-
అమెరికాకు.. చైనా సరికొత్త సవాల్!
బీజింగ్ : అమెరికా ప్రయోగించిన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ అనే బాంబుకు దీటుగా.. చైనా కూడా అంతటి సామర్థ్యం గల బాంబును రూపొందించినట్లు తెలుస్తోంది. హెచ్- 6కె అనే బాంబర్ సాయంతో దానికి పరీక్షించినట్లు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు... ‘చైనా అమ్ములపొదిలో ఉన్న అతి శక్తిమంతమైన బాంబు చేరింది. దీనికి మదర్ ఆఫ్ ఆల్‌బాంబ్స్ అని నామకరణం చేశారు. చైనా రక్షణ సంస్థ ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ రూపొందించిన ఈ బాంబును అణు బాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి అత్యధిక స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించవచ్చు’ అని ట్వీట్ చేసింది. కాగా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా చైనా చెప్పుకొంటున్న ఈ బాంబును పరీక్షించిన వీడియోను.. ఆ దేశ రక్షణ సంస్థ నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ ) తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. తద్వారా తమ వద్ద కూడా అణు బాంబులకు ప్రత్యామ్నాయ, అత్యంత శక్తిమంతమైన బాంబులు ఉన్నాయని చైనా.. ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు పరోక్ష హెచ్చరికలు జారీచేసింది. హెచ్-6కె అనే బాంబర్ ద్వారా దీనిని ప్రయోగించినట్టు పేర్కొంది. ఈ విషయం గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. అమెరికా రూపొందించిన బాంబు కంటే తాము రూపొందించిన ఈ బాంబు అత్యంత చిన్నది, తేలికైనదని, దీనిని మోసుకువెళ్లేందుకు పెద్ద పెద్ద ఎయిర్‌క్రాఫ్టులు అక్కర్లేదని తెలిపారు. ఇక అఫ్గనిస్తాన్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అమెరికా సైన్యం.. గతేడాది జీబీయూ-43/బి అనే బాంబును ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీనికి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ అనే పేరు పెట్టారు. ఈ క్రమంలో చైనా కూడా తమ కొత్త బాంబుకు అదే పేరు పెట్టి.. అగ్రరాజ్యానికి సవాల్ విసిరింది. కాగా రష్యా కూడా ఇటువంటి బాంబునే తయారు చేసి దానికి ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా నామకరణం చేసింది. అత్యంత పెద్దది, థర్మోబరిక్ అయిన ఈ బాంబు గ్యాస్‌ను ఉపయోగించుకుని... పెద్ద పెద్ద ఫైర్‌బాల్స్‌ను విసరడం ద్వారా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. అయితే చైనా రూపొందించిన బాంబు మాత్రం థర్మోబరిక్ బాంబు కాదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. China's arms industry giant NORINCO for the first time showcased a new type of massive aerial bomb, which it dubbed the Chinese version of the "Mother of All Bombs" due to its huge destruction potential that is claimed to be only second to nuclear weapons. https://t.co/Xwa470K0R5 pic.twitter.com/bWDvmfvcyk — Global Times (@globaltimesnews) January 3, 2019 -
అఫ్గాన్‌పై 9,720 కిలోల బాంబు
అతిపెద్ద బాంబుతో అమెరికా దాడి వాషింగ్టన్: ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’(ఎంఓఏబీ)గా పిలుచుకునే ప్రపంచంలోని అతి పెద్ద బాంబును అమెరికా గురువారం ప్రయోగించిగంది. అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ సొరంగాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల సమయంలో నంగర్హర్ రాష్ట్రం అచిన్ ప్రాంతంలో ఖొరాసన్ సొరంగంపై 9,720 కిలోల బాంబును అమెరికా యుద్ధ విమానం (ఎంసీ–130) జారవిడిచింది. జీబీయూ–43బీ పేరున్న ఈ ఎంఓఏబీని యుద్ధ కేత్రంలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పెంటగన్ ప్రతినిధి ఆడమ్ స్టంప్ తెలిపారు. బాంబు ప్రయోగించే సమయంలో సాధారణ పౌరులకు నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ చెప్పారు. అఫ్గాన్‌లోని ఐసిస్‌ను ఓడించేందుకు కొనసాగుతున్న దాడుల్లో భాగంగానే ఈ బాంబును ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు వెల్లడించారు. నిజానికి ఎంఓఏబీ అంటే ‘మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్’ అని అర్థం. 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో ఈ బాంబు తయారుచేసినా ఇంతవరకూ వినియోగించలేదు. ఈ బాంబు తయారుచేసిన కొద్ది కాలానికే ఎంఓఏబీ కంటే శక్తివంతమైన ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్’ను రష్యా తయారుచేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement