breaking news
new serial
-
"నువ్వు నేను ప్రేమ" అంటున్న స్టార్ మా!
ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు ఇష్టపడే ఛాన్స్ లేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్ మా సరికొత్త సీరియల్ కథ. అదే "నువ్వు నేను ప్రేమ". ఇద్దరి మధ్య శత్రుత్వం సంధించే చాలా కష్టమైన ప్రశ్నలకు అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది ఈ సీరియల్ "నువ్వు నేను ప్రేమ". జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా ఈ సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది. స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది. (అడ్వర్టోరియల్) "నువ్వు నేను ప్రేమ" ప్రోమో👇 -
టీవీక్షణం: అందం+ఆత్మవిశ్వాసం = దామిని!
ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారంటే అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అతిథుల సంగతేమోగానీ, ఏదైనా కొత్త సీరియల్ ప్రారంభమవుతోందంటే దానికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏ టైముకి వస్తుంది, ఎలా ఉంటుంది అంటూ మొదట ఆసక్తి. సీరియల్ కానీ నచ్చిందంటే... తర్వాత ఏమవుతుంది, కథ ఏ మలుపులు తిరుగుతుంది అంటూ ఉత్కంఠ. ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టే... ప్రతి చానెల్ అడపా దడపా ఏదో ఒక కొత్త సీరియల్ మొదలుపెడుతూనే ఉంటోంది. అలా ఇటీవలే ప్రారంభమైన సీరియల్... దామిని. అచ్చమైన ఆధునిక యువతి దామిని. ఆకట్టుకునే అందం, ఎవరినైనా ఎదిరించగల ఆత్మవిశ్వాసం, ఎంతటి పోరాటానికైనా వెరవని దృఢత్వం ఆమె సొంతం. అదే ఆమెకు ఓ యువకుడితో గొడవ తెచ్చిపెడుతుంది. అతడి అహంకారానికి, ఆమె ఆత్మవిశ్వాసానికి మధ్య పోరాటం మొదలవుతుంది. ఆ తరువాత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఊపిరాడనివ్వకుండా చేస్తోందీ ధారావాహిక. దామిని పాత్రలో ఒదిగిపోయిన ప్రీతి అభినయం, శ్రీరామ్ లాంటి ఫేమస్ హీరో నెగిటివ్ రోల్ చేయడం, చాలాకాలం తరువాత సీనియర్ నటి యమున ఓ వైవిధ్యభరితమైన పాత్ర పోషించడం వంటి వాటితో పాటు... బలమైన కథ, అందమైన స్క్రీన్ప్లే ఈ సీరియల్కు ప్లస్ పాయింట్స్. అయితే ఆదిలో ఉన్న పటుత్వం రోజులు గడిచేకొద్దీ సన్నగిల్లడం కొన్ని సీరియళ్లలో కనిపిస్తోంది. దామిని అలా కాదనే అనుకుందాం. ముందు ముందు దామిని జీవితం ఏ మలుపులు తిరుగుతుందో, తెలుగు ప్రేక్షకులను ఇంకెంత కట్టిపడేస్తుందో చూద్దాం!