breaking news
pahadisharip
-
లక్షలు పలుకుతున్న 'అల్లాహ్' పొట్టేలు
సాక్షి,సిటీబ్యూరో: పహాడీషరీఫ్ షాహిన్నగర్కు చెందిన మహ్మద్ రఫియుద్దీన్ అనే వ్యక్తి పది రోజుల క్రితం జడ్చర్లలో 130 పొట్టేళ్లను కొనుగోలు చేశాడు. కాగా ఇందులో ఒక పొట్టేళ్లు చర్మంపై అరబ్ భాషలో అల్లాహ్ అని రాసినట్లుగా మచ్చ రూపంలో ఉండడాన్ని గుర్తించి దానిని ప్రత్యేకంగా అవ్ముకానికి పెట్టాడు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్‌లో పొట్టేలు రూపంలో దేవుడు ఉన్నాడని భావిస్తున్న వారు దీనిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ పొట్టేలుకు రూ. 2.5 లక్షలు వెచ్చించేందుకు పలువురు వుుందుకు వచ్చారని, అయితే దీనిని అమ్మాలా...? వద్దా...? ఇంకా నిర్ణయించుకోలేదని రఫియుద్దీన్ తెలిపారు. -
కాలిన స్థితిలో యువకుడి మృతదేహం
పహాడీషరీఫ్: కాలిన స్థితిలో ఉన్న యువకుడి మృతదేహాన్ని పహాడీషరీఫ్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వీవీ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.... పహాడీషరీఫ్–మామిడిపల్లి రహదారిని ఆనుకొని ఉన్న ఇందూ టెక్ కంపెనీ ఆవరణలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కాలిపోయి ఉండగా ఉదయం 8 గంటలకు సూపర్వైజర్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాగా, మృతుడు ముస్లిం అని, వయసు 20 –25 ఏళ్ల మధ్య ఉంటుందని, ఒడిశా నుంచి కూలీ పనికి వచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, కిరోసిన్/పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మృతదేహం కాలిపోయిందన్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించగా... పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి కొద్ది దూరం వెళ్లి తిరిగి వచ్చేసింది. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హత్యకు గురయ్యాడా...? ఆత్మహత్యకు పాల్పడ్డాడా...? అనే విషయాలు పోస్టుమార్టం అనంతరం తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతుడి సంబంధీకులెవరైనా ఉంటే పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో లేదా 9490617241 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరార