breaking news
n.santosh kumar
-
ఇద్దరు తెలుగు విద్యార్థులకు గౌరవం
అన్నానగర్, న్యూస్‌లైన్: మద్రాసు ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ లోని ఇద్దరు తెలుగు విద్యార్థులకు, తమిళ విద్యార్థికి గూగుల్ సంస్థ అరుదైన గౌరవాన్నిం చ్చింది. గురుప్రకాష్, ఎన్.సంతోష్ కుమార్ తెలుగు వారు కాగా, కెవిన్ కార్తీక్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇంటర్న్ ప్రాజెక్టు కింద వీరికి సంవత్సరానికి రూ.92 లక్షల జీతాన్ని గూగుల్ సంస్థ ఆఫర్ చేసింది. ప్రాజెక్టు ముగిసిన అనంతరం వీరికి తమ సంస్థలో మరింత అధిక జీతంలో ఉన్నత స్థానం కల్పిస్తామని పేర్కొంది. ఐటిలో కంప్యూటర్ విద్యను అభ్యశిస్తున్న వీరి ప్రతిభ ను గుర్తించి గూగుల్‌వీరికి ఇంత పెద్ద మొత్తంలో జీతాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. సోమవారం గూగుల్ నుంచి తమకు అపాయింట్మెంట్ లేఖలు అందాయని వారు తెలిపారు. మూడు నెలల పాటు తాము బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. వీరిలో గురుప్రకాష్ కోవైలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు కాగా, సంతోష్‌కుమార్ స్థానిక అడయారులో ఉంటున్నారు. కార్తీక్ స్థానిక గోపాలపురం డీఏవీ స్కూలు విద్యార్థి. ప్రోగ్రామింగ్‌లో ఈ ముగ్గు రు విద్యార్థులు చూపిన ప్రతిభను గుర్తించి గూగుల్ సంస్థ వీరిని ఆహ్వానించింది. గూగుల్ సంస్థ తమకు ఇచ్చిన 10 వారాల ప్రాజెక్టును ఆరువారాల్లోనే పూర్తి చేస్తామన్నారు. -
ఫేస్బుక్ ద్వారా వేధింపులు..
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమను నిరాకరించిన తోటి విద్యార్థినిపై కక్షగట్టిన ఓ బీఎస్సీ విద్యార్థి ఆమె పేరుతో ఫేస్బుక్ అకౌంట్ తెరచి వేధింపులకు దిగాడు. ఆమె తరపు బంధువులకు అసభ్యకర సందేశాలు పంపసాగాడు. చివరకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అతని ఆటకట్టించారు. క్రైమ్ అదనపు డీసీపీ జానకీ షర్మిల శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. మియాపూర్‌కు చెందిన ఓ యువతి బెంగుళూరులో కంప్యూటర్ కోర్స్ చేస్తున్న సమయంలో కర్ణాటకలోని తుముకూర్ జిల్లాకు చెందిన ఎన్.సంతోష్‌కుమార్ అలియాస్ కిరణ్ (27)తో పరిచయం ఏర్పడింది. కిరణ్ ఆమెను ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె తిరస్కరించింది. దీంతో కక్ష కట్టిన అతను ఆమె వ్యక్తిగత వివరాలు సేకరించాడు. ఆమె ఫొటో, పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్‌ను తెరిచాడు. దీని ద్వారా ఆమె బంధువులు, స్నేహితలకు అసభ్యకర మెయిల్స్ పంపాడు. వారి ఫొటోలను సైతం డౌన్లోడ్ చేసుకునేవాడు. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు మధుసూదన్ సైబర్ క్రైమ్ ఏసీపీ డి.ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో క్రైమ్ డీసీపీ ఎస్.రంగారెడ్డి, అదనపు డీసీపీ జానకీషర్మిల సహకారంతో సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎమ్.నరేందర్‌రెడ్డి, ఎస్ఐ ఎస్.రాఘవేందర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. సంతోష్‌ను నిందితుడిగా తేల్చారు. దీంతో ప్రత్యేక బృందం బెంగళూరు వెళ్లి సంతోష్‌ను అరెస్టు చేసింది. నిందితుడి నుంచి రెండు సిమ్‌కార్డులు, రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.