breaking news
north east India
-
కష్టమైన పనులను గాలికొదిలేసింది
ఈటానగర్/అగర్తలా: ఈశాన్య భారతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. ఈశాన్యభారతంలో పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రూ.5,100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటానగర్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం రెండు లోక్‌సభ స్థానాలే ఉన్నాయి. రాజకీయంగా ఈ రెండు సీట్లతో తమకు ఎలాంటి ప్రయోజనంలేదని కాంగ్రెస్ ఎప్పుడో భావించింది. ఈశాన్యభారతంలో కష్టమనిపించిన ఏ అభివృద్ధి ప్రాజెక్టు, పనినీ కాంగ్రెస్ భుజాలకెత్తుకోలేదు. కొండలు, అటవీప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం సవాళ్లతో కూడిన పని. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నాయి. అభివృద్ధి పనులను వదిలేసే కాంగ్రెస్ ని్రష్కియాపర్వం కారణంగా ఈశాన్యభారతం అభివృద్ధికి అస్సలు నోచుకోలేదు. ఇలా పనులను గాలికొదిలేయడం కాంగ్రెస్‌కు వారసత్వంగా వచ్చిన దురలవాటు. కాంగ్రెస్ కారణంగా నిర్లక్ష్యానికి గురైన అరుణాచల్‌ప్రదేశ్‌ను ఢిల్లీలో కూర్చుని పరిపాలిస్తే సరిపోదని నాకు అర్థమైంది. అందుకే రాష్ట్రానికి తరచూ కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను పంపించా. నేను కూడా ఈశాన్యభారతంలో ఇప్పటిదాకా 70 సార్లకుపైగా పర్యటించా. దశాబ్దకాలంలో చూస్తే మంత్రులు, అధికారులు 800 సార్లు పర్యటించారు. రహదారులు నిర్మించడం అసాధ్యమని కాంగ్రెస్ భావించిన అదే చోట్ల ఇప్పుడు ఆధునిక రహదారులను నిర్మించాం. సేతు టన్నెల్‌నే తీసుకోండి. ఒకప్పుడు అది సాధ్యమని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ఇది అరుణాచల్‌ప్రదేశ్ గౌరవ గుర్తింపుగా నిలిచింది. హోలోంగి ఎయిర్పోర్ట్ సైతం కొత్త టరి్మనల్తో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి విమానసర్వీసులు ఉన్నాయి. ఈ అనుసంధాన ప్రాజెక్టులు ప్రయాణాలను సులభతరం చేశాయి. రైతులు తమ ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు తరలించగల్గుతున్నారు’’ అని మోదీ అన్నారు. ఆ ఆలోచనను మార్చాలనుకున్నా ‘‘2014లో తొలిసారిగా ప్రధానిగా దేశ సేవచేసే అవకాశం వచ్చినప్పుడు ఒక్కటే అనుకున్నా. కాంగ్రెస్ భావజాల సుడిగుండం నుంచి దేశాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నా. ఏ రాష్ట్రంలోనైనా మా మార్గదర్శకం ఓట్లు, సీట్లు్ల కావు. దేశమే ముఖ్యం అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఎవరి గురించి అయితే ఎవరూ పట్టించుకోలేదో వాళ్లనే మోదీ పట్టించుకుంటాడు. అదే అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం. అందుకే 2014 నుంచి అభివృద్ధికి కొత్త కేంద్రంగా అరుణాచల్‌ప్రదేశ్‌ను మలిచా. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలుంటే కలిగే డబుల్ ప్రయోజనాలకు అరుణాచల్ ఒక మచ్చుతునక. ఈరోజు ప్రకటించిన పలు విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయ్యాక రాష్ట్రం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా భాసిల్లుతుంది. రూ.1,750 కోట్ల వ్యయంతో 80.2 కోట్ల యూనిట్ల వార్షిక విద్యత్ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన టాటో–1 ప్రాజెక్ట్ పూర్తయితే వేలాది మందికి ఉపాధితోపాటు సరసమైన ధరలో విద్యుత్ అందుబాటులో ఉంటుంది’’అని మోదీ అన్నారు. షియో మీ జిల్లాలో యార్జేప్ నదిపై రెండు భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. అలిగిన కూటమి పార్టీ త్రిపురలో మోదీ పాల్గొన్న కార్యక్రమాల్లో కనీసం తమకు ఆహ్వానం అందలేదని త్రిపుర రాష్ట్రంలో కూటమి సర్కార్‌లో భాగస్వామి అయిన ‘ది తిప్రా మోథా’ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ టీఎంపీ సీనియర్ ఎమ్మెల్యే రంజిత్ దేవ్‌వర్మ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘ త్రిపురేశ్వరీ ఆలయం ప్రాంగణంలో మోదీ చేపట్టిన పునరుద్ధరణ భవనాల ప్రారం¿ోత్సవాలు, పూజా కార్యక్రమాల్లో మా టీఎంపీ పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేవ్‌వర్మను ఆహ్వానించలేదు. కూటమి సర్కార్‌లో సభ్యులై ఉండికూడా పార్టీ ఎమ్మెల్యేలను పిలవలేదు. ఆలయాన్ని కట్టించిన మహారాజ ధన్య మాణిక్య రాజవంశానికే చెందిన రాజమాత విభూ కుమారి దేవికి సైతం ఆహ్వానం అందలేదు’’ అని దేవ్‌వర్మ అసహనం వ్యక్తంచేశారు. 1949 సెపె్టంబర్లో నాటి భారత సర్కార్, రాణి కంచన్ ప్రవదేవీల మధ్య ఒడంబడిక కుదిరేనాటికి ఈ ఆలయం ఈ వంశస్తుల అధీనంలోనే ఉందని దేవ్‌వర్మ గుర్తుచేశారు. మాకూ ఆహ్వానం అందలేదని మరో కూటమి పార్టీ ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో మాటామంతీ అరుణాచల్ రాజధాని ఇటానగర్‌లో ఇందిరాగాంధీ పార్క్‌లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌నూ మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి స్వయంసహాయక సంఘాల ప్రతినిధులు, స్థానిక వ్యాపారులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తగ్గిన జీఎస్టీతో మీకు ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయో వాళ్లను మోదీ స్వయంగా అడిగి తెల్సుకున్నారు. ‘‘ స్థానిక వ్యాపార వర్గాలతో నేరుగా సంభాషించడం ద్వారా వాళ్లలో ఉత్సాహాన్ని పెంచడంతోపాటు వ్యాపారాన్ని మరింత అభివృద్ధిచేయాలని వాళ్లను ప్రోత్సహించా. ఇలాంటి చర్యలు క్షేత్రస్థాయి నుంచి వ్యాపారమూలాలను మరింత బలోపేతం చేస్తాయి’’అని మోదీ ఆ తర్వాత అన్నారు. జీఎస్టీ ద్వారా ఒకే దేశం, ఒకే పన్ను భావనను తీసుకొచ్చి పాత పలురకాల పన్నులకు ప్రధాని మోదీ చరమగీతం పాడారని అక్కడి స్థానిక వ్యాపారులు గుర్తుచేసుకున్నారు. జీఎస్టీ తగ్గడంతో నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుందని, దీంతో గృహనిర్మాణ ఖర్చులు కలిసొస్తాయని స్థానిక వ్యాపారులు మోదీతో చెప్పారు. ముడిసరుకులు తక్కువ ధరకు లభిస్తాయని, దీంతో స్థానిక ఉత్పత్తుల తయారీ వ్యయం తగ్గనుందని ఆదాయం పెరిగే అవకాశముందని వాళ్లు మోదీతో అన్నారు. వికసిత్ భారత్ సుసాధ్యం కావాలంటే మీరంతా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని, స్వదేశీ వస్తువులనే అమ్మాలని వాళ్లకు మోదీ సూచించారు.త్రిపురేశ్వరీ ఆలయంలో పూజలు త్రిపురలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ గోమతీ జిల్లాలోని ప్రఖ్యాత త్రిపురేశ్వరీ ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీర్థయాత్ర కాయకల్ప, అభివృద్ధి(ప్రసాద్) పథకంలో భాగంగా రూ.52 కోట్లతో చేపట్టిన త్రిపురేశ్వరీ ఆలయ మరమ్మతు పనులు పూర్తయిన సందర్భంగా మోదీ గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ‘మహారాజా’ ధన్య మాణిక్య 1501 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 500 సంవత్సరాల ఘనచరిత గల ఈ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటిగా భక్తులు కొలుస్తారు. సోమవారం ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు కలియతిరిగారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్‌సాహా, సీనియర్ ఉన్నతాధికారులు మోదీకి ఆలయ విశిష్టతను వివరించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆలయ ప్రత్యేకతను చాటే ఎగ్జిబిషన్‌నూ మోదీ సందర్శించారు. మండే ఎండలోనూ మోదీని చూసేందుకు జనం ఎగబడ్డారు. గత 11 సంవత్సరాల్లో త్రిపురకు మోదీ రావడం ఇది 11వ సారి కావడం విశేషం. ‘11 ఏళ్లలో మోదీ 11 సార్లు త్రిపురకు వచ్చారు. నవరాత్రి తొలిరోజున భక్తిశ్రద్ధలతో మోదీ సంప్రదాయ ధోతీలో మాతా త్రిపురసుందరిని దర్శించుకున్నారు’ అని ఎంపీ బిప్లవ్ కుమార్ వెల్లడించారు. ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయ కాంప్లెక్స్‌లో భక్తులు సేదతీరేందుకు పెద్ద హాల్, వేచి ఉండే గది, ధ్యానం హాల్, పూజారి గది, మ్యూజియంలను నిర్మించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక గది ఏర్పాటుచేశారు. ఒకేసారి రెండు లక్షల మంది భక్తులు సందర్శించినా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా 30,000 చదరపు అడుగుల్లో ఏర్పాట్లు చేశారు. దీపావళి రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి మరీ విపరీతంగా ఉంటుంది. -
‘ఈశాన్యం’లో అభివృద్ధి వేగవంతం
ఈటానగర్/జోర్హాట్: ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈశాన్య భారతదేశానికి సంబంధించి రూ.55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ఈటానగర్‌లో ‘వికసిత్ భారత్–వికసిత్ నార్త్ఈస్ట్’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇండియాకు.. దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలకు మధ్య వాణిజ్యం, టూరిజంతోపాటు ఇతర సంబంధాల విషయంలో ఈశాన్య రాష్ట్రాలు బలమైన అనుసంధానంగా మారబోతున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని, అభివృద్ధిని వేగవంతం చేశామని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించేవారికి ‘మోదీ గ్యారంటీ’ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఈశాన్య ప్రజలంతా నా కుటుంబ సభ్యులే మోదీకి కుటుంబం ఉందా అని ప్రతిపక్ష నేతలు ప్రశి్నస్తున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఒక్కటే చెబుతున్నా. ఈశాన్య రాష్ట్రాల ప్రజలంతా నా కుటుంబ సభ్యులే’’ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సురక్షితతాగునీరు, సొంతిల్లు, వంట గ్యాస్ కనెక్షన్, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. అప్పడే ‘వికసిత్ భారత్’ కల నెరవేరుతుందన్నారు. సేలా టన్నెల్ జాతికి అంకితం ప్రపంచంలో అత్యంత పొడవైన రెండు వరుసల సొరంగం ‘సేలా టన్నెల్’ను మోదీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్–చైనా సరిహద్దు ఎల్ఏసీ సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రూ.825 కోట్లతో సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తున ఈ టన్నెల్ నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలున్నాయి. ఒకటి సింగిల్ ట్యూబ్ టన్నెల్. దీని పొడవు 1,003 మీటర్లు. ఎస్కేప్ ట్యూబ్‌తో కూడిన రెండో టన్నెల్ పొడవు 1,595 మీటర్లు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బలిపారా–చారిదువార్–తవాంగ్ మార్గం మూతపడుతోంది. సేలా టన్నెల్‌తో ఆ ఇక్కట్లు తప్పాయి. లచిత్ బోర్ఫుకన్ విగ్రహావిష్కరణ అస్సాంలోని జోర్హాట్లో 125 అడుగుల ఎత్త యిన అహోం జనరల్ లచిత్ బోర్ఫుకన్ కంచు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అస్సాం సంప్రదాయ దుస్తులు, తలపాగా ధరించి, అహోం ఆచార ంలో పాలుపంచుకున్నారు. అస్సాంలో 1228 నుంచి 1826 వరకు అహోం రాజవంశం పరిపాలన సాగింంచింది. 1671లో జరిగి న స రాయ్‌ఘాట్ యుద్ధంలో అహోం సైనికాధికా రి లచిత్ బోర్ఫుకన్ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. బలీయమైన మొ ఘల్ సైన్యాన్ని వెనక్కి తరిమికొట్టారు. అహోం రా జ్యాన్ని కాపాడారు. ఆయనను అస్సాం ప్రజ లు ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు. -
ఉత్తరంలోనే బీజేపీ హవా... దక్షిణాదిన అంతంతే, మెరుగవుతున్న కాంగ్రెస్
కర్ణాటక ఫలితాలతో దేశ రాజకీయ ముఖచిత్రం మారింది. బీజేపీ ఇప్పటికీ ఉత్తరభారతం, ఈశాన్య భారతంలో తన పట్టు ప్రదర్శిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత దశాబ్ద కాలంలో దేశ రాజకీయాల్లో పెనుమార్పులే వచ్చాయి. దక్షిణాదిలో పెద్దగా బలం పుంజుకోలేకపోయినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం బీజేపీ తన పట్టు కొనసాగిస్తూ వస్తోంది.. దక్షిణం మినహా... దశాబ్ద కాలంగా బీజేపీ అత్యధికంగా పట్టు నిలుపుకున్నది ఉత్తరాది రాష్ట్రాల్లోనే. అయితే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2017 నాటికి 60 శాతం అసెంబ్లీ స్థానాలు బీజేపీ ఖాతాలో ఉంటే, 2022 నాటికి 47 శాతానికి తగ్గాయి. 2023కు మరింత తగ్గి 44 శాతానికి పరిమితమైంది. ఉత్తరాదిన యూపీలో బీజేపీ వరస విజయాలతో ఊపు మీదుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు కూడా బీజేపీ వైపే ఉన్నాయి. 2012లో అక్కడ ఏమాత్రం బలం లేని కమలదళం పదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. మొత్తం 498 ఈశాన్య అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి అప్పట్లో కేవలం 2 శాతం స్థానాలే ఉండగా ఇప్పుడది ఏకంగా 36 శాతానికి పెరిగింది పశ్చిమ భారతంలోనూ బీజేపీయే కీ ప్లేయర్. గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి 2012లో 44% సీట్లుండగా ఇప్పుడు 52 శాతానికి పెరిగాయి. తూర్పుభారతంలోనూ బీజేపీ మెరుగవుతూ వస్తోంది. బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో 2012లో బీజేపీకి ప్రతి ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరే ఉండగా ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకరున్నారు. ప్రాంతాలవారీగా ఎమ్మెల్యేల బలాబలాలు ► గత 11 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం తగ్గుతూ వస్తోంది. 2013, 2018లో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. ► ఇన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌యేతర పార్టీలు అసెంబ్లీల్లో తమ పట్టు కొనసాగిస్తూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగానున్న ఎమ్మెల్యేలలో 50% మంది ప్రాంతీయ పార్టీల్లోనే ఉన్నారు. రాష్ట్రాల్లోని 3వ వంతు మంది ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన వారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతీ 10 మంది ఎమ్మెల్యేలలో బీజేపీకి ఒకరే ఉన్నారు. ► 2012 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 1,224 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీకి 845 మంది ఉన్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా హస్తం హవా ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టేసి క్రమంగా బీజేపీ బలపడుతూ వచ్చింది. 2023 మే నాటికి దేశంలో 4,033 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో బీజేపీకి చెందినవారు 1,329 కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 735కి తగ్గిపోయారు. కాంగ్రెస్ మరింత పట్టు పెంచుకుంటుందా? 2012–22 మధ్య దేశవ్యాప్తంగా బీజేపీ అదనంగా 540 ఎమ్మెల్యే స్థానాలను సంపాదించుకుంటే కాంగ్రెస్ 505 సీట్లు కోల్పోయింది! రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత కర్ణాటకలో సాధించిన విజయం నేపథ్యంతో మున్ముందు తన పట్టు ఇంకా పెరుగుతుందని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం గ్రాఫ్ మరింత మెరుగవుతుందని ఆశిస్తోంది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
Bhimbor Deori: భీంబర్ డియోరీ.. ఎవరో తెలుసా?
భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సంరంభంలో ఉన్న మనం ఈశాన్య భారత్‌కు చెందిన భీంబర్ డియోరీని గుర్తుచేసుకోవాలి. ఈయన అసోంను తూర్పు పాకిస్తాన్లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన జన నాయకుడు. అలాగే స్వదేశీ వర్గాలను ఉద్ధరించడంలో, అసోం ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగా అసోం విధాన సభలో గిరిజనుల కొరకు 5 స్థానాలు రిజర్వు చేయబడ్డాయి. స్వాతంత్య్రేచ్ఛ ఆయన రక్తంలోనే ఉంది. ప్రత్యేక మాతృభూమి కోసం 1945 మార్చి 21– 23 మధ్య ‘ఖాసీ దర్బార్ హాల్ తీర్మానాలు’ చేశారు. ఈ తీర్మానాలతో వివిధ గిరిజన తెగలకు చెందిన స్థానిక నాయకులు తమ స్వతంత్ర మాతృభూమిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన 1903 మే 16న అసోంలోని శివసాగర్ జిల్లాలోని వనిదిహింగ్ గ్రామంలో గోదారం డియోరీ, బజోతి డియోరీ దంపతులకు జన్మించారు. సాధారణ గిరిజన యువకుడైన భీంబర్ అసోం సివిల్ పరీక్షలో ప్రథమ స్థానం సంపాదించారు. కానీ ఈయన గిరిజనుడైనందున బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. పట్టుదలతో ఆయన డిబ్రుగర్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1933లో ‘అసోం బ్యాక్వర్డ్ ప్లెయిన్స్ ట్రైబల్ లీగ్’ని స్థాపించి దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా పని చేశారు. 1941 జూన్ 18న వివిధ విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులను జనరల్ డైనింగ్ హాల్లోకి అనుమతించమని పోరాడారు. 1946 జూలై 8న అసోం ప్రభుత్వంలో అటవీ, కార్మిక శాఖ మంత్రిగా నియమితులైనారు. అసోం ప్రజల హృదయాల్లో భీంబర్ డియోరీ ఆదివాసీల నాయకుడిగానేగాక, ఆదర్శ జననేతగా నిలిచి 1947 నవంబర్ 30న తనువు చాలించారు. – గుమ్మడి లక్ష్మీ నారాయణ ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (నవంబర్ 30న భీంబర్ డియోరీ 75వ వర్ధంతి) -
నన్ను ప్రధాని ఆహ్వానిస్తే.. అదే చెప్తా!
న్యూఢిల్లీ: ఆమె ఈశాన్య భారతానికి చెందిన అందాల పోటీలో కంటెస్టెంట్. 2019 మిస్ కోహిమా అందాల పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచారు. అందాల పోటీలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ఆమె ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆవుల కన్నా మహిళల మీద ప్రధాని మోదీ ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఆమె సూచించారు. అందాలపోటీ ఫైనల్ రౌండ్ భాగంగా జ్యూరీ సువోహును ప్రశ్నిస్తూ.. ‘ప్రధాని నరేంద్రమోదీ మిమ్మలి పిలిచి మాట్లాడితే.. మీరు ఏం మాట్లాడారు?’ అని అడిగింది. దీనికి సువోహు సమాధానమిస్తూ.. ‘నన్ను భారత ప్రధాని మాట్లాడేందుకు పిలిస్తే.. ఆవుల మీద కన్నా మహిళల మీద ఎక్కువ శ్రద్ధ చూపాలని ఆయనకు చెప్తాను’అంటూ సూటిగా సమాధానం చెప్పారు. ఆమె తెలివిగా ఇచ్చిన ఈ సమాధానంతో ఆడియేన్స్‌లో నవ్వులు విరిశాయి. పదిరోజుల కిందట నాగాలాండ్‌లోని జోట్సోమాలో ఈ అందాల పోటీ ఫైనల్ రౌండ్ జరిగింది. ‘ఎడ్యుకేట్ ఏ గర్ల్.. ఎంపవర్ ఏ సొసైటీ’ అనే థీమ్‌తో స్థానిక అగాథోస్ సొసైటీ ఈ అందాల పోటీని నిర్వహించింది. అందాల పోటీలో సువోహు ఇచ్చిన సమాధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. -
ఎందుకు ఇలా అవుతోంది?
కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తడంతో కేరళ విలవిలలాడుతోంది. సాయం కోసం ఎదురుచూస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇలా ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఈ సీజన్లో అత్యధిక వర్షాలు, వరదలతో సతమతమయ్యే ఈశాన్య రాష్ట్రాల్లో ఈసారి కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రాల్లో వర్షాలు లేకపోవడంతో మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనీస స్థాయీ కరువే అస్సాంను వర్షాకాలంలో ఏటా వరదలు ముంచెత్తుతాయి. అయితే, ఈ ఏడాది ఆగస్టు 18 వరకు 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అస్సాంలో సాధారణ వర్షపాతం 1088.5 మిల్లిమీటర్లు. ఇప్పటివరకు కురిసింది 759.3 మి.మీ. మాత్రమేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మణిపూర్‌లో 66 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 46 శాతం, మేఘాలయాలో 43 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో 28 శాతం, 23 శాతం, 10 శాతం తక్కువగా నమోదయ్యాయి. అత్యధిక వర్షపాతం కల్గిన మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాల్లోని మాసిన్రం, సోహ్రాల్లో ఈ సీజన్లో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదు అవ్వడం గమనార్హం. తేమశాతం తగ్గిపోవడం వల్లే.. నైరుతీ రుతుపవనాల కాలంలో ఈశాన్య ప్రాంతంలో వీస్తున్న గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉంటోంది. పశ్చిమ బంగాళాఖాతంలో తరుచుగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా పశ్చిమం నుంచి దక్షిణ దిశగా గాలులు వీయడంతో తేమ శాతం తగ్గిపోతోందని ప్రాంతీయ వాతావరణ శాఖకు చెందిన ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా కురవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎగువ అస్సాంలోని నార్త్ లక్ష్మిపూర్‌లో రెండు రోజుల క్రితం 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రీజియన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఇక్కడ సాధారణం కంటే 6.2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. తేమతో కూడిన మేఘాలు లేకపోవడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని ప్రాంతీయ వాతావరణశాఖ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. నైరుతీ రుతుపవనాలు జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని కావున సీజన్ ఇంకా ముగియలేదని, అయితే ఈసారి సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. -
అసోంలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదు
గౌహతి: అసోంలో ఆదివారం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదు అయింది. కోక్రఝర్ సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని తెలిపారు.