breaking news
new video
-
సమంత లేటెస్ట్ వీడియో.. వావ్ అనిపించేలా
-
సమంత లేటెస్ట్ వీడియో.. వావ్ అనిపించేలా
స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. కొంచెం ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో కలిసి టూర్లు ప్లాన్ చేస్తూ అస్సలు టైం వేస్ట్ చేయదు. సినిమాలు, టూర్లు కాకుండా తన ఫిట్‌నెస్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త కొత్త ఫిట్నెస్ వర్కవుట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్న తన వ్యాయామ దినచర్యను మాత్రం ఎప్పుడూ వాయిదా వేసుకోదు. అందుకే ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది సామ్. తాజాగా తాను చేసిన కొత్త వర్కవుట్ వీడియోను శుక్రవారం ఇన్‌స్టా స్టోరీ ద్వారా షేర్ చేసింది. ఇదీ చదవండి: అందుకే విడిపోయాం.. విడాకులపై చై ఆసక్తికర వ్యాఖ్యలు సామ్ మొదటగా 75 కిలోల బరువును ఎత్తుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై 'హలో 75.. నేను నిన్ను మిస్ చేశాను' అని రాసుకొచ్చింది. దాని తర్వాత సమంత 78 కిలోలు, అనంతరం 80 కిలోల బరువులను ఎత్తుతున్న వీడియోలను షేర్ చేసింది. 78 కిలోల బరువు ఎత్తుతున్న వీడియోకు 'హాహాహా.. నేను రోజూ త్వరగానే మేల్కొంటాను. నిన్ను నిరాశపరచాలని నాకు లేదు' అని క్యాప్షన్ రాసి నవ్వుతున్న ఎమోజీస్ను యాడ్ చేసింది సమంత. ఈ క్యాప్షన్‌ను తన జిమ్ కోచ్ అయిన 'జునాయిడ్ షేక్' గురించి రాస్తూ అతన్ని ట్యాగ్ చేసింది. ఇదిలా ఉంటే సామ్ త్వరలో డైరెక్టర్ ఫిలిప్ జాన్‌తో కలిసి 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే సినిమా చేయనుంది. ఇందులో సామ్ తన సొంత డిటెక్టివ్ ఏజెన్సీని నడిపే ద్విలింగ సంపర్కురాలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: నాగ చైతన్య, సమంత విడాకులు.. డైరెక్టర్‌కు తెచ్చిన కష్టాలు -
‘పాక్‌తో లింక్ పెడుతున్నారు.. తేజ్ తాజా వీడియో’
న్యూఢిల్లీ: తమకు సరైన ఆహారం పెట్టడం లేదని, సరిహద్దులో సైన్యం పరిస్థితి దారుణంగా ఉందని వీడియో సందేశంలో పెట్టి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ మరో కలకలం సృష్టించాడు. తాజాగా మరో వీడియోను విడుదల చేశాడు. అయితే, గతంలో ఫిర్యాదు చేసిన ఆయన ఈసారి పిటిషన్ రూపంగా ఆ వీడియో సందేశం పంపించాడు. స్వరాజ్ సమాచార్ అనే ఫేస్బుక్ పేజీలో తేజ్ బహదూర్ తాజా వీడియోను పబ్లిష్ చేశాడు. తన మొబైల్ ఫోన్‌ను పై అధికారులు స్వాధీనం చేసుకున్నారని, పగులగొట్టారని, మానసికంగా హింసిస్తున్నారని తాజా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను నా ఫోన్‌ను తప్పుగా ఉపయోగించానని చెబుతున్నారని నాకు తెలిసింది. నేను ప్రధాని దృష్టికి ఆహార సమస్యను, నాణ్యత విషయాన్ని తీసుకెళ్లాలనుకున్న మాట వాస్తవం. అది నిజమైన సమస్య. అందుకు ఇప్పుడు నన్ను మానసికంగా హింసిస్తున్నారు. దేశంలో అవినీతి అంతం చేయాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. నేను నా శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టాలని అనుకుంటున్నాను. నా ఫోన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారు. తనకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని నిరూపించేందుకు ఫోన్లో ఏవో అంశాలు జోడిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. వాస్తవానికి ఈ వీడియో ఫిబ్రవరి మూడో వారంలో రికార్డు చేసి ఉంటారని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. అందులో ఉన్నది తేజ్ బహదూరేనని, అతడి వద్దకు భార్య వెళ్లినప్పుడు ఈ వీడియో రికార్డు చేసి ఉండొచ్చని, విచారణ కోసం గతంలో అతడి వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకున్నట్లు తెలిపారు. అతడి ఫేస్బుక్ పేజీలో కొంతమంది పాకిస్థాన్ స్నేహితులు ఉన్నట్లు గుర్తించామని, వారి ప్రభావం అతడిపైన పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. సంబంధిత మరిన్ని వార్తలకై చదవండి కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య ‘తేజ్‌ను అరెస్టు చేయలేదు.. వేరే చోట ఉన్నాడు’ బీఎస్ఎఫ్ జవాను ఫేస్బుక్ ఖాతాపై నిఘా ఆ జవాను ఫేస్బుక్ అకౌంట్లో 500 మంది పాకిస్తానీలు -
ఐసిస్ తదుపరి టార్గెట్ అమెరికా..?