breaking news
Nikhitha Reddy
-
ఈ రోజు మా అక్కతోనే..
షూటింగ్ నిమిత్తం ఎక్కడ ఉన్నా సరే.. రాఖీ పండగ రోజు మాత్రం ఖచ్చితంగా మా అక్క నిఖితారెడ్డి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుంటాను. మా అక్కకి నేనంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. అందరి అక్కలకు తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది. కానీ మా అక్కది కొంచెం ఎక్కువ ప్రేమ. ఆమె రాఖీ కట్టగానే నేను ఏదో ఒక గిప్ట్ ఇస్తాను. ఇప్పుడు హీరోగా రేంజ్పెరిగింది కాబట్టి గిప్ట్ రేంజ్ కూడా పెరుగుతుంది. తమ్ముడిగా ఏం ఇవ్వకపోయినా ఆమె హ్యాపీగానే ఉంటుంది.. కానీ నాకే ఆమెకు ఏమన్నా మంచి గిప్ట్ ఇవ్వాలని పిచ్చి. ఈ రోజంతామా అక్కతోనే ఉంటాను. -
ఛలో అమెరికా
నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మేఘా ఆకాష్ కథానాయిక. నిఖితా రెడ్డి సమర్పణలో పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందజేశారు. విభిన్న లోకేషన్లలో ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ యూఎస్‌లో జరగనుంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన వినోదాత్మక కథతో రూపొందుతున్న చిత్రమిది. ఈ రోజు నుంచి దాదాపు 35రోజుల పాటు యూఎస్‌లో షూటింగ్ జరపబోతున్నాం. అక్కడ కీలక సన్నివేశాలతో పాటు సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరించనున్నాం’’ అన్నారు. నరేశ్, రావు రమేశ్, లిజి, ప్రగతి, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్.