breaking news
not ask
-
Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది. శుక్రవారం లఖ్‌నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్ -
నల్లా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగం
విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ : ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఏడాదికి ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలంలోని సింగాపూర్‌లో రూ.1.25 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రతి పేదవాడికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొద్ది మంది వ్యక్తులో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఒకరని గుర్తు చేశారు. సింగాపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. అర్హులందరికీ పింఛన్ అందిస్తామన్నారు. రూ.130 కోట్లతో ఎస్సారెస్పీ కాలువ మరమతు చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు రాకాసిగుండ్ల వద్ద మొక్కలు నాటారు. మండలంలోని తుమ్మనపల్లి, బోర్నపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీపీ వొడితల సరోజినీదేవి, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, సర్పంచులు కౌరు రజిత, సుధాకర్, మాసాడి స్వరూప, సమ్మయ్య, తహసీల్దార్ జగత్సింగ్, ఎంపీడీవో ఉషశ్రీ పాల్గొన్నారు.