breaking news
online certificates
-
ఏపీ: ఇక ఆన్లైన్లోనే వివాహ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఇక వివాహ రిజిస్టేషన్లు మరింత సులభతరం కానున్నాయి. ఆన్లైన్లోనే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాన్యువల్‌గా రిజిస్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు అవసరమైన ఫొటోలు, ఆధార్ కార్డ్‌లు, ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లు సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫామ్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్‌కి ఇచ్చేవారు. ఆయన దాన్ని సరిచూసి పుస్తకంలో నమోదు చేసుకునేవారు. ఆ తర్వాత సర్టిఫికెట్‌పై సంతకం పెట్టి దాన్ని ఇచ్చేవాళ్లు. ఇకపై ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగనుంది. ఇక నుంచి ఆన్లైన్లోనే.. www.registrations.ap.gov.inలో హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలు అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. హిందూ వివాహమైతే దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్ లేదా ఇ–మెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అనంతరం ఆన్లైన్లోనే ఫామ్‌ని పూర్తి చేసి, ఆధార్ కార్డ్‌లు, పెళ్లి ఫొటోలు, పదో తరగతి సరి్టఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రార్‌కి ఆఫీసుకు వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజి్రస్టేషన్ల చట్టం ప్రకారం.. కచ్చితంగా రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలని ఉండడంతో స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లాలి. సమగ్ర ఆరి్థక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చలానా ద్వారా కట్టే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తును సబ్ రిజిస్ట్రార్‌కి ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి.. సాక్షులతో సంతకాలు పెట్టించుకుని వెంటనే సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. రిజిస్ట్రేటేషన్ అయ్యాక సర్టిఫికెట్లో వాళ్ల ఫొటోలూ జతచేస్తున్నారు. ఆ తర్వాత అదే ఆన్‌లైన్‌లోనూ వస్తుంది.మొన్నటివరకు ఒకరోజు తర్వాత సర్టిఫికెట్ ఇస్తుండగా ఆన్లైన్లో వెంటనే రానుంది. ప్రత్యేక వివాహాలకు ఇలా.. హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్లిళ్లను ప్రత్యేక వివాహాల కింద రిజి్రస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వెబ్సైట్లో ప్రత్యేకంగా అవకాశం కలి్పంచారు. దీనికి ఒక నెల నోటీసు పీరియడ్ ఉంటుంది. అంటే నెల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానిపై రిజి్రస్టార్ కార్యాలయం అభ్యంతరాల స్వీకరణకు బోర్డులో నోటీసును పెడుతుంది. అభ్యంతరాలు లేకపోతే నెల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు. మరింత మెరుగ్గా సేవలు.. ఈ ఆన్లైన్ విధానానికి ఇంకా మెరుగులు దిద్దుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఫిజికల్ సిగ్నేచర్ కాకుండా డిజిటల్ సిగ్నేచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. సీఎఫ్ఎంఎస్ ద్వారా చలానా కట్టే విధానాన్ని ఇంకా సులభతరం చేయనున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా కూడా చెల్లించే అవకాశం కలి్పంచనున్నారు. అలాగే ఆధార్ అథెంటికేషన్‌ను కూడా ఆన్లైన్లోనే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. తద్వారా వివాహ రిజి్రస్టేషన్లను ఆన్లైన్లోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ విధానాన్ని లాంఛనంగా పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు. అప్పటివరకు వివాహ రిజి్రస్టేషన్లు ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో జరగనున్నాయి. పక్కాగా వివాహ సమాచారం ఆన్లైన్ విధానం వల్ల వివాహ సమాచారం పక్కాగా ఉంటుంది. ఏ రోజు ఎన్ని పెళ్లిళ్లు జరిగాయనే వివరాలు ఉంటాయి. ప్రస్తుతం ఏటా 3 నుంచి 4 లక్షల హిందూ వివాహాలు నమోదవుతున్నాయి. అలాగే 50 వేల లోపు ప్రత్యేక వివాహాలు జరుగుతున్నాయి. ఆన్లైన్ విధానంతో వీటి రిజి్రస్టేషన్లు సులభతరం కానున్నాయి. – వి.రామకృష్ణ, కమిషనర్, అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. -
టెన్త్ నుంచి పీహెచ్డీ వరకు.. ఆన్లైన్లో సర్టిఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి నుంచి పీహెచ్డీ) వరకు సర్టిఫికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు చాలామంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లతో వచ్చినట్లు బయటపడింది. దీంతో వీటి నిరోధానికి చర్యలు చేపట్టాలని వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన పోలీసు విచారణకు ఆదేశించారు. మరోవైపు టీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వివిధ వర్సిటీల వీసీలతో మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు. నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ వెబ్‌సైట్‌తోపాటు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో సర్టిఫికెట్లను ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 7, 8 తేదీల్లో మరోసారి అధికారులు, వీసీలు, ఐటీ కంపెనీల ప్రతినిధులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణకు వేరుగా ఇంటర్ పరీక్షలు కాగా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఏపీతో సంబంధం లేకుండా వేరుగా ప్రశ్నపత్రాలు ఇచ్చి నిర్వహిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.