breaking news
Oh sukumari Movie
-
ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. దాదాపు నెల, ఆ తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం మరీ మూడు వారాలకే డిజిటల్ రిలీజ్ చేసేస్తుంటారు. ఇప్పుడు అలానే ఓ తెలుగు మూవీకి సంబంధించిన ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)'సంక్రాంతి వస్తున్నాం'తో మంచి ఫేమ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్.. తర్వాత పలు చిత్రాలు చేసింది. వాటిలో 'ఓ సుకుమారి' ఒకటి. తిరువీర్ హీరో కాగా భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రూరల్ కామెడీ రొమాంటిక్ కథతో తీసిన ఈ చిత్రం గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మూడు వారాలు తిరిగేసరికల్లా అంటే ఈ శుక్రవారం (ఆగస్టు 07) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'ఓ సుకుమారి' విషయానికొస్తే.. యాదగిరి(తిరువీర్) తన పక్క ఊరిలోని ఓ అమ్మాయిని చూడటానికి వెళ్లి దామిని(ఐశ్వర్య రాజేశ్)పై మనసు పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ ఊళ్లో కూడా ఎలాగైనా దామినికి పెళ్లి చేసి సాగనంపాలనేది గ్రామస్తుల ప్లాన్. దానికి కారణం ఆమెకొక విచిత్రమైన సమస్య ఉండటమే. ఆమెను ముట్టుకోగానే షాక్ కొడుతుంది. ఆ సమస్య వల్ల ఊళ్లో వాళ్లు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే యాది ఇష్టపడటమే ఆలస్యం... ఊరంతా కలిసి దామిని పెళ్లిని ఘనంగా చేసి సాగనంపుతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)అసలు చిక్కులు తర్వాతే మొదలవుతాయి. ముట్టుకుంటేనే షాక్ కొట్టే దామినితో యాదగిరి కాపురం ఎలా చేశాడు? అత్తారింట్లో దామిని ఎలా కలిసిపోయింది? ఆమెకున్న షాక్ సమస్యని తన భర్త, ఊరి జనాలు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? యాది పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం వెనకున్న బలమైన ఆ కారణాలేమిటి? అనేది మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వారం ఈ సినిమాతో పాటు లెనిన్, హృదయం మురళి, వంద దేవుళ్లు, ఉయిర్, మై వాపస్ ఆవుంగా తదితర హిట్ చిత్రాలు.. అలానే వదంది 2, ఆపరేషన్ సఫేద్ సాగర్ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తంగా 23 వరకు మూవీస్, సిరీస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ) -
'ఓ.! సుకుమారి' థాంక్ యూ మీట్(ఫోటోలు)
-
‘ ఓ..! సుకుమారి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఓ..! సుకుమారినటీనటులు: తిరువీర్, ఐశ్వర్య రాజేష్, మురళీధర్ గౌడ్, ఝాన్సీ తదితరులునిర్మాణ సంస్థ: గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత : మహేశ్వర రెడ్డి మూలిదర్శకత్వం: భరత్ దర్శన్సంగీతం: భరత్ మంచిరాజుసినిమాటోగ్రఫీ: సీహెచ్ కుషేందర్ఎడిటర్: శ్రీవరప్రసాద్విడుదల తేది: జులై 17, 2026వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో తిరువీర్. మంచి కథ అయితేనే సినిమా చేస్తారన్న పేరు ఆయన సంపాదించుకున్నాడు. అందుకే ఆయన నుంచి కొత్త సినిమా వస్తుదంటే కొంత ఆసక్తి, అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను ‘ఓ..! సుకుమారి’ అందుకుందా? తిరువీర్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.ఓ..! సుకుమారి కథేంటంటే..తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన యాదగిరి(తిరువీర్) సర్పంచ్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని చిన్నాన్న కొడుకు (గవిరెడ్డి) అతని ప్రత్యర్థికి సపోర్ట్‌గా ఉంటాడు. వీరిద్దరిలో ఎవరైతే పెళ్లి చేసుకొని మగబిడ్డను కంటారో వాళ్లకు 80 ఎకరాల ఆస్తి దక్కుతుందని తాత వీలునామా రాస్తాడు. దీంతో ఆస్థి కోసం యాదగిరి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఓ అమ్మాయిని పెళ్లిచూపులు చూసేందుకు వెళ్లి, అదే ఊరికి చెందిన దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి ఇష్టపడతాడు. దామిని మాములు అమ్మాయి కాదు. ఆమెకు ఓ సమస్య ఉంటుంది. ఎవరిని ముట్టుకున్నా..షాక్ కొడుతుంది. ఊరి పెద్దలంతా ఈ విషయాన్ని దాచి.. యాదగిరితో పెళ్లి చేయిస్తారు. శోభనం రోజు యాదగిరికి ఈ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి వైవాహిక జీవితం ఎలా సాగింది? అసలు దామిని ముట్టుకుంటే షాక్ ఎందుకు వస్తుంది? సర్పంచ్ కావాలన్న యాదగిరి కోరిక నెరవేరిందా లేదా? తాత 80 ఎకరాల ఆస్తి ఎవరికి దక్కింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..అమ్మాయిని ముట్టకుంటే షాక్ కొట్టడం.. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అయితే దాన్ని తెరపై అంతే కొత్తగా ప్రజెంట్ చేయడంలో మాత్రం దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. ఒంట్లో కరెంట్ ఉండే అమ్మాయి..అది తెలియక పెళ్లి చేసుకున్న అమాయకపు అబ్బాయి.. కథగా చూస్తే ఇది చాలా ఆసక్తికరమైన పాయింటే. కానీ దర్శకుడు ఆ పాయింట్ చుట్టు బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో తడబడ్డాడు. హీరోయిన్‌కి ఉన్న సమస్యతో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా కథను నడిపించలేకపోయాడు. ఆ సమస్యను అటు సీరియస్‌గా చర్చించలేక..ఇటు కామెడీగా చూపించలేక.. తటస్థంగా చూపించడంతో ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ కాలేకపోతాడు. ఆ సమస్య ఎలా వచ్చిందో చెప్పారు కానీ..అది చివరిలో ఎలా రాలేదో సరిగా చెప్పలేదు. అయితే కొన్ని చోట్ల కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. సినిమా ప్రారంభం ఆసక్తికరంగానే ఉంటుంది. హీరోయిన్ సమస్యను చూపించి..ఆ తర్వాత హీరో పాత్రని పరిచయం చేశారు. వీరిద్దరి నేపథ్యాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఇద్దరు కలిసే వరకు వచ్చే కామెడీ సీన్లు కొంతమేర నవ్విస్తాయి. పెళ్లి చూపుల పేరుతో ఊర్లో చేసే హంగామా కొంత అతిగా ఉన్నా.. కామెడీ వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత రొటీన్‌గా సాగుతుంది. విడిపోయిన భార్యభర్తలు మళ్లీ కలవడం చుట్టే సన్నివేశాలు రాసుకున్నారు. అయితే ఆయా సీన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేవు. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే..ముట్టుకుంటే కరెంట్ షాక్ తగిలే అమ్మాయి దామినిగా ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించింది. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేసింది. ఇక తిరువీర్ గురించి తెలిసిందే. అమాయకపు పాత్రల్లో ఒదిగిపోతాడు. ఇందులో కూడా ఆయన అలాంటి పాత్రే చేశాడు. కొంచెం పిసినారి, అమాయకపు భర్త యాదగిరిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆమని, క్రాంతి బలివాడ, గవిరెడ్డి శ్రీనివాస్, జీవన్, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పాటలు ఓకే. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


