breaking news
nutakki village
-
గుంటూరు జిల్లా నూతక్కికి మోహన్ భగత్
సాక్షి, గుంటూరు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని విజ్ఞాన విహార్ పాఠశాలలో శనివారం నుంచి మూడు రోజులు జరగనున్న ఆర్ఎస్ఎస్ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆయన మూడురోజులూ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. మంగళగిరి రూరల్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన మోహన్ భగవత్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్, వాసు, పలువురు కార్యకర్తలు స్వాగతం పలికారు -
నూతక్కిలో చోరీ: రూ.2 లక్షల నగదు మాయం
మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో గత అర్థరాత్రి ఓ ఇంట్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాంతో బాధితులు ఆదివారం మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. రూ.2 లక్షల నగదు, 10 సవర్ల బంగారంతోపాటు యూఎస్ డాలర్లను దొంగలు అపహరించుకుని పోయారని బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.