breaking news
Oscar winners
-
ఆస్కార్.. ఇప్పటి వరకు గెలిచిన ఇండియన్స్ వీరే
ప్రస్తుతం అందరినోటా వినిపిస్తున్న మాటా ఒక్కటే. అదేమిటంటే తొలిసారి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటే సమయమిది. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో డాల్బీ థియేటర్లో జరుగనున్న 95 ఆస్కార్ వేడుకలపై అందరి దృష్టి పడింది. ఈ సారి మన టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కించిన వన్ అండ్ ఓన్లీ సెన్సేషనల్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై మెరవనుంది. అందుకే ఈ ఏడాది ఆస్కార్ తెలుగు వారికి కూడా వెరీ వెరీ స్పెషల్. కానీ ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులను ఈ అవార్డ్ వరించింది. ప్రపంచ ఆస్కార్ సందడి వేళ ఇప్పటి దాకా ఆస్కార్ నెగ్గిన వారెవరో ఓ లుక్కేద్దాం. తొలి ఆస్కార్ విన్నర్ భాను అథైయా భాను అథైయా తొలి భారత ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 1983లో విడుదలైన గాంధీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమెకు అరుదైన ఘనత దక్కింది. 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కించారు. సత్యజిత్ రే భారతీయ సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకొచ్చిన సత్యజిత్ రే ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్‌రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అయితే సత్యజిత్‌రే అనారోగ్యం కారణాలతో వేడుకలకు పాల్గొనలేదు. దీంతో అకాడమీ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆస్కార్ అందజేసింది. రెండు అవార్డులు గెలిచిన ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు సాధించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కించుకున్నారు. రెండు ఆస్కార్ అవార్డులు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. రసూల్ పూకుట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ సొంతం చేసుకున్నారు. గుల్జర్ దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్ 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయన్ను ఆస్కార్ వరించింది. గునీత్ మోన్గా ఢిల్లీకి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్ మోన్గాఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగ్‌గా పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్‌కు గునీత్ ఆస్కార్ గెలుచుకుంది. తాజాగా అమెరికాలో లాస్ఎంజిల్స్ జరగనున్న 95వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఆల్ దట్ బ్రెత్స్( బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం), ది ఎలిఫెంట్ విస్ఫరర్స్(బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం), నాటు నాటు(బెస్ట్ ఒరిజినల్ సాంగ్) విభాగాలలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరి చూపులు ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్‌పైనే ఉన్నాయి. కచ్చితంగా ఆస్కార్ వరిస్తుందని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ బృందం అమెరికా చేరుకుంది. -
ఆస్కార్ 2018 ఉత్తమ నటి ఎవరో?
ఆస్కార్.. ఆస్కార్.. ఆస్కార్ అని హాలీవుడ్ అంతా జనవరి మొదట్నుంచీ ఒకే పాట పాడుతోంది. మార్చి 4న ఆస్కార్ అవార్డులను ప్రకటించేవరకూ ఈ పాట రిథమిక్‌గా మోగుతూనే ఉంటుంది. మన దగ్గరా హాలీవుడ్ సినిమా అభిమానులు ఈ పాటను అందుకుంటున్నారు. ఏ సినిమా బెస్ట్ పిక్చర్ అవుతుంది? బెస్ట్ యాక్టర్ ఎవరవుతారు? బెస్ట్ యాక్ట్రెస్‌గా ఎవరు అవార్డు అందుకుంటారు? అన్నీ చర్చలే! నామినేషన్స్ కూడా అనౌన్స్ అయ్యాక ఈ చర్చ ఇంకా తారాస్థాయికి చేరిపోయింది. బెస్ట్ యాక్ట్రెస్ (ఉత్తమ నటి)గా నామినేషన్స్ ఎవరెవరు దక్కించుకున్నారో, వారిలో ఎవరికి అవార్డు రావడానికి ఎక్కువ స్కోప్ ఉందో చూద్దాం.. సాలీ హాకిన్స్ (చిత్రం: ది షేప్ ఆఫ్ వాటర్) ‘ది షేప్ ఆఫ్ వాటర్’.. ఈ ఏడాది బెస్ట్ పిక్చర్ జాబితాలో అవార్డు అందుకునేందుకు గట్టి పోటీనిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో హాకిన్స్ నటన కూడా ది బెస్ట్ అనిపించుకుంది. ఒక్క డైలాగ్ కూడా ఉండదు హాకిన్స్‌కు ఈ సినిమాలో. ఒక గవర్నమెంట్ ల్యాబ్‌లో మూగ భాషతోనే చెప్పాలనుకున్న విషయాలు చెప్తుంది. ఈ పాత్రలో హాకిన్స్ నటన ‘అద్భుతం’ అన్న కితాబులు అన్ని వైపుల నుంచీ వచ్చాయి. నామినేషన్స్ దక్కించుకున్న ఐదుగురిలో ఒకరైన హాకిన్స్‌కు అవార్డు దక్కే అవకాశాలు చాలానే ఉన్నాయి. గతంలో ‘బ్లూ జాస్మిన్’ (2013) అనే సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ రోల్‌కు ఆస్కార్‌కు నామినేట్ అయింది హాకిన్స్. ‘ది షేప్ ఆఫ్ వాటర్’కి గనక ఆమె అవార్డు అందుకుంటే ఉత్తమ నటిగా అదే ఆమెకు మొదటి అవార్డు. ఫ్రాన్సిస్ మెక్డొర్మాండ్ చిత్రం: త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి ‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’.. ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బెస్ట్ పిక్చర్‌గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్నాక మరింత పాపులర్ అయింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంటే గొప్పే అని అన్నవారంతా, ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే సినిమాగా కూడా చూస్తున్నారు. ఇందులో ఫ్రాన్సిస్ మెక్డొర్మాండ్ వ్యవస్థపై పోరాడే ఓ తల్లి పాత్రలో కనిపించింది. కూతురును రేప్ చేసి, మర్డర్ చేస్తే, దానిపై తనకు కావాల్సిన సమాధానాల కోసం, జరగాల్సిన న్యాయం కోసం పోరాడే తల్లి పాత్రలో ఫ్రాన్సిస్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఆ పాత్రతోనే ఒక ప్రత్యేకమైన డెప్త్ వచ్చింది అంటారు హాలీవుడ్ సినీ పండితులు. ఫ్రాన్సిస్ గతంలో ‘మిసిస్సిపి బర్నింగ్’ (1999), ‘ఆల్మోస్ట్ ఫేమస్’ (2001), ‘నార్త్ కంట్రీ’ (2006) సినిమాలకు బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్లో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ‘ఫార్గో’ (1997)కి ఉత్తమ నటిగా ఒక అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు 2018లోనూ ఆస్కార్ కొడితే ఆమెకిది రెండో ఆస్కార్! మార్గో రాబీ (చిత్రం: ఐ, టోన్యా) ‘ఐ, టోన్యా’.. ఫిగర్ స్కేటర్ టోన్యా హార్డింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఆమె జీవితంలో కాంట్రవర్సీగా నిలిచిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ సాగే ఈ సినిమాలో టోన్యా పాత్రలో మార్గో రాబీ నటించింది. మార్గో నటనే ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతోనే మార్గో నటిగా ఓ గుర్తింపు కూడా తెచ్చుకుంది. ‘ఐ, టోన్యా’ ఆమెకు మొట్టమొదటి ఆస్కార్ నామినేషన్. బెస్ట్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో ఉన్న మిగతావారితో పోల్చితే మార్గోపై అంచనాలు తక్కువే ఉన్నా, మంచి పోటీ ఇచ్చే అవకాశమైతే ఉంది. సీర్సా రోనాన్ (చిత్రం: లేడీ బర్డ్) ‘లేడీ బర్డ్’.. ఇటు బాక్సాఫీస్ పరంగా, అటు విమర్శకుల ప్రశంసల పరంగా 2017లో సూపర్ హిట్ అనిపించుకున్న సినిమాల్లో ఒకటి. ఇందులో ఒక హైస్కూల్ స్టూడెంట్ పాత్రలో రోనాన్ నటన అద్భుతం అనే కితాబులిచ్చారంతా. కమింగ్ ఆఫ్ ఏజ్ ప్రేమలు, వాళ్ల ఆలోచనల చుట్టూ కథ తిరుగుతుంది. రోనాన్ తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్రలో నటించలేరు అన్నట్టుగా చేసిందామె. ఆస్కార్ అవార్డు నామినేషన్స్ పొందిన ఐదుగురిలో రోనాన్కు అన్ని విధాలా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకునే అర్హత, అవకాశం ఉన్నాయి. ఇది రోనాన్కు ఫస్ట్ ఆస్కార్ నామినేషన్. ఒకవేళ రోనాన్ ఆస్కార్ కొడితే, చిన్న వయసులో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకున్న క్యాటగిరీలో నాలుగో స్థానంలో చేరుతుందామె. ఆమె వయసు ఇప్పుడు 23 సంవత్సరాలు. మెరిల్ స్ట్రీప్ (చిత్రం: ది పోస్ట్) ‘ది పోస్ట్’.. ఎంతోమంది దర్శకులకు ఇన్స్పిరేషన్ అయిన స్పీల్బర్గ్ తీసిన సినిమా. గత డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పట్నుంచీ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంది. స్పీల్బర్గ్ తన స్థాయికి తగ్గ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ‘ది పోస్ట్’. ఇక ఇందులో మెరిల్ స్ట్రీప్ నటన మేజర్ హైలైట్స్‌లో ఒకటి. వియత్నాం వార్ టైమ్‌లో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ను బయటపెట్టే కథతో ఆసక్తికరంగా నడుస్తుంది ‘ది పోస్ట్’. ఇందులో మెరిల్ ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తుంది. మెరిల్ ఇప్పటివరకూ చేసిన వాటిల్లో ది బెస్ట్ అనేంతగా విమర్శకులను మెప్పించిందీ పాత్రతో! ఇప్పటికే బెస్ట్ యాక్ట్రెస్‌గా రెండు, సపోర్టింగ్ రోల్లో ఒక ఆస్కార్ పొందిన మెరిల్, ఈ రెండు క్యాటగిరీల్లో మొత్తం 17 నామినేషన్స్ దక్కించుకున్నారు ఇప్పటివరకూ. ఆస్కార్ లిస్ట్‌లో అందరికీ గట్టి పోటీ ఇవ్వగల మెరిల్ స్ట్రీప్ ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ లిస్ట్ మొత్తంలో ఎక్కువ క్రేజ్ మెరిల్ స్ట్రీప్కే కనిపిస్తోంది. అయితే ఆస్కార్ రిజల్ట్ ఎలా ఉంటుందన్నది మార్చి 4 వరకూ చెప్పలేం!! -
ఆస్కార్స్ 2015.. వేడుకల విశేషాలివీ!
-
‘బర్డ్‌మ్యాన్’కు ఆస్కార్ కిరీటం
‘బర్డ్‌మ్యాన్’, ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’లకు నాలుగేసి అవార్డులు... ‘విప్‌ల్యాష్’కు 3 సహజత్వానికి ప్రాధాన్యమిచ్చిన ‘బాయ్‌హుడ్’కు ఒకే అవార్డు స్పెషల్ ఎఫెక్ట్స్‌లో ‘ఇంటర్స్టెల్లార్’... సౌండ్ ఎడిటింగ్‌లో ‘అమెరికన్ స్నైపర్’లకు పట్టం ఉత్తమ విదేశీ భాషా చిత్రం... పోలెండ్‌కు చెందిన ‘ఇదా’ ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) అంగరంగ వైభవంగా సాగింది. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ ఈ అవార్డు ప్రదానోత్సవ వేదిక వద్ద తారల సందడి తగ్గలేదు. హాలీవుడ్‌కూ, అక్కడ కష్టాలు పడే నటీనటులకూ అద్దం పట్టిన వ్యంగ్యభరిత హాస్య చిత్రం ‘బర్డ్ మ్యాన్’ ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ‘ఉత్తమ చిత్రం’గా ఎంపికైంది. ‘ఉత్తమ చిత్రం’తో పాటు ‘ఉత్తమ దర్శకుడు’, ‘ఉత్తమ ఛాయాగ్రహణం’, ‘ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’తో కలిపి, మొత్తం 4 విభాగాల్లో ‘బర్డ్‌మ్యాన్’ చిత్రం ఈ 87వ వార్షిక అకాడెమీ అవార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, మేకప్, కాస్ట్యూవ్ు డిజైన్ విభాగాలు నాలుగింటిలో ఉత్తమంగా నిలిచింది. ఇక, ‘విప్‌ల్యాష్’ చిత్రం ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఉత్తమ సహాయ నటుడి విభాగాలు మూడింటిలో విజేత అయింది. ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ అయిన ఎనిమిది సినిమాలూ కనీసం ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి. అయితే, అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బాయ్‌హుడ్’ చిత్రం మాత్రం ఒకే ఒక్క అవార్డుతో సంతృప్తిపడాల్సి వచ్చింది. ఒక చిన్న పిల్లవాడు పన్నెండేళ్ళ పైచిలుకు వయసు దాకా పెరిగే క్రమాన్ని అదే నటీనటులతో, కాలాన్ని లెక్క చేయక ‘బాయ్‌హుడ్’గా రూపొందించిన రిచర్డ్ లింక్లేటర్కు నిరాశ ఎదురైంది. అలాగే, అమెరికన్లు పెద్ద పీట వేస్తారనుకున్న ‘అమెరికన్ స్నైపర్’కూ ఒకే అవార్డు (సౌండ్ ఎడిటింగ్) దక్కింది. నిరుడు ‘గ్రావిటీ’తో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికైన ఎమాన్యుయెల్ లుబెజ్కీ ఈసారి ‘బర్డ మ్యాన్’తో మళ్ళీ ఆస్కార్ గెలవడం విశేషం. అయితే, ఉత్తమ నటన విభాగాల్లో మొత్తం శ్వేత జాతీయులనే నామినీలుగా ఎంచుకున్నారనే విమర్శలు... రాజకీయాలున్నాయనే గుసగుసలు... ఆత్మహత్యల నివారణ, ప్రభుత్వ నిఘా లాంటి అంశాలపై ఉపన్యాసాల మధ్య ఈ ఉత్సవం సాగడం గమనార్హం. ఈసారి అవా ర్డులందుకొన్న చిత్రాల్లో ‘అమెరికన్ స్నైపర్’, ‘ది థీరీ ఆఫ్...’, ‘ఇమిటేషన్ గేమ్’ లాంటివన్నీ నిజజీవిత వ్యక్తుల ఆధారంగా రూపొందినవే కావడం విశేషం. ఉత్తమ చిత్రం: బర్డ్‌మ్యాన్ ‘బర్డ్ మ్యాన్’ (లేదా ‘ది అనెక్స్పెక్టెడ్ వర్చ్యూ ఆఫ్ ఇగ్నోరెన్స్’) సినిమా అమెరికన్ వ్యంగ్యభరిత హాస్య - నాటకీయ చిత్రం. వరుసగా అనేక చిత్రాల్లో సూపర్‌హీరో ‘బర్డ్‌మ్యాన్’గా పాత్రపోషణ చేసి సుపరిచితుడై, తెర మరుగైన రిగ్గన్ థామ్సన్ అనే హాలీవుడ్ నటుడి పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. అతను బ్రాడ్వేలో సొంత నాటకం ద్వారా ఒక సీరియస్ నటుడిగా మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆశిస్తాడు. అయితే, పేరుతో పాటు అహంకారం కూడా ఎక్కువున్న ఒక సినీ తార కూడా తన తారాగణంలో ఉండడంతో థామ్సన్‌కు ఎదురైన ఇబ్బందులేమిటి? వగైరా అంశాలతో వ్యంగ్యభరిత హాస్యం రంగరించిన సినిమా ఇది. రెండు గంటల నిడివి గల ఈ చిత్రం గత ఏడాది అక్టోబర్ 17న అమెరికాలో విడుదలైంది. తాజా ఆస్కార్ అవార్డుల్లో మొత్తం 9 విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది. ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’కు కూడా 9 విభాగాల్లో నామినేటైంది. చివరకు చెరి నాలుగేసి విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ దర్శకుడు: అలెగ్జాండ్రో గొంజాలెజ్ ఇనారిట్ (చిత్రం: ‘బర్డ్ మ్యాన్’) యాభై ఒక్క సంవత్సరాల అలెగ్జాండ్రో సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. మెక్సికోలో జన్మించిన ఆయన 17 ఏళ్ళ వయసులో అట్లాంటిక్ సముద్రంపై సరకుల రవాణా నౌకలో ప్రయాణం సాగించారు. చిన్న వయసులో చేసిన ఆ ప్రయాణాలు సినీ రూపకర్తగా తనపై అమిత ప్రభావాన్ని చూపాయని ఆయనే చెబుతుంటారు. తాను చూసిన ప్రదేశాలను నేపథ్యాలుగా ఎంచుకోవడం ఆయన అలవాటు. ఆయన తీసిన సినిమాలు ‘అమోరెస్ పెర్రోస్’ (2000), ‘21 గ్రామ్స్’ (2003), ‘బాబెల్’ (2006), ‘బ్యూటిఫుల్‘ (2010), తాజా ‘బర్డ్ మ్యాన్’ (2014)లు ప్రపంచవ్యాప్తంగా ఆదరణనూ, అవార్డుల్నీ అందుకోవడం విశేషం. ‘బర్డ్ మ్యాన్’కు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ గెలుచుకోవడం అందుకు తాజా ఉదాహరణ. ఒక మెక్సికన్ సినీ రూపకర్తకు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు రావడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది ‘గ్రావిటీ’ చిత్రం ద్వారా ఆ ఘనత సాధించిన అల్ఫాన్సో క్యువారోన్ కూడా మెక్సికనే! ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్మెయిన్ (చిత్రం: ‘ది థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్’) ప్రపంచ ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీసిన ‘ది థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్’లో హ్యాకింగ్ పాత్రకు చాలా శ్రమించి, ప్రాణం పోశారు - నటుడు ఎడ్డీ రెడ్మెయిన్. హ్యాకింగ్ మాజీ భార్య రాసిన జ్ఞాపకాల పుస్తకం ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమా తీశారు. కేవలం 33 ఏళ్ళ వయసులో ఆయన పోషించిన ఈ నిజజీవిత పాత్ర అందరి ప్రశంసలనూ అందుకుంది. అత్యంత సహజంగా సాగిన ఈ పాత్రపోషణకు ఇప్పటికే ఉత్తమ నటుడిగా ‘గోల్డెన్ గ్లోబ్’, ‘బాఫ్తా’తో సహా పలు అవార్డులందుకున్న ఈ ఇంగ్లీషు నట, గాయక, మోడల్‌కు ఆస్కార్ తాజా విజయం. ఉత్తమ నటుడి విభాగంలో ‘బర్డ్ మ్యాన్’లోని టైటిల్ పాత్రధారి మైకేల్ కీటన్తో పోటీ పడి, ఆస్కార్‌ను గెలిచారు ఎడ్డీ. లండన్‌లో పుట్టి పెరిగిన ఎడ్డీ ఇరవయ్యేళ్ళ వయసులోనే రంగస్థలంపై నటుడిగా ఓనమాలు దిద్దారు. ‘ది గుడ్ షెపర్డ్’, ‘లే మిజరబుల్స్’ లాంటి పలు చిత్రాల్లో నటించిన ఎడ్డీకి టెలివిజన్ నటనలోనూ అనుభవం ఉంది. రంగస్థలం, టీవీ, సినిమా - మూడింటిలోనూ తనదైన ముద్ర వేయడం విశేషం. ఆస్కార్ అందుకున్న ఎడ్డీని స్టీఫెన్ హ్యాకింగ్ అభినందించారు. ఉత్తమ నటి: జూలియన్ మూర్ (చిత్రం: ‘స్టిల్ ఎలైస్’) పిన్న వయసులోనే అల్జీమర్స్ వ్యాధి వచ్చి, బాధకు గురైన మహిళగా ‘స్టిల్ ఎలైస్’ చిత్రంలో చూపిన నటన జూలియన్ మూర్కు ఆస్కార్ కిరీటాన్ని అలంకరించింది. భావోద్వేగపరంగా సమస్యలకు గురైన మహిళల పాత్రలను పోషించడంలో మూర్ దిట్ట. ఆ రకంగా 54 ఏళ్ళ ఈ అమెరికన్ నటి, పిల్లల పుస్తకాల రచయిత్రి ఇప్పటికి అయిదు సార్లు నటనా విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. తొలిసారిగా ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు. పిల్లల కోసం ఆమె రాసిన పుస్తకాల్లో కొన్ని ‘బెస్ట్ సెల్లర్స్’ ఉండడం విశేషం. టూ మచ్ బాబూ... వ్యాఖ్యాతలు ఎంత జోరుగా ఉంటే వేడుకలు అంత పసందుగా సాగుతాయి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు నీల్ ప్యాట్రిక్ హ్యారిస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘ఇవాళ హాలీవుడ్ బెస్ట్ అండ్ వెటైస్ట్.... ఐ మీన్ బ్రైటెస్ట్ పీపుల్‌కి అవార్డులు ప్రదానం చేయబోతున్నాం’ అని వేడుక ఆరంభంలోనే చర్చకు తావిచ్చే మాటలు మాట్లాడారు నీల్. ఈ ఏడాది నామినేషన్స్‌లో నల్ల జాతికి చెందినవారికి ప్రముఖ విభాగాల్లో స్థానం కల్పించలేదనే వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ‘బెస్ట్ అండ్ వెటైస్ట్’ అని ప్రసంగం మొదలుపెట్టి, అంతలోనే వెటైస్ట్ అంటే బ్రైటెస్ట్ అని మాట మార్చాడు. ఇక, ‘బర్డ్ మ్యాన్’ చిత్రం గురించి మాట్లాడేటప్పుడు అందులోని సన్నివేశాన్ని తలపించే విధంగా లో దుస్తుల్లో వేదిక పైకి వచ్చాడు నీల్. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వీక్షించే ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో ఇలా చేయడం ‘టూ మచ్ బాబూ’ అన్నవాళ్లూ ఉన్నారు. విజేతల పేర్లు వీరిద్దరికే తెలుసు! ఆస్కార్ అవార్డ్ విజేతలను ఎంపిక చేయడమనే వ్యవహారం అంత సులువు కాదు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్‌లో మొత్తం 6,100 మంది సభ్యులు ఉంటారు. వీళ్లందరూ వేసిన ఓట్లే విజేతలను నిర్ణయిస్తాయి. మూడేళ్లకు ముందు ఓటింగ్ విధానం మొత్తం పేపర్ వర్క్‌తోనే సాగేది. కానీ, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ పద్దతిలో ఓట్లు వేయడం మొదలైంది. సభ్యులందరి ఓట్లను చివరికి పరిగణనలోకి తీసుకునేది ఇద్దరే వ్యక్తులు. వాళ్లే.. ‘ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థకు చెందిన ‘బ్రియాన్ కల్లినన్, మార్తా రూయిజ్’. విజేతలను కూడా నిర్ణయించేది వీళ్లే. గత మంగళవారంతో ఓటింగ్ ముగిసింది. 24 శాఖలకు సంబంధించి 6,000 పై చిలుకు ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లు లెక్కించి, విజేతలను శుక్రవారం నిర్ణయిస్తారు. 24 శాఖలకు సంబంధించిన విజేతలను నిర్ణయించిన తర్వాత ఒక్కో విజేత పేరుని ఒక్కో కార్డులా తయారు చేస్తారు. వాటిని ఆయా శాఖ పేరు ముద్రించిన కవర్లలో భద్ర పరుస్తారు. ఈ 24 కవర్లను రెండు బ్రీఫ్‌కేసులలో పెడతారు. ఒకవేళ పొరపాటున ఈ బ్రీఫ్‌కేసులు పోతే..? అందుకే విజేతలను నిర్ణయించిన బ్రియాన్ కల్లినన్, మార్తా రూయిజ్లువారి పేర్లను తమ మనసులో గుర్తుంచుకుంటారు. అది అవార్డు కమిటీ నిబంధన. విజేతల ఎంపిక పూర్తయ్యి, బ్రీఫ్‌కేసులు రెడీ అయిన క్షణం నుంచీ ఈ ఇద్దరినీ సెక్యుర్టీ గార్డులు వెన్నంటే ఉంటారు. ఆస్కార్ అవార్డు వేడుక ముగిసే వరకు ప్రకృతి అవసరాలు మినహా కాపలాదారుల కనుసన్నల్లోనే ఈ ఇద్దరూ ఉండాలి. చివరి నిమిషం వరకూ విజేతల వివరాలు బ్రియాన్, మార్తాలకు తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు. నామినీలకూ 'కోట్లు'! పోటీలో అందరూ గెలవాలని ఎక్కడా ఉండదు. గెలిచినవాళ్లకు ఆనందం, గెలవనివాళ్లకు బాధ కూడా సహజమే. అందుకే, నామినేషన్‌తో సరిపెట్టుకున్నవారికి కొంతలో కొంత ఊరట ఇచ్చే విధంగా ఆస్కార్ అవార్డ్ కమిటీ వారికి ఒక్కొక్కరికీ లక్షా 68 వేల డాలర్లు (సుమారు కోటి రూపాయలకు పైగా) విలువ చేసే బహుమతులు ఇచ్చింది. వీటిని ఓ పెద్ద బ్యాగ్‌లో ఉంచి ఇస్తారు. అందులో ఏమేం ఉంటాయంటే... బ్రాండెడ్ స్ప్రే, సోప్ లిప్ గ్లాస్ హెర్బల్ టీ, యాపిల్స్ స్త్రీలకు బ్రాండెడ్ మణికట్టు గొలుసు, పురుషులకు మంచి టైలు అలెక్సిస్ సెలెజ్కీ అనే ఫిజికల్ ట్రైనర్ దగ్గర పది సెషన్స్ ఉచిత శిక్షణ చర్మ, కేశ సంరక్షణకు సంబంధించిన సౌందర్య సాధనాలు హోమ్ స్పా సిస్టమ్ ఓ ఐదు నక్షత్రాల హోటల్లో మూడు పగలు, రెండు రాత్రులు గడిపే సౌకర్యం లగ్జరీ రైల్ ట్రిప్ ఓ జ్యోతిష్కుడు నామినీల ఇంటికెళ్లి ఈ ఏడాది వారి జాతకం ఎలా ఉందో చెప్పే వెసులుబాటు. ఇలా పలు రకాల బహుమతులు ఉంటాయి. ఎర్ర గులాబీలు ‘‘అందమైన భామలు.. లేత మెరుపు తీగలు.. ముట్టుకుంటే మాసిపోయె వన్నెల అందాలు...’’ అందాల భామలను చూసినప్పుడు ఈ పాట గుర్తుకు రావడం ఖాయం. ఆస్కార్ వేడుకలో ఎర్ర తివాచీపై ఒయ్యారాలు పోయిన అందగత్తెలను చూసి, ఇంగ్లిష్‌వాళ్లు ఏం పాటేసుకున్నారో కానీ.. మన తెలుగువాళ్లు మాత్రం ఈ పాట పాడుకోకుండా ఉండలేరు. ప్రతి ఏడాదీ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో రెడ్ కార్పెట్‌పై ‘కాట్ వ్యాక్’ చేసే నటీమణులను వీక్షించడానికి చాలామంది టీవీలకు కళ్లప్పగించేస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. చూపులు తిప్పుకోవడం కష్టమైందట. నిజమే కదూ... విజేతలు వీరే! ఉత్తమ చిత్రం: బర్డ్‌మ్యాన్ ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్మెయిన్ ఉత్తమ నటి: జూలియన్ మూర్ ఉత్తమ సహాయ నటుడు: జె.కె. సిమ్మన్స్ (‘విప్‌ల్యాష్’) ఉత్తమ సహాయనటి: ప్యాట్రీషియా ఆర్క్వెట్టె (బాయ్‌హుడ్) ఉత్తమ యానిమేటడ్ మూవీ: ‘బిగ్ హీరో సిక్స్’ ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎమాన్యుయెల్ లుబెజ్కీ (‘బర్డ్‌మ్యాన్’) ఉత్తమ వస్త్రాలంకరణ: మిలెనా కానొనెరో (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్) ఉత్తమ దర్శకుడు: అలె గ్జాండ్రో ఇనారిట్ (బర్డ్‌మ్యాన్) ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సిటిజన్ ఫోర్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: క్రైసిస్ హాట్‌లైన్ - వెటరన్స్ ప్రెస్ వన్ ఉత్తమ కూర్పు: టామ్ క్రాస్ (‘విప్‌ల్యాష్’) ఉత్తమ విదేశీ భాషా చిత్రం: పోలండ్ చిత్రం ‘ఇదా’ ఉత్తమ మేకప్ - కేశాలంకరణ: ఫ్రాన్సెస్ హానన్, మార్క్ కౌలియర్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్) ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (అలెగ్జాండ్రె డెస్ప్లాట్) ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గ్లోరీ... (చిత్రం ‘సెల్మా’) ఉత్తమ ప్రొడక్ష న్ డిజైన్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఆడమ్ స్టాక్హొజెన్, అన్నా పినోక్) ఉత్తమ యానిమేటెడ్ లఘుచిత్రం: ‘ఫీస్ట్’ (ప్యాట్రిక్ ఓస్బోర్న్, క్రిస్టీనా రీడ్) ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ‘ది ఫోన్ కాల్’ ( మ్యాట్ కిర్క్‌బీ, జే మ్స్ లూకాస్) ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: ‘అమెరికన్ స్నైపర్’ (ఏలన్ రాబర్ట్ ముర్రే బుబ్ అస్మాన్) ఉత్తమ సౌండ్ మిక్సింగ్: ‘విప్‌ల్యాష్’ (క్రెగ్మాన్, బెన్ విల్కిన్స్, థామస్ కర్లే) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ‘ఇంటర్స్టెల్లార్’ (పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్లే, ఇయాన్ హంటర్, స్కాట్ ఫిషర్) ఉత్తమ ఎడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: ‘ది ఇమిటేషన్ గేమ్’ (గ్రాహమ్ మూర్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: అలె గ్జాండ్రో ఇనారిట్ (‘బర్డ్‌మ్యాన్’)