breaking news
organistions
-
ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!
ఇంటికి కాళ్లుంటే! ఇదిగో ఈ ఫొటోలో ఉన్నట్లే ఉంటుంది. ఈ ఇంటికి ఉన్న కాళ్లు కర్రకుర్చీకి ఉన్నలాంటి కదలని కాళ్లు కావు. ఎక్కడకనుకుంటే అక్కడకు నడిచే కాళ్లు. తమపై నిర్మించిన ఇంటిని ఎక్కడకనుకుంటే అక్కడకు మోసుకుపోయే కాళ్లు. ఫ్రాన్స్‌లోని ‘యూబిసాఫ్ట్’ సంస్థకు చెందిన త్రీడీ డిజైనర్ ఎంకో ఎన్షెవ్ వైరైటీగా ఈ కదిలే కాళ్లు గల ఇంటికి రూపకల్పన చేశాడు. ఇంటికి ఏర్పాటు చేసిన ‘మెకానికల్ లెగ్స్’ అడుగులు ముందుకు వేస్తూ ఎక్కడకు నిర్దేశిస్తే అక్కడకు చేరుకోగలవు. ఎలాంటి మిట్టపల్లాలనైనా సునాయాసంగా దాటగలవు. ఇదొక ‘రెట్రో–ఫ్యూచరిస్టిక్’ డిజైన్ అని ఎన్షెవ్ చెబుతున్నాడు. భవిష్యత్తులో పిక్నిక్లు వంటి అవసరాల కోసం వాహనాలకు బదులుగా ఇలాంటి ఇళ్లు వినియోగంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని త్రీడీ డిజైనింగ్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: Pratima Joshi: ‘బస్తీ చిన్నది... భలేగున్నది’ అనుకునేలా చేసింది.. -
ఆర్టీసీ చైర్మన్‌కు వినతి పత్రాల అందజేత
రామగిరి : ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ సోమవరపు సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. నల్లగొండ డిపో ఆవరణలో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఆర్టీసీలో ఉద్యోగ విరమణ పొందిన వారికి రెండు సంవత్సరాల నుంచి బెనిఫిట్స్ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల యాదయ్య, కార్యదర్శి పల్రెడ్డి యాదగిరిరెడ్డి, కోశాధికారి భువనగిరి శంకరయ్య, ఉప కార్యదర్శి బోయపల్లి ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు. ఆర్టీసీలో 50శాతం రాయితీ కల్పించాలి వయోవృద్ధులకు ఆర్టీసీ ప్రయాణంలో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ గురువారం సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధులకు ఆర్టీసీ ప్రయాణ రాయితీ కల్పించిందని పేర్కొన్నారు. ఈ విషయం పట్ల ప్రభుత్వంతో చర్చించి వెంటనే 50శాతం రాయితీ కల్పించే విధంగా నిర్ణయించాలని విన్నవించారు. వినతి పత్రం అందజేసిన వారిలో జి.సుదర్శన్‌రెడ్డి, పి.యాదయ్య, కంది మట్టపల్లి తదితరులున్నారు.