.. ఏడింట గెలిచి.. నాలుగు ఓడింది. తద్వారా అతడి విజయాల శాతం 63.63గా నమోదైంది. మరోవైపు.. బాబర్ ఆజం కెప్టెన్‌గా 43 వన్డేలు ఆడగా.. ఇందులో 26 గెలిచి.. 16 ఓడిపోయాడు.ఇక బాబర్ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్ 85 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 48 గెలిచి.. 38 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇటీవల టెస్టు కెప్టెన్‌గా తిరిగి వచ్చిన బాబర్ వెస్టిండీస్‌తో సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్నాడు. -
పాక్ వన్డే కెప్టెన్ అవుట్
న్యూఢిల్లీ: అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్లో కెప్టెన్ మారాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విఫలంకావడంతో పాక్ వన్డే జట్టు కెప్టెన్ అజర్ అలీ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించాడు. జట్టుకు సారథ్యం వహించడం వల్ల బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతోందని, ఈ ఒత్తిడి వల్లే బ్యాట్స్‌మన్‌గా రాణించలేకపోతున్నాననే కారణంతో అలీ కెప్టెన్ పదవిని వదులుకున్నాడు. అలీ వారసుడిగా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పాక్ వన్డే, టి-20 జట్లకు సర్ఫరాజ్ సారథ్యం వహించనున్నాడు. అతను ఇంతకుముందు ఓ వన్డే, 4 టి-20లకు పాక్ జట్టుకు నాయకత్వం వహించాడు. మూడు ఫార్మాట్లకు ఒకరినే కెప్టెన్‌గా నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. టెస్టు కెప్టెన్ పదవి నుంచి మిస్బావుల్ హక్‌ను కూడా తప్పించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే పీసీబీ ఆదేశాలను ధిక్కరిస్తూ, టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగనని ఇటీవల మిస్బా ఎదురు తిరిగాడు. ఈ నేపథ్యంలో మిస్బాపై కూడా పీసీబీ వేటు వేస్తుందా లేక అతన్నే కెప్టెన్‌గా కొనసాగిస్తుందా అన్నది వేచిచూడాలి. నిర్ణయం తీసుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని మిస్బా పీసీబీని కోరాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో పాక్ దారుణంగా విఫలమైంది. మిస్బా నాయకత్వంలోని పాక్ టెస్టు పరాజయాలు ఎదుర్కొంది.


