breaking news
Onamalu
-
ఘనంగా 'తెలంగాణ కథలు'ను ప్రారంభించిన ఓనమాలు..!
ప్రాంతీయ పాక వారసత్వం, సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవంగా జరుపుకోవాలనే ఆశయంతో తెలంగాణ కథలు’ను ఘనంగా ప్రారంభించింది ’ఓనమాలు‘. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)కి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం, తెలంగాణ ప్రాంత వంటకాలు, కళలు, కథలను పండుగలా నిర్వహించింది. చిత్రనిర్మాతలు, కవులు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు , ఆహార ప్రియులను ఒకచోటకు చేర్చి, వారికి అద్భుతమైన అనుభవాన్ని అందించింది అనడంలో సందేహం లేదు.ఈ వేడుకలో కరీంనగర్ మహిళలు తయారుచేసిన సర్వపిండి, బక్షాలు, జొన్న రొట్టె, కామారెడ్డి నుంచి మక్క పేలాలు, వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు స్థానికంగా లభించే పండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి గోండులు, మహువా సమాజానికిచెందిన గుస్సాడి నృత్యం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఈ వేడుకకు ఉత్సాహభరితమైన ప్రాంతీయ సౌరభాలను సమరకూర్చాయి. “తెలుగును ఒకమాటలో వర్ణించలేం. ఒకే ఒక్క సాధారణ స్వరంలో చెప్పలేం. ఇది వెయ్యి సూక్ష్మ కథలతో, అనేక ఉప-ప్రాంతీయ వైవిధ్యాలతో జమిలిగా అల్లిన కథ. దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, వినడానికి, కనుమరుగవుతున్న వాటిని సంరక్షించడానికి మేము ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, హైదరాబాద్ కోసం సూక్ష్మ-ప్రాంతీయ సంఘాలను నిర్మిస్తున్నాము, ”అని ది క్యులినరీ లాంజ్ CEO , ఓనమాలు ఉద్యమంలో కీలక సూత్రధారి గోపి బైలుప్పల అన్నారు. “ఈసారి, ప్రయాణం ఎప్పుడూ లేనంతగా ఇంటికి దగ్గరగా ఉంది.” అని పేర్కొన్నారు.ఈ ప్రాంతీయ సంఘాలు నెలవారీ మాస్టర్‌క్లాస్‌లు, సాంస్కృతిక చర్చలను నిర్వహిస్తాయి, ఔత్సాహికులకు స్థానిక ఆహారం, సాహిత్యం, సంప్రదాయాలను అన్వేషించడానికి ఒక వేదికను అందిస్తాయన్నారు. ఈ దృష్టి కేంద్రీకృత సమాజ కార్యక్రమాల శ్రేణిలో తెలంగాణ కథలు మొదటి అధ్యాయం. ఈ కార్యక్రమంలో అన్విక్షికి పబ్లిషర్స్ వ్యవస్థాపకుడు వెంకట్ సిద్ధా రెడ్డి కూడా పాల్గొన్నారు.ఆయన పాక పునరుజ్జీవనం, సాహిత్య పునరుజ్జీవనం మధ్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు “అన్విక్షికి తెలుగు సాహిత్యాన్ని పునరుద్ధరించే దృక్పథంతో స్థాపించారు. స్థానిక వ్యాపారాలలో చిన్న స్వయం-సేవ పుస్తక దుకాణాలు, చలనచిత్ర నిర్మాణ కార్యాలయాలలో లైబ్రరీల ద్వారా తాము తమ పరిధిని విస్తరిస్తున్నామని వెంకట్ తెలిపారు. ఈ చొరవ పాఠకుల సంఖ్యను, ఆదాయాన్ని అందిస్తూనే ఆయా ప్రదేశాలకు సాంస్కృతిక విలువను జోడిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం ’బలగం‘తో అవార్డు గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి, మరో అవార్డు గ్రహీత, తెలుగు రచయిత పెద్దింటి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ది క్యులినరీ లాంజ్‌లో అన్విక్షికి ప్రత్యేక పుస్తకాల షెల్ఫ్‌ను ప్రారంభించారు.ప్రముఖ విద్యావేత్త, నటీ గీతా భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ అమర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ వంటలను ఆస్వాదించి, నిర్వహకులను అభినందించారు.బలగం డైరెక్టర్ వేణు మాట్లాడుతూ సర్వపిండి, బక్షాలను గురించి ఈతరం పిల్లలకు తెలియదనీ, భవిష్యత్ తరానికి తెలంగాణ పురాతన వంటకాల గురించి తెలియజేయడానికి ఓనమాలు చేస్తున్న ప్రయత్నం గొప్పదనీ ప్రస్తుతించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.ఓనమాలు గురించితెలుగు మాట్లాడే రాష్ట్రాలలోని వైవిధ్యమైన పాక వారసత్వాన్ని సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం, వాటిని ముందుతరాలకు అందించే లక్ష్యంతో 2024లో లాంచ్ అయింది ’ఓనమాలు‘ అనే కమ్యూనిటీ ఇనీషియేటివ్. సూక్ష్మ వంటకాలను అన్వేషించడం, పురాతన వంటకాలను పునరుద్ధరించడం, పరిశోధన, వాటి గురించి సవివరంగా చెప్పడం, ఆచరణాత్మక అనుభవాల ద్వారా కమ్యూనిటీలను నిమగ్నం చేయడమే ఓనమాలు లక్ష్యం. డాక్టర్ ఎ.వి. గురవా రెడ్డి KIMS-SUNSHINE హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ITEC), పరిశ్రమలు అండ్ వాణిజ్య విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణలో సీనియర్ IAS అధికారి జయేష్ రంజన్ ’ఓనమాలు‘ను ప్రారంభించారు. గత సంవత్సరంలో ఓనమాలు 27,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, పెద్దలు, రైతులు, గృహ వంటవారు. ఇతర నిపుణులను కలిసి, కనుమరుగవుతున్న రుచులను, మరచిపోయిన పాక పద్ధతులను తిరిగి గుర్తించారు. ఈ వేదిక ఫ్లూట్ రిసిటల్స్, పాక థియేటర్ ప్రదర్శనలు, సాంప్రదాయ రుచికరమైన వంటకాలను అందించే లైవ్ ఫుడ్ స్టేషన్ల నిర్వహణతో రుచి, సంప్రదాయం ద్వారా తరాల అంతరాలను తగ్గిస్తోంది. తెలుగు పాక పరి జ్ఞానాన్ని సంరక్షించి, గర్వంగా అందించేలా వంట మ్యూజియంను స్థాపించడం, ట్రైనింగ్ వర్క్‌షాప్‌లను నిర్వహించడంతోపాటు, గృహిణులు, చెఫ్‌లు, ఆహార చరిత్రకారులు, సాంస్కృతిక నిపుణులతో సహకారాన్ని పెంపొందించడం అనేవి ఓనమాలు భవిష్యత్ ప్రణాళికలు.(చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..) -
మనసును మెలిపెట్టే ప్రేమకథ
‘‘ ‘నిన్ను నన్ను విడదీసిన విధిపై నాకు అపారమైన నమ్మకం! ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ అది మనల్ని కలుపుతుందని’... చలం ‘ప్రేమలేఖ’ల్లో చిన్న లైన్ ఇది. మా సినిమా లైన్ కూడా సింపుల్‌గా అదే. హృదయాలను బరువెక్కించే ప్రేమకథలొచ్చి చాలాకాలమైంది. ఆ లోటును మా సినిమా తీర్చేస్తుంది’’ అని ‘ఓనమాలు’ చిత్రం ఫేమ్ క్రాంతిమాధవ్ అన్నారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడారు క్రాంతిమాధవ్. ‘‘అద్భుతమైన స్క్రిప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. మలినం లేని ప్రేమంటే ఏంటో ఈ సినిమాలో చూపిస్తున్నాం. శర్వానంద్, నిత్యామీనన్‌లు తమ పాత్రల్ని ప్రేమించి ఈ సినిమా చేస్తున్నారు. శర్వా ఇందులో స్పోర్ట్స్‌మేన్. దానికి తగ్గట్టుగా తన శారీరకభాషను మార్చుకున్నారు. శర్వా, నిత్యాలు లేని సన్నివేశం ఈ సినిమాలో ఒక్కటీ ఉండదు. తెలుగులో చాలాకాలం తర్వాత వస్తున్న మనసును మెలిపెట్టే ప్రేమకథ ఇది. సాంకేతికంగా కూడా ఈ సినిమా అభినందనీయంగా ఉంటుంది. బుర్రా సాయిమాధవ్ మాటలు, జ్ఞానశేఖర్ కెమెరా ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న కథ ఇది. అందుకే, మలయాళంలో నంబర్‌వన్ సంగీత దర్శకునిగా భాసిల్లుతున్న గోపీసుందర్‌ని సంగీత దర్శకునిగా తీసుకున్నాం. 20 రోజుల పాటు వైజాగ్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. ‘ఓనమాలు’ నా అభిరుచిని బయటపెట్టిన సినిమా అయితే... ఇది కమర్షియల్‌గా నేనేంటో తెలియజెప్పే సినిమా అవుతుంది’’అని చెప్పారు క్రాంతిమాధవ్. -
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
‘ఓనమాలు’ చిత్రంతో సెన్సిబుల్ డెరైక్టర్ అనిపించుకున్న క్రాంతిమాధవ్ మరో విభిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో శర్వానంద్, నిత్యామీనన్ నటిస్తున్నారు. వీరిద్దరూ కథ వినగానే సెకండ్ థాట్ లేకుండా ప్రాజెక్ట్‌కి పచ్చ జెండా ఊపారట. అగ్ర నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానుంది. చిరంజీవి-కేఎస్ రామారావు కాంబినేషన్లో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రంలోని ఓ పాట పల్లవి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ని ఈ చిత్రానికి టైటిల్‌గా అనుకుంటున్నారట. -
‘ఓనమాలు’ దర్శకుడితో సినిమా
‘అమ్మ చెప్పింది, గమ్యం, ప్రస్థానం, జర్నీ’... నటుడిగా శర్వానంద్ ఏంటో చెప్పడానికి ఈ నాలుగు సినిమాలు చాలు. సెలక్ట్టివ్గా సినిమాలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకులందరికీ చేరువయ్యారు శర్వానంద్. ప్రస్తుతం ఆయన చేరన్ దర్శకత్వంలో ‘ఏమిటో ఈ మాయ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యామీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఇదిగాక మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారాయన. ఇదిలావుంటే... ఈ సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి శర్వా పచ్చజెండా ఊపారనేది ఫిలింనగర్ టాక్. ‘ఓనమాలు’ వంటి డీసెంట్ మూవీని ప్రేక్షకులకు అందించిన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాలో కూడా కథానాయిక నిత్యామీననే అని తెలుస్తోంది. అగ్ర నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వినికిడి. క్రాంతిమాధవ్ కథ శర్వానంద్‌కి బాగా నచ్చడంతో ఈ చిత్రంలో నటించాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. శర్వానంద్ నటించనున్న సినిమా అంటే.. ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకుల అంచనాలు. ‘ఓనమాలు’ ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు క్రాంతిమాధవ్... ఈ చిత్రం ద్వారా ఎలాంటి ఫీట్ చేస్తారో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.