breaking news
New Secretary-General
-
ఆలయానికి కొత్తగా సీఈఓ
అయోధ్య: రామమందిర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన బీజేపీ, సంఘ్ పరివార్లు అయోధ్య రామమందిరంలో కోట్ల రూపాయల చందా చోరీ ఉదంతంతో మసకబారిన ఆలయ ప్రతిష్ట పునరుద్ధరించేందుకు నడుంబిగించాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా కొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పదవిని ఏర్పాటుచేయాలని సోమవారం జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక భేటీలో నిర్ణయించారు. సీఈఓ పదవికి అర్హతలున్న వ్యక్తి ఎంపిక బాధ్యతలను ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పగించారు.ఈ కమిటీలోకి సభ్యులుగా విశ్రాంత న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, ట్రస్టీ సురేశ్ హవారేలను తీసుకున్నారు. లక్షలాది మంది భక్తులు సమరి్పంచిన నగదు, స్వర్ణాభరణ కానుకలను కాజేసిన ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామాచేస్తూ చంపత్ రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం ఆలయ కాంప్లెక్స్‌లోని గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం మూడుగంటలపాటు జరిగిన భేటీలో ట్రస్ట్ సభ్యులు ఆమోదించారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామానూ ఆమోదించారు. ప్రస్తుతం ట్రస్టీగా ఉన్న కృష్ణమోహన్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకు న్నారు. ఎవరైనా వచ్చి సరిచూసుకోవచ్చు: కృష్ణమోహన్ భేటీ తర్వాత తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడారు. ‘‘రామమందిరానికి భారీ స్థాయిలో బంగారం, వెండి, ఇతరత్రా అత్యంత విలువైన ఆభరణాలు, వస్తుసామగ్రిని ఇచ్చిన దాతలు తామిచ్చిన విరాళాలు ఉన్నాయో లేదో సరిచూసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. నగదుకాని 2,926 కానుకల సంబంధ రికార్డులు, డాక్యుమెంట్లను బహిరంగంచేస్తాం. ఎవరైనా వచ్చి వాటిని సరిచూసుకోవచ్చు. చోరీకి పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా చేస్తాం. చోరీ ఘటనతో ఆలయంపై ఆరోపణల మచ్చ పడింది.ఇలాంటివి పునరావృతంకాకుండా, మళ్లీ ప్రజల విశ్వాసం చూరగొనేలా ట్రస్ట్ సభ్యులంతా ఎంతో పారదర్శకంగా పనిచేస్తారు. ఆలయాన్ని మరింత సమర్థవంతంగా, ఆదర్శప్రాయంగా నిర్వహించేందుకు, నిపుణుల నుంచి సలహాలు తీసుకోబోతున్నాం’’అని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్ అన్నారు.శతాబ్దాలపోరాట ఫలితంగా సాకారమైన ఆలయంలో కొంతకాలంగా హుండీల నుంచి విరాళాలు చోరీ అవుతున్నాయన్న విషయం తెలియగానే ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఎంతో కలతచెందారని, ఇది నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి అని ట్రస్ట్ కోశాధికారి గోవింద్‌దేవ్ గిరి వ్యాఖ్యానించారు. ఈనెల 22వ తేదీన ట్రస్ట్ మరోసారి సమావేశంకానుంది. సోమవారంనాటి భేటీలో ట్రస్ట్ చైర్మన్ నృత్యగోపాల్ దాస్సహా ఏడుగురు శాశ్వత సభ్యులు హాజరయ్యారు. సాయంత్రం ఆరున్నరదాకా భేటీ కొనసాగింది. -
అయోధ్య రాముడి విరాళాల స్కాం వేళ కీలక పరిణామం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించింది. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. రామ మందిర్ ట్రస్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 22న మరోసారి సమావేశం కానుంది ట్రస్ట్. సిట్ నివేదికను పరిశీలించనుంది. నిందితులను త్వరగా పట్టుకుని, శిక్షించాలని ట్రస్ట్ కోరింది.ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి గోవిందు గిరి మాట్లాడుతూ.. రామ మందిర్‌పై ఈ ఘటనను ఆధారం చేసుకుని అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారు. చంపత్రాయ సేవలను అభినందిస్తున్నామని చెప్పారు. దోషులను పట్టుకునే వరకు తాను ట్రస్టులో కొనసాగలేనని చంపత్‌రాయ్ వెల్లడించారని తెలిపారు. అయోధ్యను కించపరిచేలా ఉండే ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. మొదట, విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజ్రంగ్ బగ్రాను కొత్త సెక్రటరీగా నియమిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్‌ను నియమించారు.రాజీనామా చేసిన మరో ట్రస్ట్ ప్రతినిధి అనిల్ మిశ్రా రాజీనామా కూడా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా సిట్ దర్యాప్తుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ట్రస్ట్.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ట్రస్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న డిస్టిక్ మేజిస్ట్రేట్‌కు మరిన్ని అధికారాలను అప్పగించేందుకు ట్రస్ట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటుఇదీ చదవండి: ఆమీర్ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం -
కొత్త సెక్రటరీ జనరల్ కోసం ఐరాస రహస్య ఓటింగ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో.. సమితి భద్రతా మండలి బుధవారం తొలి రహస్య ఓటింగ్ నిర్వహించింది. ఈ పోలింగ్‌లో పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్ ఆధిక్యంలో ఉండగా.. స్లొవేనియా మాజీ అధ్యక్షుడు డానిలో టర్క్ రెండో స్థానంలో నిలిచారని సమితి దౌత్యవేత్తలు తెలిపారు. భద్రతామండలి సభ్యులు 15 మంది రహస్యంగా నిర్వహించిన పోలింగ్‌లో ‘ప్రోత్సహించటం, తిరస్కరించటం, మౌనం’ అనే మూడు అంశాల వారీగా అభ్యర్థులకు ఓట్లు వేయగా.. ఆంటోనియోకు 12, డానిలోకు 11 ప్రోత్సాహం ఓట్లు వచ్చాయని దౌత్యవేత్తలు వివరించారు. ఒక అభ్యర్థిని తిరస్కరిస్తూ 11 ఓట్లు వచ్చినట్లు చెప్పారు. మండలి సభ్యులు మళ్లీ వచ్చే వారం సమావేశమై మరో విడత పోలింగ్ నిర్వహించే అవకాశముంది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగియనుంది.


