breaking news
OmPuri
-
అమ్మోరు గుర్తుకొస్తోంది – నందినీరెడ్డి
‘నరసింహ’ చిత్రంలో నీలాంబరి, ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రమ్యకృష్ణ. తాజాగా ‘మాతంగి’గా ప్రేక్షకులను అలరించబోతున్నారు రమ్య. ఆమె ప్రధాన పాత్రలో కన్నన తమ్మార్కులమ్ దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ ‘మాతంగి’ని అదే పేరుతో రమ్యకృష్ణ సోదరి వినయకృష్ణన్ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 15న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘రమ్యగారికి వినయ బిగ్గెస్ట్ క్రిటిక్. ఆమెకు ఏదీ త్వరగా నచ్చదు. ‘మాతంగి’ని ఆమె తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారంటే ఈ చిత్రంలో ఏదో విషయం ఉంటుంది. రమ్యగారి ‘మాతంగి’ లుక్ చూస్తుంటే ‘అమ్మోరు’ సినిమా గుర్తుకొస్తోంది’’ అన్నారు. ‘‘తెలుగులో మేం తొలిసారి చేస్తున్న చిన్న ప్రయత్నం ‘మాతంగి’. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఎడిట్ చేసింది కృష్ణవంశీగారే’’ అన్నారు రమ్యకృష్ణ. ఈ వేడుకలో రమ్యకృష్ణవంశీల తనయుడు రిత్విక్ పాల్గొన్నాడు. నటుడు ఓంపురి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి రచన: వెన్నెలకంటి, సంగీతం: రతీష్ వేగ. -
ఆస్కార్‌కూ ‘ట్రంప్’ మంటలు!
- ముస్లిం దేశాలపై నిషేధానికి నిరసనగా వేడుకలకు రాని ఇరాన్ డైరెక్టర్ అస్ఘర్ ఫర్హాదీ - ట్రంప్ విధానాలపై మండిపాటు - ఆరు ఆస్కార్లు గెల్చుకున్న ‘లా లా ల్యాండ్’ - ఉత్తమ చిత్రంగా మూన్లైట్ ‘ట్రంప్’మంటలు ఆస్కార్ అవార్డులకూ పాకాయి! ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని నిరసిస్తూ ఇరాన్‌కు చెందిన చిత్ర దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ... అవార్డు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఉత్తమ విదేశీ విభాగంలో ‘ది సేల్స్‌మేన్’ ఆస్కార్‌ను గెల్చుకోగా.. అవార్డును అందుకునేందుకు ఆయన రావాల్సి ఉంది. అయితే ట్రంప్ విధానాలపై మండిపడుతూ ఈ కార్యక్రమానికి ఫర్హాదీ దూరంగా ఉండిపోయారు. ఇదిలా ఉండగా ఈసారి ఉత్తమ చిత్రంగా ‘మూన్లైట్’ఎంపికైంది. ఈ చిత్రం మొత్తం మూడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 14 కేటగిరీల్లో నామినేట్ అయిన ‘లా లా ల్యాండ్’చిత్రానికి ఆరు అవార్డులు దక్కాయి. ఒక్క అడుగు... భగవంతుణ్ణి అదొక్కటీ అడుగు... లైఫ్‌లో ఒక్కసారైనా ఆస్కార్‌తో అడుగేయాలని అడుగు... చిత్రసీమలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఆస్కార్ గెలిచి, అవార్డు వేదికపై ఓ అడుగేయాలనుకుంటారు. కొందరికి ఛాన్స్ త్వరగా వస్తుంది. మరికొందరికి లేటుగా వస్తుంది. అవకాశం ఎప్పుడొచ్చినా ఆస్కార్ అందుకున్న తర్వాత వేసే మొదటి అడుగు లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఉత్తమ నటి, నటుడు, దర్శకుడు, సహాయ నటి, సహాయ నటుడు, సంగీత దర్శకుడు... 89వ ఆస్కార్స్‌లో ముఖ్యమైన కేటగిరీల్లో తొలి అవార్డు (ఫస్ట్ స్టెప్) గెల్చుకున్నోళ్లు ఎక్కువమందే ఉన్నారు. ఈ ఫస్ట్ స్టెప్ మరిన్ని సక్సెస్ స్టెప్స్ వేసే జోష్, ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటూ... కంగ్రాచ్యులేషన్స్ టు ఆస్కార్ విన్నర్స్. 2017 ఆస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం: మూన్లైట్; ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్ (మాంచెస్టర్ బై ద సీ); ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్) ; ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా ల్యాండ్) ; ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ (మూన్ లైట్) ; ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్ (ఫెన్సెస్) ; ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం ; ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్టస్ ; ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా ; ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్ ; ఉత్తమ సౌండ్ ; మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్ ; ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: జాన్ గిల్బర్ట్ ; ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్మ్యాన్ (ఇరాన్ ) ; బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా ; బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్ ; ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్ ; బెస్ట్ విజువల్ ఎఫెక్టస్: ద జంగిల్ బుక్ ; బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్ ; బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్ ; బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్ ; బెస్ట్ ఒరి జినల్ ; స్కోర్: లా లా లాండ్ ; బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్ (లా లా ల్యాండ్) ; బెస్ట్ ఒరిజినల్ స్కీన్ర్‌ప్లే: మాంచెస్టర్ బై ద సీ ; బెస్ట్ అడాప్టెడ్ స్కీన్ర్‌ప్లే: మూన్లైట్ ఆ గీత చెరగాలి – అస్ఘర్ ఫర్హాదీ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇరానియన్ మూవీ ‘ది సేల్స్‌మేన్’కు అవార్డు దక్కింది. ఆ చిత్రదర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల తన ఆగ్రహావేదనను వ్యక్తం చేశారు. ‘‘ముస్లిమ్ దేశాలపై ట్రంప్ విధించిన ‘ట్రావెల్ బ్యాన్’కు నిరసనగా ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తన మనోభావాలను లిఖితపూర్వకంగా ఆస్కార్ అవార్డు కమిటీకి పంపించారు. ‘‘పలు ముస్లిమ్ దేశాల పౌరులపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ దేశాలను, అక్కడి ప్రజలను గౌరవిస్తున్నాను. అందుకే అవార్డు తీసుకోవడానికి రాలేదు. ప్రపంచాన్ని మనము, మన శత్రువులు అని విభజించడం భయంగా ఉంది. యుద్ధానికి దారి తీసే ఘోరమైన నిర్ణయాలివి. ఇది సరికాదు. ఫిలిం మేకర్స్ తమ కెమేరాలను ఎక్కుపెట్టి కుల, మతాలనే అడ్డుగోడను చెరిపేయగలరు. ‘మేము, ఇతరులు.. అనే ఆ ఇద్దరి మధ్య సమానత్వాన్ని పెంపొందించగలరు. ఈరోజు ఆ సమానత్వం చాలా అవసరం’’ అంటూ అస్ఘర్ మనోభావాలను హోస్ట్ చదివారు. విన్న వీక్షకులు ఉద్వేగానికి గురయ్యారు. కొందరు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నా హార్ట్ ముక్కలైందన్నాడు! – ఉత్తమ నటుడు క్యాసే ఎఫ్లెక్ ఉత్తమ నటుడిగా క్యాసే ఎఫ్లెక్ పేరు ప్రకటించగానే, అతడు సీట్లో నుంచి వెంటనే లేచి తన అన్నయ్య బెన్ ఎఫ్లెక్ వద్దకు వెళ్లి కౌగిలించుకున్నారు. ఆల్రెడీ ఉత్తమ చిత్రం (నిర్మాతగా), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (మాట్ డామన్తో కలసి).. రెండు సార్లు్ల బెన్ ఎఫ్లెక్ ఆస్కార్స్ అందుకున్నారు. ఇప్పుడు క్యాసే ఎఫ్లెక్కి అవార్డు రావడంతో ఆస్కార్స్ అందుకున్న సిబ్లింగ్స్ (తోబుట్టువులు) లిస్టులో ఈ అన్నదమ్ములిద్దరూ 16వ స్థానం సంపాదించారు. ఇక, అవార్డు స్వీకరించిన తర్వాత క్యాసే ఎఫ్లెక్ మాట్లాడుతూ – ‘‘నాకు ఎలా నటించాలో నేర్పిన మొదటి వ్యక్తుల్లో దర్శక–నటుడు డెంజెల్ వాషింగ్టన్ ఒకరు. జస్ట్.. ఇప్పుడే ఆయన్ను కలిశాను. థాంక్యూ! ఈ అవార్డు నాకెంతో విలువైనది. ఆస్కార్ కమ్యూనిటీలో భాగం కావడం నా అదృష్టం. ఇంతకు మించి మాటలు రావడం లేదు. ‘మాంచెస్టర్ బై ద సీ’ యూనిట్ సభ్యులకు థ్యాంక్స్. బెన్... ఐ లవ్ యూ’’ అన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ స్పీచ్‌లో అన్నయ్య బెన్ ఎఫ్లెక్ పేరును క్యాసే ప్రస్తావించలేదు కానీ, మాజీ భార్య గురించి పేర్కొన్నారు. ఈ ఆస్కార్స్ స్పీచ్‌లో పిల్లలతో పాటు మాజీ భార్య పేరు మర్చిపోయారు. ‘‘ఆస్కార్ వేదిక దిగిన మూడు సెకన్లకు నా ఫోన్ మోగింది. ‘మా గురించి చెప్పడం మర్చిపోయావ్. నా హార్ట్ ముక్కలైంది’ అని మా అబ్బాయి అన్నాడు’’ అని బ్యాక్ స్టేజిలో క్యాసే ఎఫ్లెక్ పేర్కొన్నారు. ఆస్కార్ అందుకున్న తొలి ముస్లిం ఇలాంటి పాత్రలకు బానిసను – ఉత్తమ సహాయ నటుడు మహేర్షలా అలీ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అందుకున్న తొలి ముస్లిమ్ వ్యక్తిగా మహేర్షలా అలీ (43) చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రం ‘మూన్ లైట్’లో ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా మహేర్షలా అలీకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ చిత్రంలో అలీ డ్రగ్ డీలర్ జువాన్ పాత్రలో ఒదిగిపోయారు. జెఫ్ బ్రిడ్జెస్, హెడ్జెస్, దేవ్ పటేల్, షానూన్ వంటి అగ్రనటులతో పోటీపడి అలీ ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. ‘లయన్’ చిత్రంతో సహాయ నటుడి విభాగంలో నిలిచిన భారత సంతతి నటుడు దేవ్ పటేల్‌కు నిరాశే ఎదురైంది. అవార్డు తీసుకున్న తర్వాత మహేర్షలా అలీ ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చారు. ‘‘మూన్ లైట్’ వంటి సినిమాల్లోని పాత్రలకు నేను బానిసను. ఈ చిత్రదర్శకుడు బెర్రిజెన్ కిన్స్కు థ్యాంక్స్. నటన నేర్చుకోవడంలో నాకు సహకరించిన టీచర్స్, ప్రొఫెసర్స్ అందరికీ ధన్యవాదాలు. ‘ఏ అవార్డు అయినా మనకు ఇచ్చినది కాదు. చిత్రంలోని పాత్రకు ఇచ్చినది’ అని వాళ్లు అనేవాళ్లు. నా ఫీలింగ్ కూడా అదే. నా భార్య సామి కరీమ్‌కు రుణపడి ఉంటాను’’ అన్నారు. 2013లో సామి కరీమ్‌తో మహేర్షల వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితమే కరీమ్ ఓ పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు భర్త ఆస్కార్ అందుకున్నారు. దీంతో మహేర్షల దంపతులు డబుల్ హ్యాపీ. ఆ సంగతలా ఉంచితే, వాస్తవానికి అలీ క్రిస్టియన్ అనీ, అయితే ఓ సందర్భంలో మసీదుకు వెళ్లి వచ్చిన తరువాత ముస్లిమ్‌గా మారారని సమాచారం. అతను అహ్మదీయుడు అనేది కొందరి వాదన. వాదించుకునేవాళ్లు వాదించుకుంటూనే ఉంటారు. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేని మహేర్షలనిండు మనసుతో శుభాకాంక్షలు చెబుతున్నవాళ్లకు ధన్యవాదాలు తెలియజేయడంలోనూ, ఇప్పుడే తన జీవితంలోకి వచ్చిన పసి పాపను అపురూపంగా చూసుకోవడంలోనూ బిజీ అయ్యారు. లా లా.. లవ్‌లో పడ్డా – ఉత్తమ దర్శకుడు డామీన్ ఛాజెల్లె ఇప్పటివరకూ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్స్ అందుకున్న వ్యక్తుల్లో డామీన్ ఛాజెల్లె (‘లా లా ల్యాండ్’ దర్శకుడు) చిన్నోడిగా చరిత్ర సృష్టించారు. అతడి వయసు 32 ఏళ్లు. ఫస్ట్ టైమ్ ఆస్కార్ అందుకున్న డామీన్ మాట్లాడుతూ – ‘‘ప్రేమ గురించి చెప్పిన సినిమా ‘లా లా ల్యాండ్’. ఈ సినిమా తీస్తున్న టైమ్‌లోనే నేను ప్రేమలో పడడం నా అదృష్టం. దీనర్థం... నాతో పాటు నువ్వూ (డామీన్ ప్రేయసి ఒలీవియా హామిల్టన్) ఈ అవార్డును పంచుకున్నట్లే’’ అన్నారు. ఆ శరీరాలను తవ్వి బయటకు తీయాలి! – ఉత్తమ సహాయ నటి వయోలా డేవిస్ ‘‘మీకో విషయం తెలుసా? అత్యంత ప్రతిభావంతులందరూ కలిసుండే చోటు ఒకటుంది. అదే శ్మశానం’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ వయోలా డేవిస్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రచయిత ఆగస్ట్ విల్సన్ రాసిన ‘ఫెన్సెస్’ అనే కథ ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. 2005లో ఆగస్ట్ విల్సన్ చనిపోయారు. ఆయన రాసిన కథలోని పాత్ర తనకు అవార్డు తెచ్చిపెట్టినందుకుగాను ఆస్కార్ వేదికపై వయోలా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఇంకా వయోలా మాట్లాడుతూ – ‘‘నువ్వు ఎలాంటి కథలు చెప్పాలనుకుంటావ్? అని కొంతమంది నన్ను అడుగుతుంటారు. ‘తవ్వి, పాతిపెట్టిన ఆ శరీరాలను బయటకు తీయాలి. ఆ మనుషుల కథలను తెలుసుకోవాలి. పెద్ద పెద్ద కలలు కని, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడి, ఫలాలు అందుకోని ఆ వ్యక్తుల కథలు చెప్పాలనిపిస్తుంది’ అంటుంటాను’ అన్నారు. ఆగస్ట్ విల్సన్ వంటి ప్రతిభావంతుల మరణాన్ని ఉద్దేశించే ఆమె ఇంత ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘నేను ఆర్టిస్టును అయ్యాను. అందుకు దేవుడికి రుణపడి ఉంటాను. సెలబ్రిటీల హోదాలో బ్రతికేందుకు ఇదొక మంచి ప్రొఫెషన్. ఎలా జీవించాలో, ఎలా ప్రేమించాలో ప్రతి రోజూ.. నాకు నేర్పే నా భర్త , నా కూతురికి రుణపడి ఉంటాను. డైరెక్టర్ డెంజెల్ వాషింగ్టన్కు ధ్యాంక్స్’’ అని వయోలా డేవిస్ అన్నారు. మూడు సార్లు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన, తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న అమెరికన్– అఫ్రికన్ వుమెన్‌గా వయోలా రికార్డ్ సాధించారు. తప్పు తప్పే.. శుద్ధ తప్పే! ఏం జరిగింది? ఓ చిత్రం పేరుకు బదులు మరో చిత్రం పేరును చదివారు. చెప్పుకోవడానికి చిన్న తప్పే! కానీ, ఏదో పొరపాటు జరిగిందని సర్దిచెప్పుకోవడానికి వీలు లేని తప్పు జరిగింది. ఈ తప్పే కాదు.. ఇంకో శుద్ధ తప్పు కూడా జరిగింది. ఈ ఏడాది జరిగిన 89వ ఆస్కార్స్‌లో ‘మూన్లైట్’ ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. కానీ, ‘మూన్లైట్’ పేరు ప్రకటించిన తీరు మాత్రం సూపర్‌హిట్ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. అసలు ఏం జరిగిందంటే... జోక్ కాదు.. నిజమే! క్లాసిక్ ఫిల్మ్ ‘బోనీ అండ్ క్లయిడే’ విడుదలై 50 ఏళ్లైంది. ఈ సందర్భంగా అందులోని స్టార్స్ వారెన్ బీట్టీ, ఫాయే డన్ అవేలను 89వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రం పేరును ప్రకటించమని వేదికపైకి పంపారు. వాళ్లు ‘లా లా ల్యాండ్’ పేరును ప్రకటించారు. ఒక్కసారిగా హర్షాతిరేకాలు.. కరతాళ ధ్వనులు.. ‘లా లా ల్యాండ్’ చిత్ర బృందం అవార్డును స్వీకరించడానికి వేదికపైకి చేరుకుంది. యాక్సెప్టెన్స్ స్పీచ్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇంతలో, ‘లా లా ల్యాండ్’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జోర్డాన్ హోరోవిట్జ్ మైక్ అందుకుని... ‘‘ఉత్తమ చిత్రం కేటగిరీ విజేత ‘మూన్లైట్’. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్’’ అంటూ అవార్డు కార్డును అందరికీ చూపించారు. ఒక్కసారిగా వేదికపై ఉన్న మిగతా చిత్ర బృందంలో ఆనందం ఆవిరైంది. ఆ వెంటనే వారంతా వేదికను ఖాళీ చేశారు. తర్వాత ‘మూన్లైట్’ చిత్ర బృందం అవార్డును అందుకుంది. ‘లా లా ల్యాండ్’ సినిమా క్లైమాక్స్‌లో ఒక్క క్షణం హీరో హీరోయిన్ కలుసుకున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే... హీరోయిన్ మరొకర్ని పెళ్లి చేసుకుంటుంది. థియేటర్లో ప్రేక్షకులు అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అనుకుంటారు. ఆస్కార్స్ వేదికపై జరిగిన ఘటన చూశాక.. మళ్లీ సేమ్ ఫీలింగ్ కలగక మానదు. (ఆస్కార్-2017: ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తప్పే.. క్షమించండి! ఆస్కార్స్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనపై ప్రైజ్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) క్షమాపణలు కోరింది. 83 ఏళ్లుగా ఆస్కార్స్ బ్యాలెట్ కౌంటింగ్‌ను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ‘‘ఉత్తమ చిత్రం పేరును ప్రకటించే సమయంలో జరిగిన తప్పుకి అందరికీ క్షమాపణ చెబుతున్నాం’’ అని పీడబ్ల్యూసీ సంస్థ పేర్కొంది. ప్రెజెంటర్స్కు రాంగ్ కవర్ ఇవ్వడంతో ఈ తప్పు జరిగిందట! ఇంకొకరి బాధలో ఆనందం ఎక్కడుంది? ఆస్కార్స్ వేదికపై జరిగిన ఘటన పట్ల మహేర్షలా అలీ స్పందిస్తూ – ‘‘ఉత్తమ చిత్రంగా ‘లా లా ల్యాండ్’ పేరు ప్రకటించగానే నేనేమీ సర్ప్రైజ్ కాలేదు. ఆ సినిమా బాగుంది, బాగా ఆడింది. వాళ్లు వేదికపై ఉన్నప్పుడు సెక్యూరిటీ, ఇతరులు వచ్చి డిస్ట్రబ్ చేస్తుంటే వర్రీ అయ్యాను. అప్పుడు ‘మూన్లైట్’ పేరు ప్రకటించగానే వేదికపైకి వెళ్లాలనుకోలేదు. అలాంటి సందర్భంలో ఆనందపడడం చాలా కష్టం. కానీ, అదృష్టవశాత్తూ మేము ఉత్తమ చిత్రం పురస్కారంతో బయటకు నడిచాం’’ అన్నారు. ఎమ్మా స్టోన్ (ఉత్తమ నటి, ‘లా లా ల్యాండ్’) మాట్లాడుతూ –‘‘ఓ గాడ్, ఐ లవ్ ‘మూన్లైట్’ సోమచ్. అఫ్కోర్స్, ‘లా లా ల్యాండ్’ పేరు ఉత్తమ చిత్రంగా వినడం అద్భుతంగా ఉంది. ‘మూన్లైట్’ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు. బతికి ఉన్న మనిషిని చంపేశారు! బతికి ఉన్న మనుషులకు నివాళులు అర్పిస్తారా? అలా చేస్తే బతికున్నవాళ్ల ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ‘జాన్ చాప్మాన్’ని అడిగితే చెబుతారు. ఎవరీ జాన్ చాప్మాన్ అంటే? ఈవిడ ఆస్ట్రేలియన్ ఫిలిం ప్రొడ్యూసర్. ‘ది పియానో’, ‘లవ్ సెరనేడ్’, ‘హోలీ స్మోక్’ వంటి పలు చిత్రాలు నిర్మించారు. వయసు 66. మంచి ఆరోగ్యంతో హాయిగా ఉన్నారు. కానీ, గతేడాది తిరిగి రాని లోకాలకు వెళ్లిన ప్రముఖులకు నివాళులర్పించే కార్యక్రమంలో ఆస్కార్ అవార్డు కమిటీ జాన్ చాప్మాన్ ఫొటోను చూపించింది. గతేడాది చనిపోయిన కాస్ట్యూమ్ డిజైనర్ ‘జానెట్ ప్యాటర్సన్’కి నివాళులర్పిస్తూ, ఆమె ఫొటోకు బదులుగా చాప్మాన్ ఫొటోను చూపించారు. దాంతో ‘నేను బతికే ఉన్నాను. బాగున్నాను కూడా. నిర్మాతగా యాక్టివ్‌గా ఉన్నాను’ అని చాప్మాన్ చెప్పుకోవాల్సి వచ్చింది. జానెట్ ప్యాటర్సన్తో కలసి తాను సినిమాలు చేశానని, ఆమె మంచి స్నేహితురాలని కూడా చాప్మాన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అనిపించుకున్న ఆస్కార్ అవార్డు లాంటి భారీ వేడుకలో ఇలాంటి తప్పులు జరగడం నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది. అదృష్టం.. అవకాశం కలిసొస్తేనే... – ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఎమ్మా స్టోన్.. ఆస్కార్స్‌కి నామినేట్ అయిన సహచర నటీమణులపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతూ స్పీచ్ ప్రారంభించారు. ‘‘అదృష్టం, అవకాశం బాగా కలిసొచ్చినప్పుడే ఇలాంటి సందర్భం వస్తుందని నాకు అర్థమైంది. జీవితంలో ఒక్కసారే ‘లా లా ల్యాండ్’ వంటి సినిమాలో నటించే ఛాన్స్ వస్తుంది. నాపై నమ్మకంతో ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు డామీన్ ఛాజెల్లెకు థ్యాంక్స్. ప్రతిసారీ, ప్రతి సన్నివేశంలో నేను బాగా నటించేలా సహకరించిన ర్యాన్ గోస్లింగ్కి థ్యాంక్స్. నేనింకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది’’ అన్నారు. ఓంపురికి ఆస్కార్ నివాళి ప్రతి ఆస్కార్ వేడుకలోనూ గడచిన 12 నెలల్లో స్వర్గస్తులైన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించడం అనవాయితీ. అందులో భాగంగా భారతీయ నటుడు ఓంపురికి నివాళులర్పించారు. ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘వోల్ఫ్’, ‘ద ఘోస్ట్ అండ్ ద డార్క్నెస్’, ‘సచ్ ఎ లాంగ్ జర్నీ’, ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’లతో పాటు మరికొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో ఓంపురి నటించారు. ఆయన నటించిన చివరి ఇంగ్లీష్ చిత్రం ‘వైశ్రాయస్ హౌస్’ ఈ నెల 12న బెర్లిన్‌లో విడుదలైంది. మార్చి 3న యూకేలో విడుదల కానుంది. ‘‘25 ఏళ్ల నుంచి వరుసగా హాలీవుడ్, బ్రిటీష్ సినిమాల్లో నటిస్తున్న ఏకైక నటుడు ఓంపురి. ఈరోజు ఆస్కార్స్ ఆయనకు నివాళులు అర్పించింది. ఆస్కార్స్ నివాళులు అందుకున్న తొలి భారతీయ నటుడు ఓంపురీనే. థ్యాంక్యూ అకాడెమీ అవార్డ్స్. థ్యాంక్యూ ఎవ్రీవన్. వుయ్ మిస్ ఓం’’ అని ఓంపురి ఫ్యామిలీ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశీ గాళ్స్ హంగామా విదేశీ తారలకు ధీటుగా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొని, రెడ్ కార్పెట్‌పై నడవడం అంత వీజీ కాదు.. దానికి చాలా ఖలేజా ఉండాలి. మన దేశీ భామ ప్రియాంకా చోప్రా తన దమ్మేంటో గతేడాది ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొన్నప్పుడు నిరూపించుకున్నారు. వైట్ గౌన్, లైట్ మేకప్, డైమండ్ జ్యుయెలరీలో ఆమె మెరిసిపోయారు. ఈసారి కూడా విదేశీయుల దగ్గర మార్కులు కొట్టేశారు. మరో భామ దీపికా పదుకొనే కూడా సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ‘ఆఫ్టర్ పార్టీ’ (అవార్డు వేడుక ముగిసిన తర్వాత జరిగే పార్టీ)లో దీపికా పదుకొనే పాల్గొన్నారు. నలుపు రంగు గౌనులో ‘వెరీ నైస్’ అనిపించుకున్నారు. మన దేశీ భామలా... మజాకానా! వయ్యారి భామ.. నీ హంస నడక... 16,500 చదరపు అడుగుల ఎర్ర తివాచీ అది. పదహారణాల తెలుగమ్మాయిలు నడిస్తేనేమి... పరాయి దేశపు భామలు నడిస్తేనేమి... చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా.. ఇంకా ఏదో ‘మిస్’ అయ్యామని మగ మనసులు బాధపడిపోతాయ్. వచ్చినవాళ్లు వచ్చినట్లు వయ్యారంగా వాక్ చేసుకుంటూ వెళుతుంటే చూసేకొద్దీ చూడబుద్ధేస్తోందంటూ ఆ మనసులు గారాలు పోయాయి. భారీ రెడ్ కార్పెట్ పై భామలు అడుగులో అడుగేస్తూ, ఆకట్టుకున్నారు. ప్రతి ఏడాదీ రెడ్ కార్పెట్ ఈవెంట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచినట్లే ఈ ఏడాది కూడా నిలిచింది. చీరకట్టు @ రెడ్ కార్పెట్టు భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీరకట్టు. ఆ చీరకట్టు 89వ ఆస్కార్ వేడుకల్లో వీక్షకులతో పాటు సినీ ప్రముఖుల కళ్లను కట్టిపడేసింది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో నామినేట్ అయిన దేవ్ పటేల్.. తన తల్లి అనితా పటేల్‌తో కలసి ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. చీరకట్టులో భారతీయ హుందాతనం చూపించిన అనితా పటేల్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ‘‘దేవ్ పటేల్‌కి ఆస్కార్ రాకున్నా.. 26 ఏళ్లకు నామినేషన్ దక్కడం అద్భుతమైన విషయం. ఆ లెక్కన దేవ్ విన్నరే. ఇంత త్వరగా దేవ్‌కి ఆస్కార్ నామినేషన్ వస్తుందని ఊహించలేదు’’ అని అనితా పటేల్ పేర్కొన్నారు. -
ఒక పుస్తకమే.. ఆయన విడాకులకు కారణం
టాలెంట్ ఉన్నవారి వెనుక వివాదాలు కూడా ఉంటాయి. అందులోనూ సెలబ్రిటీల విషయంలో అయితే వాటికి కొదవే లేదు. ప్రముఖ జర్నలిస్టు అయిన తన భార్య నందితా పురి నుంచి ఓంపురి విడిపోవడం కొన్నేళ్ల క్రితం పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. ఓంపురి జీవిత చరిత్రను 'అన్లైక్లీ హీరో: ఓంపురి' పేరుతో నందిత రాశారు. 14 ఏళ్ల వయసులోనే ఓంపురి నెరపిన శృంగారలీలల గురించి అందులో రాశారు. ఈ పుస్తకం 2009లో బయటకు వచ్చింది. అయితే, పుస్తకంలో ఆమె రాసిన విషయాలకు తాను తన ఆమోదం తెలపలేదని ఓంపురి అన్నారు. తన కేర్‌టేకర్‌గా ఉండే మహిళతో 14 ఏళ్ల వయసులో ఓంపురి తొలిసారి శృంగార అనుభవాన్ని పొందారని ఆ పుస్తకంలో నందిత రాశారు. లక్ష్మి అనే మహిళతో కూడా ఆయనకు చాలా కాలం సంబంధం ఉండేదని అందులో పేర్కొన్నారు. అయితే లక్ష్మి గురించి నందిత చాలా అసహ్యంగా రాశారని, ఆమె తన పిల్లలను, తన సోదరుడి అనాథ పిల్లలను పెంచారని ఆ తర్వాత ఓంపురి చెప్పారు. ఆమె తన పట్ల ఎంతో విశ్వాసంతో ఉండేవారని కూడా తెలిపారు. ఈ పుస్తకం కారణంగానే ఓంపురి-నందిత విడిపోయారని ఇద్దరికీ సన్నిహితంగా ఉండే కొందరు చెప్పారు. పుస్తకం ప్రింటింగ్‌కు వెళ్లడానికి ముందు స్క్రిప్టు తనకు చూపించమంటే నందిత చూపించలేదన్నది అప్పట్లో ఓంపురి వాదన. ఓంపురి తొలుత అన్నూకపూర్ సోదరి సీమా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ, 1991లో వాళ్లు పెళ్లయిన 8 నెలల తర్వాతే విడిపోయారు. 1993లో నందితను పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరికీ ఇషాన్ అనే కొడుకు ఉన్నాడు. నిజాయితీగా ఉండటాన్ని ఓంపురి ఇష్టపడతాడు గానీ, చాలాసార్లు అది ఎంచుకున్న నిజాయితీయే అవుతుందని నందిత ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం ఓంపై నందిత గృహహింస కేసు పెట్టారు. ఆ తర్వాత 2003లో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఓంపురి అంత్యక్రియలను ఆయన కొడుకు ఇషాన్ నిర్వహించాడు. మాజీ భార్య అయిన నందిత కూడా ఆ అంత్యక్రియలకు హాజరయ్యారు. -
ముఖం ఉన్న నటుడు
-
ఓంపురి ఆకస్మిక మృతి
► గుండెపోటుతో కన్నుమూసిన విలక్షణ నటుడు ► బాలీవుడ్, రాజకీయ నేతల సంతాపం ముంబై/సాక్షి, హైదరాబాద్: నటనకు కొత్త భాష్యం పలికిన విలక్షణ నటుడు, సమాంతర చిత్రాల దిగ్గజం ఓంపురి(66) ఇకలేరు. ముంబైలో స్వగృహంలో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన ఆకస్మిక గుండెపోటుతో మృతిచెందారు. ఓం పురి వంటగదిలో నేలపై విగతజీవిలా కనిపించారని ఆయన మాజీ భార్య నందిత చెప్పారు. ఓం పురి, నందితలకు ఇషాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఓంపురి భౌతికకాయాన్ని అమితాబ్ బచ్చన్, షబానా అజ్మీ, శేఖర్ కపూర్ తదితర సినీ ప్రముఖులు సందర్శించి, నివాళి అర్పించారు. అంత్యక్రియలను ఓషివారా శ్మశాన వాటికలో కుమారుడు పూర్తి చేశాడు. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. ఓం పురి మృతిపై బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. షారుక్ ఖాన్, శ్యాం బెనగళ్, మీరా నాయర్, ప్రియాంకా చోప్రా తదితరులు ఆయనతో తమ సినీ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా సంతాపం తెలిపారు. భారత సినీ పరిశ్రమ గొప్ప నటుణ్ని కోల్పోయిందని ప్రణబ్ అన్నారు. ‘సామాజిక చైతన్యం ఉన్న నటుడిని కోల్పోయాం’ అని సోనియా పేర్కొన్నారు. ఓం పురి వర్ధమాన నటులకు ఆదర్శమని, సినీపరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు అని తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. సహజ నటుడు..: బాలీవుడ్ హీరో అంటే ‘అందంగా ఉండాల’నే భావనను ఓం పురి బద్దలు కొట్టాడు. పాత్రల స్వభావాలను అత్యం త సహజంగా ప్రదర్శించడం ఆయనకు కొట్టినపిండి. ‘అర్ధ్ సత్య,’ ‘ఆక్రోశ్’, ‘మిర్చ్ మసాలా’, ‘సద్గతి’, ‘దిశ’, ‘భూమిక’ వంటి మరెన్నో చిత్రాలు ఆయన నటనా పటిమకు అద్దం పడతా యి. బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ.. ‘గాంధీ’, ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘ఊల్ఫ్’, ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’ వంటి చిత్రాలతో మెప్పించారు. తెలుగు చిత్రం ‘అంకురం’లోనూ కనిపించారు. పలు మలయాళీ సినిమాల్లోనూ నటించిన ఆయనకు కేరళలో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ‘విజేత’, ‘ద్రోహ్ కాల్’, ‘చాచీ 420’, ‘దేవ్’, ‘ఘాయల్’ వంటి ప్రధాన స్రవంతి సినిమాల్లోనూ సత్తా చాటారు. హరియాణాలోని అంబాలాలో జన్మించిన ఓం పురి పుణేలోని ప్రఖ్యాత ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో పాఠాలు నేర్చుకున్నారు. మరో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా ఆయనకు సహధ్యాయి. 1976లో ‘ఘాసీరామ్ కొత్వాల్’ మరాఠీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఓం పురి 300కుపైగా చిత్రాల్లో నటించారు. జాతీయ ఉత్తమ నటుడు, పద్మశ్రీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. జాతీయ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గానూ పనిచేశారు. బ్రిటిష్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అక్కడి ప్రభుత్వం ఆయనను ‘హానరరీ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్’ పురస్కారంతో సత్కరించింది. నందిత ‘ఓం పురి: అన్ లైక్లీ హీరో’(2009) పేరుతో ఆయన జీవిత చరిత్రను రాశారు. ‘నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయాక నటుడిగా తను చేసిన కృషిని ప్రపంచం గుర్తిస్తుంది. యువతరం.. ముఖ్యంగా సినీ విద్యార్థులు నా చిత్రాలను చూస్తారు’ అని ఒంపురి గత డిసెంబర్లో ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. అనుకున్నదాన్ని నిర్భయంగా చెప్పే ఓం పురి.. గోవధపై నిషేధానికి వ్యతిరేకంగా, నక్సల్స్‌కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
ముఖం ఉన్న నటుడు
ప్రఖ్యాత దూరదర్శన్ టెలివిజన్ ఫిల్మ్ ‘తమస్’ ఓంపురితోనే ప్రారంభం అవుతుంది. పందులు మేపుకునే ఓంపురిని ఒక బ్రిటిష్‌వాడు పందిని చంపి ఇవ్వమంటాడు. కారణం తెలియని ఓంపురి చంపి ఇస్తాడు. మరుసటి రోజు దాని కళేబరం మసీదు ముందు ప్రత్యక్షమవుతుంది. ఇది హిందువులు చేసిన పనే అని ముస్లిమ్‌లు భావిస్తారు. కలహాలు మొదలవుతాయి. తప్పు ఎక్కడ మొదలైందో తెలిసిన ఓంపురి నలిగిపోతాడు. ఆ కలహాల్లో గర్భిణి అయిన తన భార్యతో అతడు పడే కష్టాలు ఎవరూ మర్చిపోరు. ‘బాబీ’ సినిమా (1973) వచ్చిన రోజు ల్లోనే ఓంపురి కూడా ముంబైలో అవకాశాల కోసం వెతుకు తున్నాడని గుర్తు చేసుకోవడం మనకు ముఖ్యం. అందమైన ముఖాలు, రిషి కపూర్ వంటి చాక్లెట్బాయ్లు చెల్లుబాటు అవుతున్న రోజుల్లో ముఖం నిండా స్ఫోటకపు మచ్చలున్న ఒక నటుడు అవకాశాల కోసం వెతకడం చాలా విడ్డూరం– వింత– హాస్యాస్పదమైన విషయం. కానీ ఓంపురి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (న్యూఢిల్లీ) స్టూడెంట్. నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (పూనా)లో నటనను అభ్యసించిన విద్యార్థి. ముక్కు పెద్దగా ఉందని, పళ్లు వంకరగా ఉన్నాయని, నడుము లావుగా ఉందని ప్రపంచ సినిమాలో నటులు కాకుండా పోయిన వాళ్లు లేరు. వాళ్లు ఎలా ఉన్నారో అలానే గొప్ప నటులయ్యారు. ఓంపురి కూడా తాను ఎలా ఉన్నానో అలానే నటుడుగా రాణించగలనని నమ్మాడు. అదే ముఖంతో రాణించాడు. యాక్టింగ్ స్కూళ్లలో తన సహధ్యాయి అయిన నసీరుద్దీన్ షా, సినిమాల్లోకి వచ్చాక పరిచయమైన షబానా ఆజ్మీ, స్మితా పాటిల్, అమ్రిష్ పురి, దీప్తీ నావల్, దీపా సాహి వంటి పారలల్ తారాగణంతో కమర్షియల్ సినిమాలను ఒరుసుకుంటూ ఒక పెద్ద సమాంతర ఆవరణం ఏర్పడటానికి కారణమైనవారిలో ఓంపురి చాలా కీలకమైన పాత్ర పోషించాడు. టేక్లోకి వెళ్లే ముందు జుట్టు సరి చేసుకునే హీరోలు ఉన్న రోజుల్లో పాత్రను చేసే ముందు హోంవర్క్ ముఖ్యమని చూపించిన నటుల్లో ఓంపురి ఉంటాడు. అంతవరకూ ‘ఫిల్మీ’గా ఉండే పోలీస్ ఆఫీసర్లను చూసిన ప్రేక్షకులకు ఓంపురి ‘అర్ధ్ సత్య’లో నిజమైన పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో చూపించాడు. అందుకోసం ముంబై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు. ఆఫీసర్లను పరిశీలించాడు. ఆ పరిశీలనతో రాణించాడు. ‘సిటీ ఆఫ్ జాయ్’ సినిమాలో రిక్షావాడిగా నటించడానికి పదిహేను రోజుల పాటు కలకత్తాలో రిక్షా నడిపిన నటుడు ఓంపురియే. కాని అతడి బాల్యం, యౌవనం, వైవాహిక జీవితం కూడా అంత సుఖంగా సాగలేదు. తల్లికి బాల్యంలోనే మతిస్థిమితం తప్పింది. తండ్రి పట్టించుకోలేదు. ఆరేళ్ల వయసులో టీ అంగళ్లలో కప్పులు కడిగాడు. ధాబాలలో పని చేశాడు. రాత్రి పదింటికి కూడా పని చేయమంటే చిన్న పిల్లాడు కనుక నిద్ర వచ్చి ఆ పని పోగొట్టుకున్నాడు. దగ్గరి బంధువు కొన్నాళ్లు అన్నం పెట్టి ఆ తర్వాత వెళ్లగొట్టాడు. ముంబైకి చేరుకున్నాక కూడా చాలారోజులు సంఘర్షణ చేయాల్సి వచ్చింది. అయితే ఇవేవీ నటుడు కావాలనే అతడి తపనను చల్లార్చలేకపోయాయి. నటుడు కావాలనుకున్నాడు. అయ్యాడు. నసీరుద్దీన్ షా, ఫరూక్ షేక్, అమోల్ పాలేకర్... వీరంతా పారలల్ సినిమాలకు హీరోలుగా నిలదొక్కుకున్నారు. కాని ఓంపురి అతి త్వరగా కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాల్సి వచ్చింది. పాత్రే అతని ఉనికి. పాత్రే అతని ఆహారం. శ్యాం బెనగళ్, గోవింద్ నిహలానీ, కేతన్ మెహతా, సయీద్ మిర్జా.. ఇలాంటి దర్శకులంతా ఓంపురికి ఆకలి తీర్చే పాత్రలు ఇచ్చి తమ సినిమాలను శక్తిమంతం చేసుకున్నారు. సత్యజిత్ రే వంటి దర్శకుడు ప్రేమ్‌చంద్ రాసిన ‘సద్గతి’ కథను దూరదర్శన్‌కు తీస్తూ దళితుడి పాత్రను ఓంపురికి ఇచ్చాడు. కూతురి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని పురోహితుడి ఇంటికి వెళితే అతడు నానా పనులు చెప్పి కట్టెలు కొట్టమంటాడు. అసలే జ్వరంతో ఉన్న ఓంపురి కట్టెలు కొట్టీ కొట్టీ ప్రాణం లేని కట్టెపేడుగా మారే సన్నివేశానికి దుఃఖం ముంచుకొస్తుంది. హిందీ సినిమాలలో దళితుడంటే ఓంపురియే. తెలుగులో ఆ మర్యాద చాలాకాలం తర్వాత పి.ఎల్. నారాయణకు దక్కింది. తెలుగులో సి.ఉమా మహేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘అంకురం’ సినిమాలో ఓంపురి పోషించిన నక్సలైట్ పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినా వేసే ముద్ర పెద్దది. గొప్ప నటులంతా సీరియస్ పాత్రలను ఎంత బాగా చేయగలరో హాస్యాన్ని కూడా అంతే బాగా చేస్తారు. ‘ఆక్రోశ్’లో సీరియస్‌గా చేసిన ఓంపురియే ‘జానే భిదో యారో’లో నవ్వులు పూయించడం చాలామంది గమనించారు. కమల్‌హాసన్ ‘భామనే సత్యభామనే’ హిందీలో ‘చాచీ 420’గా తీసినప్పుడు దొంగ మేనేజర్‌గా ఓంపురి నవ్వులు చిందిస్తాడు. ఓంపురి కెరీర్‌లోని చివరి దశ అంతా ఈ కామిక్ టైమింగ్ మీదే ఆధారపడింది. ముఖ్యంగా దర్శకుడు ప్రియదర్శన్ ఓంపురి చేత లెక్కలేననన్ని కామెడీ వేషాలు వేయించాడు. ఓంపురికి సంబంధించి మనకు ఇటీవలి జ్ఞాపకం ‘బజరంగి భాయ్ జాన్’లో ఆయన వేసిన పాకిస్తానీ మౌల్వీసాబ్ వేషం. దారి తప్పిన పసిపిల్లను తీసుకుని సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ వస్తే మౌల్వీ అయిన ఓంపురి ఆశ్రయం ఇస్తాడు. ఎటువైపు వెళ్లాలో దారి చూపించి ‘ఈ పిల్ల కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తాను. ఖుదా హఫీస్’ అంటాడు. ఆంజనేయస్వామి భక్తుడైన సల్మాన్ ‘ఖుదా హఫీస్’ అనడానికి సంశయిస్తే ‘మీరేం అంటారు?’ అని అడుగుతాడు. ‘జైశ్రీరాం’ అని సల్మాన్ అనగానే ‘జైశ్రీరాం’ అని మౌల్వీ కూడా అంటాడు. హృద్యమైన సీన్ అది. ఓంపురికి మన రాజకీయ నాయకుల మీద గౌరవం లేదు. వాళ్లను ‘అన్పడ్’ (వేలిముద్రగాళ్లు) అని తిట్టి ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఓంపురి జీవితం మీద అతడి భార్య నందితా పురి రాసిన జీవితకథ వివాదాస్పదం అయ్యింది. అందులో ఆమె అత్యుత్సాహం కొద్దీ అతడి లైంగిక సంబంధాలు ప్రస్తావించడంతో ఓంపురి మనసు కష్టపెట్టుకున్నాడు. ఈ గొడవ వారిద్దరి విడాకులకు దారి తీసింది. ‘బీహార్ రోడ్లు ఓంపురి చెంపల్లా గరుకుగా ఉన్నాయి. వీటిని త్వరలో హేమమాలిని బుగ్గల్లా నునుపుగా చేస్తాను’ అని లాలూ ప్రసాద్ యాదవ్ అనడం ఓంపురి విలోమ ప్రాచుర్యానికి ఒక నమూనా. ఓంపురికి చాలా అవార్డులు వచ్చాయి. బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్’తో సత్కరించింది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అవన్నీ అదనపు అలంకారాలే. అతడి అసలు అలంకారం సినిమాలో చేసే పాత్ర. దానిని నిర్వహించే తీరు. ఇన్నాళ్లూ... ఓంపురి ఉన్నాడన్న ధైర్యం ఉండేది. అతడి పోకడతో అది సగం అయ్యింది. నటనతో నిండిన అతడి గరుకు ముఖాన్ని ఇప్పుడప్పట్లో మనం మర్చిపోలేము. – ఖదీర్ -
బహుముఖ నటుడికి నివాళి
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఓం పురి (66) హఠాన్మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. విలక్షణమైన పాత్రలల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న తమ సహనటుడు ఇక లేరన్న వార్తతో యావత్తు సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన అకాల మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వసుంధర రాజే సహా ఇతర రాజకీయ ప్రముఖులు, పలువురు సీనియర్ నటీ నటులు, దర్శకులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓంపురి మరణంపై ట్విట్టర్ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బెడ్ మీద ఆయన అలా ప్రశాంతంగా నిశ్చలంగా పడి వుండటాన్ని నమ్మలేకపోతున్నానంటూ సంతాపం వ్యక్తం చేశారు. అద్భుతమైన నటుడ్ని కోల్పోయామొంటూ కరణ్ జోహార్ ట్విట్ చేశారు. అంతర్జాతీయ సినిమాలకు పనిచేసిన తొలినటుడు అంటూ గుర్తుచేసుకున్న ప్రముఖ నటి, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి సంతాపం ప్రకటించారు. తన అసమాన నటనతో మనల్ని నవ్వించారు, ఏడ్పించారు. ఆయన జీవితపరమార్థాన్ని ఎరిగిన వారన్నారని పేర్కొన్నారు. థియేటర్, సినీ లోకానికి, ఆయన లేని లోటు పూడ్చలేనిదని కిరణ్ మజుందార్ షా సంతాపం తెలిపారు. ఇంకా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, తదిరులు సంతాపం తెలిపిన వారిలోఉన్నారు. కాగా బహుముఖ నటుడు ఓంపురి శుక్రవారం ఉదయం ఆయన తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. భారతీయ సినిమాలతో పాటు పాకిస్తానీ తదితర విదేశీ సినిమాల్లో నటించిన ఆయన విలక్షణ ప్రాతలతో సినీ విమర్శకుల ప్రశంసలతో బలు అవార్డులను కూడా అందుకున్నారు. హర్యానాలోని అంబాలో 18 అక్టోబర్ 1950 లో పుట్టిన ఆయన పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. మరో సీనియర్ నటుడు, దివంగత అమ్రేష్ పురి, ఓంపురి సోదరుడు. Solid actor....Solid filmography....immense talent.... #RIPOmPuri ....cinema has truly lost a brilliant artist.... — Karan Johar (@karanjohar) January 6, 2017 -
అర్థం చేసుకోరూ..!
ప్రేమ కథా చిత్రం ‘ది హండ్రెడ్ ఫుట్ జర్నీ’లో ఆస్కార్ విన్నింగ్ బ్రిటిష్ నటి హెలెన్ మిరెన్తో రొవూన్స్ పండించిన ఓంపురి... అందులో నుంచి ఇంకా బయుటపడినట్టు లేడు. టీనేజర్లకే కాదు... ఓల్డ్ ఏజ్ కపుల్స్కూ లవ్ స్టోరీలుంటాయుంటూ కొత్తగా చెబుతున్నాడీ ప్యార్లల్ సినివూ స్టార్. పైగా... ఓల్డర్ కపుల్ రొమంటిక్ సినివూలూ చూడ్డానికి బాగుంటాయుంటున్నాడు. జూహీచావ్లా కూడా నటించిన ఈ తాజా సినివూకు వుంచి రెస్పాన్స్ వస్తోంది.