breaking news
Nuwan Thusahara
-
టీమిండియాతో టీ20 సిరీస్.. శ్రీలంకకు మరో ఊహించని షాక్
స్వదేశంలో టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ నువాన్ తుషార గాయం కారణంగా భారత్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా తుషార చేతి వేలికి గాయమైంది. అనంతరం స్కానింగ్ తరలించగా చేతి వేలు విరిగినట్లు నిర్ధారణైంది.ఈ క్రమంలోనే సిరీస్‌కు తుషార దూరమయ్యాడు. ఈ విషయాన్ని లంక టీమ్ మేనేజర్ మహింద హలంగోడ పైతం ధ్రువీకరించాడు. తుషార ప్రస్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు హలంగోడ తెలిపాడు. ఈ క్రమంలో తుషార స్ధానాన్ని మరో ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.కాగా ఇప్పటికే స్టార్ పేసర్ దష్మంత చమీర సైతం భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు తుషార కూడా గాయం కారణంగా తప్పుకోవడంతో లంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా ఈ సిరీస్ జూలై 27న పల్లెకలె వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు ఇప్పటికే లంకగడ్డపై అడుగుపెట్టింది.భారత్‌తో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, దాసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లాగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరన, మధుశంక, బినుర ఫెర్నాండో -
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్ సొంతం
సెల్హాట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో 28 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. లంక పేసర్ నువాన్ తుషారా 5 వికెట్లతో బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. అతడితో పాటు కెప్టెన్ హసరంగా రెండు, షనక, తీక్షణ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో రిసాద్ హొస్సేన్(53) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ మెండీస్(86) పరుగులతో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. బంగ్లా బౌలర్లలో రిసాద్ హొస్సేన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు.