breaking news
OBSCAND
-
చిన్ని ఆచూకీ దొరికింది
సాక్షి, ప్రకాశం : గత సంవత్సరం అక్టోబర్‌లో తప్పిపోయిన చిన్ని ఆచూకీ దొరికింది. పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ఆశ్రమంలో బాలికను గుర్తించారు. 2017 అక్టోబర్ నెలలో చిన్ని అనే 12 సంవత్సరాల బాలిక మార్కాపురం ప్రభుత్వ వసతి గృహంనుంచి అదృశ్యమైంది. బాలిక అదృశ్యం కేసును జిల్లా ఎస్పీ సవాల్‌గా తీసుకుని నిరంతరం శ్రమించారు. 8 పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ఆశ్రమంలో బాలికను గుర్తించిన పోలీసులు ఒంగోలుకు తరిలించారు. చిన్ని ఆచూకీ లభించటంతో కుటుంబ సభ్యులు సంతోష వ్యక్తం చేశారు. -
నమ్మకానికి చెల్లుచీటి
పాలకొల్లు టౌ¯ŒS : పాలకొల్లులో బాలాజీ ట్రేడర్స్ హోల్‌సేల్ వ్యాపారి జవ్వాజి నాగ వెంకట సత్య నరసింహారావు (రవి) రూ.3కోట్లకు టోకరా వేసి పరారైన ఘటనపై పట్టణానికి చెందిన కిరాణా అసోసియేష¯ŒS అధ్యక్షుడు సన్నిశెట్టి లీలా భవన్నారాయణ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాధితుల కథనం ప్రకారం.. పదేళ్లుగా రంగమన్నారుపేట సమీపంలో కొన్ని షాపులను అద్దెకు తీసుకుని బాలాజీ ట్రేడర్స్ పేరుతో రవి కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ వ్యాపారం ప్రారంభించారు. దీంతోపాటు ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీ నెలకొల్పి వ్యాపారుల వద్ద చిట్స్ వేయించారు. పట్టణంలోని పలువురు వ్యాపారులు రవిపై నమ్మకంతో చిట్స్ వేయడంతోపాటు ఆయనకు రూ.లక్షల్లో వడ్డీలకు అప్పులు ఇచ్చారు. రవి చేతిలో సుమారు 50మంది వరకు మోసపోయినట్టు తెలుస్తోంది. చీటీలు పాడుకున్న పాటదారులకు కూడా సొమ్ములు చెల్లించకుండా రవి ఎగనామం పెట్టినట్టు సమాచారం. పట్టణంలో వ్యాపారుల వద్ద నుంచి రవి సుమారు రూ.కోటి వరకు వడ్డీలకు అప్పులు తీసుకుని చెక్కులు, ప్రాంసరీనోట్లు ఇచ్చినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా పట్టణంలోని ఒక బ్యాంక్‌లో ఆయనకున్న అపార్టుమెంట్, ఖాళీస్థలం తనఖా పెట్టి వాటి విలువ కంటే సుమారు రూ.60 లక్షల వరకు రుణం పొందినట్టు సమాచారం. అతను పరారు కావడంతో ఆ బ్యాంక్ అధికారులు ఏమి చేయాలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అలాగే ఒక రిటైర్డు బ్యాంక్ మేనేజర్ నుంచి రవి రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నట్టు తెలుస్తోంది. రవికి అప్పులు ఇచ్చిన కొంతమంది వ్యాపారులు తమకిచ్చిన చెక్కులు తీసుకుని బ్యాంకులకు వెళితే అవి చెల్లలేదని సమాచారం. ఇదిలా ఉండగా అతని షాపులో పనిచేసిన ఒక వ్యక్తి తన స్థలాన్ని అమ్మి రూ.2లక్షలు రవికి వడ్డీకిచ్చినట్టు సమాచారం. మరికొందరు బాధితులు రెండురోజుల్లో రవిపై ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దు ప్రభావమేనా! పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల వ్యాపారులు డీలా పడుతున్నట్టు తెలుస్తోంది. రవిలాగే చాలామంది జాతకాలు తలకిందులైనట్టు సమాచారం. డెల్టాలో ప్రధానంగా వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు డీలా పడడంతో ఇప్పటివరకు రూ.కోట్ల అప్పులతో నడుస్తున్న వ్యాపారాలు ఒక్కసారిగా స్తంభించిపోవడంతో దిక్కుతోచని స్థితి ఎదురైందని సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా చతికిలపడడంతో లావాదేవీలు జరగక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక డెల్టాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరంలోని కొంతమంది వ్యాపారులు బోర్డులు తిప్పే పరిస్థితులున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.