జాబ్ మేళాలో వెయ్యిమందికి ఉద్యోగాలు
జాబ్‌మేళాకు అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలులో శనివారం నిర్వహించిన జాబ్ మేళా అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మేళాకు సుమారు 4 వేల మంది వరకు హాజరయ్యారని, వాళ్లలో దాదాపు వెయ్యిమందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన తెలిపారు.
అయితే ఈసారికి ఉద్యోగం రానివాళ్లు మాత్రం నిరుత్సాహపడొద్దని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. అలాంటివారి కోసం త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసి, వారికి తగిన శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు.