విమాన ప్రమాదంలో ‘టోటల్’ సీఈవో మృతి
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ చమురు కంపెనీ ‘టోటల్’ సీఈఓ క్రిస్టఫ్ డి మార్గెరీ మృతిచెందారు. మార్గెరీ(63) వ్యక్తిగత విమానం నుకోవో విమానాశ్రయంలో పారిస్ వెళ్లేందుకు టేకాఫ్ తీసుకునే సమయంలో మంచును తొలగించే వాహనాన్ని ఢీకొని ధ్వంసమైంది.
ప్రమాదంలో మార్గెరీ, ముగ్గురు విమాన సిబ్బంది చనిపోయారు. మంచు వాహనం డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని, అతని తప్పిదాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పొరపాటు వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు చెప్పారు. దుర్ఘటనకు కొన్ని గంటలముందు మార్గెరీ రష్యా ప్రధాని మెద్వెదెవ్‌తో భేటీ అయ్యారు.