breaking news
old dues
-
ఉపాధి నిధులు పాత బకాయిలకే
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో పావు వంతు సొమ్ము పాత బకాయిలు తీర్చడానికే ఖర్చవుతున్నట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడించింది. 2023–24 నుంచి ఈ పథకానికి బడ్జెట్‌ను పెంచకపోవడాన్ని తప్పుబట్టింది. దేశంలో ద్రవ్యోల్బణం, గ్రామాల్లో పనులకు డిమాండ్ పెరుగుతున్నా నిధుల కేటాయింపులు ఆ స్థాయిలో పెరగకపోవడం సరైంది కాదని పేర్కొంది. ఉపాధి హామీ పథకంలో ప్రతిఏటా కనీస పని దినాలను 100 నుంచి 150కు పెంచాలని, కూలీలకు వేతనాలను నిజమైన ద్రవ్యోల్బణ సూచికకు అనుగుణంగా సవరించాలని స్టాండింగ్ కమిటీ ఇటీవల కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు ఒక నివేదిక సమరి్పంచింది. పథకం ఉద్దేశం దెబ్బతింటోంది ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో దాదాపు రూ.86 వేల కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పెండింగ్ వేతనాలు రూ.12,219.18 కోట్లు, పెండింగ్ మెటీరియల్ ఖర్చులు రూ.11,227.09 కోట్లు ఉన్నాయి. అంటే రూ.23,446.27 కోట్ల బకాయిలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత బడ్జెట్లో ఇవి ఏకంగా 27.26 శాతం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పనులకు ఖర్చు చేయడానికి రూ.62,553.73 కోట్ల నిధులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాత బకాయిల భారం వల్ల పథకం ఉద్దేశం దెబ్బతింటోందని పార్లమెంటరీ కమిటీ ఆక్షేపించింది. ఈ పథకం కింద చెల్లిస్తున్న వేతనాల విషయంలో రాష్ట్రాల మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉంటోందని పేర్కొంది. కనీస వేతనాలు చాలా తక్కువగా ఉండటంతో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం గ్రామాల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేసింది. వేతనాలను లెక్కించేందుకు పాటిస్తున్న విధానం ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని సరిగ్గా ప్రతిబింబించడం లేదని, కొత్త సూచిక అవసరమని సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన వేతన రేటు అమలు చేసే అవకాశాలు కూడా పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. పనుల విస్తరణ.. పనిదినాల పెంపు ఉపాధి హామీ పథకంలో కూలీలకు కల్పించే పనుల రకాలను విస్తరించడం ద్వారా సంవత్సరానికి కనీస పని దినాలను 150కి పెంచే అవకాశం ఉందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చి 17 ఏళ్లు గడిచినా.. పథకంలో గణనీయమైన మార్పులు చేర్పులు చేయలేదని ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. వేతనాల చెల్లింపుల కోసం ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను తప్పనిసరి చేయొద్దని స్పష్టం చేసింది. ఇలాంటి చెల్లింపుల వ్యవస్థఅమల్లోకి వస్తే గ్రామీణ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. -
ఆర్టీసీకి 130 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపికబురు మోసుకొచ్చింది. సంస్థకు పాత బకాయిల రూపంలో చెల్లించేందుకు రూ.130 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బకాయిలు దేనికి చెల్లించాలన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ నిధుల విడుదలను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ పేరిట వెలువడిన ఈ ఉత్తర్వులు వాస్తవానికి ఈనెల 16నే ఇచ్చారు. వీటిని బయటికి వెల్లడించకుండా సంస్థాగతంగానే ఉంచడంతో ఇంతకాలం బయటికి రాలేదు. ఏ బకాయిలు చెల్లిస్తారో.. వాస్తవానికి ఆర్టీసీలో వివిధ అవసరాలకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. రిటైర్డ్ ఉద్యోగులకు, సీసీఎస్‌కు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇలా పలు విధాలుగా సంస్థ బకాయిలు పడింది. వీటిని చెల్లించాలని కొన్ని రోజులుగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జూన్‌లో యూనియన్లకు మంత్రులకు మధ్య జరిగిన చర్చల అనంతరం బకాయిల క్లియరెన్స్‌కు రూ.80 కోట్లు చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. తరువాత ఈ నిధులను లీవ్ఎన్క్యాష్మెంట్ రూపంలో చెల్లిస్తామని గుర్తింపు యూనియన్ నాయకులు ప్రకటించారు. అయినా ఇంతవరకూ ఎలాంటి చెల్లింపులు జరగలేదు. మరోవైపు కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుంచి ఆర్టీసీ దాదాపుగా రూ.260 కోట్లకుపైగా నిధులను వాడుకుంది. వీటి చెల్లింపులు చేయాలని కార్మికులు చాలాకాలంగా కోరుతున్నారు. మరోవైపు ఏడాది కాలంగా సంస్థలో వందలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వీరికి వివిధ రూపంలో చెల్లించాల్సిన బెనిఫిట్లు చెల్లించలేదు. వీటిని వెంటనే చెల్లించాలని నాగేశ్వరరావు (ఎన్ఎంయూ) రాజిరెడ్డి (ఈయూ), హన్మంతు (టీఎన్‌ఎంయూ) చాలాకాలంగా కోరుతున్నారు. రూ.80 కోట్లు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, రూ.30 కోట్లు సీసీఎస్‌కు, మరో రూ.20 కోట్లు విశ్రాంత ఉద్యోగులకు చెల్లిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హామీ ఇచ్చిందని తెలుస్తోంది. వెంటనే హామీని నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇచ్చిన రూ.130 కోట్లే కాకుండా మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే తీసుకొస్తామని, గుర్తింపు సంఘం (టీఎంయూ) నాయకులు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి ప్రకటించారు. -
పల్లెల్లో చీకట్లు
– పంచాయతీలకు పవర్ కట్ – పాత బకాయిలు చెల్లించలేదని సరఫరా నిలిపివేత –పట్టణాలకు రెండ్రోజుల్లో ఇదే షాకు – పట్టించుకోని ప్రభుత్వం ఓ వైపు గ్రామాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటనలు గుప్పిస్తున్న టీడీపీ సర్కారు మరోవైపు పల్లెలను అంధకారంలోకి నెడుతోంది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీల నెత్తిన విద్యుత్ బిల్లుల భారం మోపుతుంది. తక్షణమే పాత బకాయిలు చెల్లించలేదని కొన్ని పల్లెల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పది మేజర్ పంచాయతీల్లో ఇప్పుడు చీకటి రాజ్యమేలుతోంది. తిరుపతి రూరల్: అధిక మొత్తంలో పాత బకాయిలున్న మేజర్ పంచాయతీలపై ఏపీఎస్పీడీసీయల్ పవర్ కట్ ఆయుధాన్ని ప్రయోగించింది. పీలేరు, చంద్రగిరి, సీటీయం, నారాయణవనం, ఐరాల, యాదమర్రి, గుడిపల్లి, కలకడ మేజర్ పంచాయతీల్లో మొదటి విడతగా వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పంచాయితీలు స్పందించకపోతే త్వరలో నీటి సరఫరా కనెక్షన్లను కూడ తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. బకాయిలు చెల్లించే వరకు విద్యుత్ పునరుద్ధరించేది లేదని విద్యుత్ శాఖాధికారులు తేల్చిచెపుతున్నారు. మున్సిపాలిటీల్లో రూ. 4.42 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మున్సిపాలిటీల్లోని వీధి దీపాలకు కూడ మరో రెండు రోజుల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు డిస్కం అధికారులు హెచ్చరిస్తున్నారు. పంచాయితీలకు 14వ ఆర్థిక సంఘ నిధులు ఎక్కడా.? పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. జిల్లాలోని 1364 పంచాయతీలకు రూ.56 కోట్లను మంజూరు చేసినట్లు గత మూడు నెలలుగా అధికారులు ప్రకటిస్తున్నా, ఇంత వరకు నిధులు చేరలేదు. ఇప్పటి వరకూ పంచాయతీలు బిల్లులు చెల్లించలేకపోయాయి. ఇవేవి పట్టించుకోని విద్యుత్ శాఖాధికారులు పల్లెల్లో అం«ధకారం నింపుతున్నా జిల్లా కలెక్టర్, డీపీవోలు పట్టించుకోవడం లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా 14వ ఆర్థిక సంఘ నిధులను వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. పవర్ కట్ నిజమే.. జిల్లాలో కొన్ని పంచాయతీలకు పవర్ కట్ చేసింది వాస్తవమే. పాత బకాయిలు చెల్లించలేదని వీధిలైట్ల కనెక్షన్లు తొలగించారు. 14వ ఆర్థిక సంఘ నిధులు రెండు, మూడు రోజుల్లో పంచాయతీలకు కేటాయిస్తాం. – ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి. క్రమ సంఖ్య విద్యుత్ డివిజన్ బకాయిలు ( రూ. కోట్లలో) 1 తిరుపతి టౌన్ 16 2 తిరుపతి రూరల్ 21.71 3 పుత్తూరు 29.24 4 మదనపల్లి 25.25 5 పీలేరు 39.54 6 చిత్తూరు రూరల్ 26.55 7 చిత్తూరు టౌన్ 11.89 మొత్తం 169.20