breaking news
newark airport
-
Indian Student In USA: బేడీలేసి.. బలంగా అదిమిపట్టి
వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ సర్కార్ కర్కశ వైఖరి తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక భారతీయ విద్యార్థిని బలవంతంగా ఇండియాకు తరలిస్తూ అతని పట్ల దారుణంగా వ్యవహరించిన వ్యవహారం ఆలస్యంగా మీడియాకు బహిర్గతమైంది. విద్యార్థిని నేరస్తుడి తరహాలో సంకెళ్లు వేసి, దారుణంగా హింసిస్తూ నేలకేసి అదిమిపట్టి అదుపులోకి తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విద్యాభ్యాసం కోసం తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న కునాల్ జైన్ అనే ఒక ప్రవాసభారతీయుడు తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేయడంతో ఈ దారుణోదంతం బహిర్గతమైంది. హరియాణా రాష్ట్రం నుంచి వచ్చిన ఒక భారతీయ యువకుడిని నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. నేనే తప్పు చేయలేదని అరుస్తున్న ఆ యువకుడిని పోలీసులు వెంటనే కిందపడేసి నేలకేసి బలంగా అదిమిపట్టారు. ఒక పోలీసు ఆ యువకుడి మీదనే కూర్చున్నాడు. ‘‘ నేరస్తుడిలా సంకెళ్లు వేయడంతో ఏడుస్తున్న ఆ విద్యార్థిని చూస్తుంటే చాలా జాలివేసింది. కలలను నిజం చేసుకునేందుకు అమెరికాకు వచ్చిఉంటాడు. ఎవరికీ ఏ హానీ తలపెట్టకపోయినా ఇలా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనను కళ్లారా చూస్తూకూడా నేను నిస్సహాయుడినైపోయా. నా హృదయం ముక్కలైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులను ఇలా బలవంతంగా పంపేయడం నిజంగా పెద్ద విషాదం. ఆ అబ్బాయి హరియాణా యాస అయిన హర్యాణ్వీలో మాట్లాడుతున్నాడు. ‘‘నాకేం పిచ్చిలేదు. ఈ అధికారులు నేను పిచ్చివాడిని అని అందర్నీ న మ్మించేందుకు కుట్ర పన్నారు’’ అని ఆ విద్యార్థి అరవడం ఆ వీడియోలో కనిపించింది. Here more videos and @IndianEmbassyUS need to help here. This poor guy was speaking in Haryanvi language. I could recognise his accent where he was saying “में पागल नहीं हूँ , ये लोग मुझे पागल साबित करने में लगे हुए हे” pic.twitter.com/vV72CFP7eu— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025ఇండియన్ ఎంబసీ ఆదుకోవాలి‘‘ఇలాంటి విద్యార్థుల అంశంలో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జోక్యం చేసుకుని విద్యార్థులకు తగు న్యాయం జరిగేలా చూడాలి. నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఇతని పట్ల దారుణంగా ప్రవర్తించిన న్యూజెర్సీ అధికారులతో మాట్లాడేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది’’ అని జైన్ రాసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విదేశీ విద్యార్థుల వీసా గడువును ముగించేసి వాళ్లను బలవంతంగా దేశబహిష్కరణ చేస్తున్న వేళ తాజాగా ఈ ఘటన జరగడం గమనార్హం. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న విదేశీ విద్యార్థులను గుర్తించి గెంటేస్తున్న ఉదంతాలు ఇప్పుడు అమెరికాలో ఎక్కువయ్యాయి. -
విమానంలో అనుకోని అతిధి, బెంబేలెత్తిన ప్రయాణీకులు
న్యూజెర్సీ:అంతర్జాతీయ విమాన సర్వీసులో, అదీ బిజినెస్ క్లాస్‌లో అనుకోని అతిధి ప్రయాణీకులను బెంబేలెత్తించింది ఫ్లోరిడాలోని టంపా నగరం న్యూజెర్సీకి బయలు దేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 2038 విమానంలో పాము దర్శనిమిచ్చింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. అయితే సిబ్బంది దాన్ని పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. అందరూ సురక్షితంగా ఉన్నారనీ న్యూయార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ టైమ్స్ కథనం ప్రకారం బిజినెస్ క్లాస్‌లో విమానం ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులు పామును గుర్తించారు. దీంతో ప్రయాణీకులు కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమై వైల్డ్‌లైఫ్ ఆపరేషన్స్ సిబ్బంది, పోర్ట్ అథారిటీ పోలీస్ అధికారుల సహకారంతో "గార్టెర్ స్నేక్"ని పట్టుకుని తర్వాత దానిని అడవిలోకి విడిచిపెట్టారు. అయితే అది సాధారణ గార్టెర్ రకం పాము విషపూరితమైంది కాదనీ, తమ కేదైనా హానీ జరిగితే తప్ప కాటువేయమని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీని ఉటంకిస్తూ ది వాషింగ్టన్ టైమ్స్ తెలిపింది. అంతకుముందు, ఫిబ్రవరిలో, మలేషియాలోని ఎయిర్ ఏషియా విమానంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. విమానం గాలిలో ఉండగానే విమానంలోపాము కనిపించిన ఘటన ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. -
ఎయిరిండియా విమానం ఇంజన్లో మంటలు
అమెరికాలోని నెవార్క్లో ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెద్ద ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా ఏఐ777 విమానం ల్యాండ్ అవుతుండగా మూడు టైర్లు పేలిపోయాయి. ఆ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులున్నారు. వాస్తవానికి ఎడమవైపు ఇంజన్లో మంటలు చెలరేగి అది షట్‌డౌన్ కావడంతో విమానాన్ని అత్యవసరంగా దింపుతున్న సమయంలోనే ఈ టైర్లు కూడా పేలినట్లు తెలుస్తోంది. అయితే.. అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బందికి గానీ, ప్రయాణికులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదు. తొలుత ఏదో పక్షి ఢీకొనడం వల్లే ఇంజన్లో మంటలు చెలరేగి ఉంటాయని భావించారు గానీ.. తర్వాత మాత్రం అందుకు కారణం అది కాదని చెప్పారు. ముంబై నుంచి బయల్దేరి న్యూజెర్సీ వెళ్లాల్సిన ఈ విమానాన్ని బలవంతంగా నెవార్క్ విమానాశ్రయంలో దించాల్సి వచ్చింది. ఎడమవైపు ఇంజన్లో మంటలు చెలరేగిన విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించారు. దాంతో ఇంజన్‌ను షట్ డౌన్ చేసేశారు. విమానాన్ని జాగ్రత్తగా దించేందుకు పైలట్ ప్రయత్నించినా, మూడు టైర్లు ఒకేసారి పేలిపోవడంతో బలవంతంగా ఫోర్స్ లాండింగ్ చేయాల్సి వచ్చింది.