breaking news
Old Rs 500 notes
-
పాత రూ.500 నోటుపై మరిన్ని ఆంక్షలు
న్యూఢిల్లీ : పాత రూ.500 నోట్ల చెల్లుబాటుపై కేంద్రప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ నెల 10వరకే రైల్వేలు, మెట్రోలు, బస్సుల్లో రూ.500 నోట్లు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. డిసెంబర్ 10 తర్వాత ఈ నోట్లు వారి దగ్గర చెల్లుబాటు కావని తేల్చిచెప్పింది. ముందస్తు మార్గదర్శకాల మేరకు, డిసెంబర్ 15వరకు అన్ని వినియోగ బిల్లు చెల్లింపులతో రైల్వే టిక్కెట్ కౌంటర్లలోనూ, బస్ టిక్కెట్ల కొనుగోలుకు పాత రూ.500 నోట్లు వాడకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ తుదిగడువును రైల్వేలు, మెట్రోలు, బస్టిక్కెట్ల కొనుగోళ్లలో ప్రభుత్వం కుదించింది. కాగ, 2016 డిసెంబర్ 3 నుంచి పాత రూ.500 నోట్లను పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్లలో, విమానయాన టిక్కెట్ల కొనుగోళ్లలో రద్దుచేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 8న ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం కేవలం 72 గంటలే ఈ నోట్లు పలు వినియోగ చెల్లింపులకు వాడుకోవచ్చని తెలిపింది. కానీ ఈ గడువును వినియోగదారుల సౌకర్యార్థం ప్రభుత్వం రెండు సార్లు పొడిగించింది. ఈ పొడిగింపులో భాగంగా డిసెంబర్ 15వరకు పాత రూ.500 నోట్లు విద్యుత్, మంచినీళ్లు, పాఠశాలల ఫీజులు, ప్రీపెయిడ్ మొబైల్ బిల్లులు, ఇంధన కొనుగోళ్లకు, విమానయాన టిక్కెట్ బుకింగ్స్ వంటి వినియోగ బిల్లులకు వాడుకోవచ్చని తెలిపిన విషయం విదితమే. -
నోట్ల రద్దు: నిబంధనలు-వెసులుబాటు.
-
పాత రూ.500 నోటుపై ఆర్బీఐ ఆంక్షలు
-
పాత రూ.500 నోటుపై ఆర్బీఐ ఆంక్షలు
న్యూఢిల్లీ: పాత 500 రూపాయల నోట్ల వినియోగంపై రిజర్వ్ బ్యాంకు కొత్తగా ఆంక్షలు విధించింది. పెట్రోల్ బంకుల్లో, విమాన టికెట్లు కొనుగోలు చేయడానికి ఈ నెల 2వ తేదీ వరకు మాత్రమే పాత 500 రూపాయల నోటు చెల్లుబాటు అవుతుంది. ఇంతకుముందు ప్రకటించినట్టుగా ఈ నెల 15 వరకు ఉన్న గడువును ఆర్బీఐ కుదించింది. కాగా ఈ నెల 15 వరకు స్కూలు ఫీజులు, పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిల వంటి చెల్లింపులకు పాత 500 రూపాయల నోటును వినియోగించుకోవచ్చు. గత నెల 8న కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత వీటిపై కొన్ని సడలింపులు, ఆంక్షలు విధించింది. 1000 రూపాయల నోటును బ్యాంకులో డిపాజిట్ చేయడం మినహా ఎక్కడా చెల్లుబాటు కాదు. అలాగే పాత 500 రూపాయల నోట్ల మార్పిడిని రద్దు చేశారు. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పాటు అనుమతించిన చెల్లింపులకు మాత్రమే చెలామణి అవుతుంది.