breaking news
Nikhil Patil
-
రెండో భర్తతో విడాకులు.. ఆ విషయంలో వదిలిపెట్టేది లేదన్న బుల్లితెర నటి!
బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ చెప్పాల్సిన పనిలేదు. సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదటి భర్తతో విడిపోయినా ఆమె.. రెండో పెళ్లి కూడా కలిసిరాలేదు. వ్యాపారవేత్త నిఖిల్ పటేల్‌ను రెండో పెళ్లి చేసుకోగా.. ఆతర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు. 2023లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కగా కొన్ని నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దల్జీత్ కౌర్ తన విడాకులపై మరోసారి మాట్లాడింది. తన మాజీ భర్త నిఖిల్ పటేల్‌పై విమర్శలు చేసింది. విడిపోయాక తన లైఫ్‌లో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను పంచుకుంది. ఈ విషయంలో నిఖిల్ పటేల్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ విషయంలో మాత్రం తాను మౌనంగా ఉండనని స్పష్టం చేసింది. అతను క్షమాపణ చెప్పేవరకు పోరాటం చేస్తానని దల్జీత్ కౌర్ తెలిపింది.దల్జీత్ కౌర్ మాట్లాడుతూ.. 'పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ నా లైఫ్‌లో మళ్లీ ఇలా జరగడం చాలా కోపం తెప్పించింది. ఈ విషయంలో తాను మౌనంగా ఉండనన్న విషయం నిఖిల్ తెలుసుకోవాలి. అతను నాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈ విషయంలో నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా. నాకు అతని వద్ద నుంచి క్షమాపణ రావాలి. దానికోసం ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్తా ' అని అన్నారు.కాగా.. నిఖిల్‌తో పెళ్లి తర్వాత కెన్యా వెళ్లిన ఆమె కేవలం పది నెలలకే ఇండియాకు తిరిగొచ్చింది. తన కుమారుడితో సహా వచ్చిన తర్వాత అతనిపై తీవ్ర విమర్శలు చేసింది. నిఖిల్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. అతనికి మరొకరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని..తనను మానసిక వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత నిఖిల్ తన స్నేహితురాలు సఫీనా నాజర్‌తో కూడా ముంబయిలో కనిపించారు.2009లో మొదటి పెళ్లి..కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కావడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి దుర్మరణం
సాక్షి, ముంబై: జల్గావ్ జిల్లా భడ్గావ్ సమీపంలోని కాలువలోకి కారు దూసుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు నీటిలో మునిగి మరణించారు. అందిన వివరాల మేరకు పారోలా-భడ్గావ్ రోడ్డుపై నాలబందీఫాటా సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోరోలా నుంచి నిఖిల్ పాటిల్ (31), శివాజీ పాటిల్ (29), భూషణ్కుమర్ అలియాస్ అమోల్ పాటిల్ (34) అనే ముగ్గురు భడ్గావ్కు ఇండికా కారులో సోమవారం రాత్రి బయలుదేరారు. నాలబందీఫాటా సమీపంలో జామదా ఎడమ కాలువ వద్ద ఉన్న మలుపు కన్పించక కాలువలో ఇండికా కారు అందులోకి దూసుకుపోయింది. అర్థరాత్రి కావడంతో ఈ ఘటన గురించి ఎవరికీ తెలియరాలేదు. అయితే రాత్రి ఒంటి గంట అయినప్పటికీ వారు ఇంటికి చేరుకోకపోవడంతో నిఖిల్, శివాజీ, అమోల్ తల్లిదండ్రులు వారి కోసం వెదుకులాట ప్రారంభించారు. అలాగే సమీప పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కాగా, తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో కాలువలో కారు పడిపోయిన సంగతి బయటపడింది. దాంతో స్థానికుల మద్దతుతో కాలువ నుంచి ఇండికా కారును బయటికి తీశారు. ఆ కారులో ముగ్గురి మృతదేహాలు లభించాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేకెత్తించింది.