breaking news
opposit
-
రాజీవ్ ప్రధాని కావడాన్ని వ్యతిరేకించా
న్యూఢిల్లీ: భర్త రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ౖచైర్‌పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’తో కొంత దుమారం చెలరేగడం ఖాయమని మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘ఈ పుస్తకం బయటకు వచ్చాక కొంత ‘తమాషా’జరగడం ఖాయం. దశాబ్దాలుగా ఇతరులు నా ‘కథ’చెబుతూ వచ్చారు. ఇప్పుడు నా వంతు వచ్చింది’’అని సోనియా ఎక్స్‌లో పేర్కొన్నారు. సుమారు వారం రోజుల క్రితం సోనియా మొట్టమొదటిసారి సొంత అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో ప్రవేశించగా.. తాజాగా ఎక్స్‌లోనూ రంగ ప్రవేశం చేశారు. ఎక్స్‌లో మంగళవారం తన రెండో పోస్టు చేస్తూ దానికి ఒక వీడియోను జత చేశారు. దాదాపు ఒక నిమిషం 28 సెకన్లు ఉన్న ఈ వీడియోలో సోనియా తన ఆత్మకథ పేజీలను తిరగేస్తూ కనిపించారు. ‘‘మొత్తం కథ చెప్పాలో లేదో నాకు తెలియడం లేదు’’కానీ.. ‘‘రాజీవ్‌ను ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేసినప్పుడు నేను పూర్తిగా వ్యతిరేకించాను..’’అని వ్యాఖ్యానించారు. ఆ వీడియోలో చాలామంది తన గురించి దశాబ్దాలుగా రాస్తూ వచ్చారని, వీటిల్లో కొన్ని వాస్తవాలకు దూరంగా ఉంటే.. చాలావరకూ కల్పించి రాసినవేనని సోనియా చెప్పారు. ఇంకొన్ని అంశాల్లో అతిశయోక్తులు జోడించారని తెలిపారు. అందుకే వాస్తవాలను యథాతథంగా వివరించేందుకు ఈ పుస్తకం రాశానని చెప్పుకొచ్చారు. ప్రజల్లో నా గురించి ఎన్నో అభిప్రాయాలు ఉండవచ్చు. పుస్తకం చదివిన తరువాత కొందరు దాన్ని మార్చుకోవచ్చు.. మరికొందరి అభిప్రాయం మరింత తక్కువ స్థాయికి చేరవచ్చు. ఆత్మకథ రాసినప్పుడు ఇదే జరుగుతుంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని తమాషాలు జరిగే తీరతాయి’’అని వ్యాఖ్యానిచారు. సోనియా తాజా ఎక్స్ పోస్టు ఆధారంగా చూస్తే ఆమె ఆత్మకథలో రాజకీయంగా సున్నితమైన వ్యక్తిగత, రాజకీయ అంశాలు ఉండే అవకాశం ఉంది. -
జమిలి ఎన్నికలు అప్రజాస్వామికం
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల యోచనను కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించింది. ఈ విధానం సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని పేర్కొంది. ఒకే దేశం–ఒకే ఎన్నికల ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టాలని, దీనిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీని రద్దు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు ఈ మేరకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఒకే విడతలో ఎన్నికల కోసం సగం పదవీ కాలం కూడా పూర్తవని అసెంబ్లీలను రద్దు చేస్తే ఓటర్ల హక్కులను కాలరాయడమేనన్నారు. -
ప్రతిపక్షాల భేటీ: బీజేపీకి పోటీగా మహాకూటమి పేరు ఇదే..!
బెంగళూరు: 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా రెండో రోజు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష కూటమికి ఓ కొత్త పేరును సూచించారు. అయితే.. కూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేసినట్లు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల డిన్నర్ మీటింగ్ నిన్న బెంగళూరులో జరిగింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు. ఇదీ చదవండి: కులతత్వ విషం, అపారమైన అవినీతి.. వాళ్ల దుకాణాల్లో దొరికేవి ఇవే: విపక్షాలపై మోదీ ఫైర్ -
ఎటీకి ఎదురీది.. చేపలను వేటాడి
శ్రీశైలం జలాశయంలో నీటికుక్కలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కేవలం వరద సమయాల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. నీటికుక్కలు లేదా నీటిపిల్లులుగా పిలవబడే వీటి శాస్త్రీయనామం లుక్ట్రాగన్. దీనిమూతి ‘వి’ ఆకారంలో ఉండి తోక భాగం తెడ్డు ఆకారంలో ఉంటుంది. వరద ప్రవాహనికి ఎదురీతూ వెళ్లి చేపలను ఆహారంగా తింటుంటాయి. ఇవి శ్రీశైలం జలాశయంలో కనిపించడంతో వాటిని చూసిన పర్యాటకులు వాటి వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. – డి. హుసేన్, – ఫొటో గ్రాఫర్


