breaking news
New partner
-
చిప్ ప్లాంటుకు భాగస్వామి సిద్ధం..
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటు కోసం భాగస్వామిని సిద్ధం చేసుకున్నట్లు వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాదే చిప్‌ల తయారీని ప్రారంభించనున్నట్లు కంపెనీ 58వ షేర్‌హోల్డర్ల సమావేశంలో వివరించారు. అయితే, భాగస్వామి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు. రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంటు నెలకొల్పేందుకు వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ అనుబంధ సంస్థ ఎవాన్్రస్టేట్.. గ్లాస్ సబ్్రస్టేట్స్ తయా రీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని, సొంత పేటెంట్లు కూడా ఉన్నాయని అగర్వాల్ చెప్పారు. మరోవైపు, భారత్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడాన్ని వేదాంత కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 35 బిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 2.9 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. కార్యకలాపాల విస్తరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 14,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. -
న్యూ బాయ్‌ఫ్రెండ్!
బబ్లీ బ్యూటీ సోనాక్షి సిన్హా కొత్త పార్ట్నర్ను వెతుక్కున్నట్టుంది. బాయ్‌ఫ్రెండ్ అర్జున్‌కపూర్‌తో డేటింగ్ చేస్తున్న ఈ అమ్మడు... రీసెంట్గా హీరో షాహిద్ కపూర్‌తో యమ క్లోజ్‌గా మూవ్ అవుతోందట. షూటింగ్ సమయంలోనే కాదు... ఖాళీ దొరికినప్పుడల్లా పక్కకు పోయి తెగు ముచ్చట్లాడుకుంటున్నారట. ఆ తరువాత ‘కాఫీ విత్ కరణ్ జోహార్’లో ఇరువురూ ఎంతో ఇంటిమసీతో మాట్లాడిన తీరు ఈ రూమర్లకు బలాన్నిచ్చిందన్నది ఓ వెబ్సైట్ కథనం. అంతేకాదు... తారలిద్దరూ చేతిలో చెయ్యేసుకుని ఓ ఈవెంట్‌కు జంటగా అటెండయ్యారట! ఊఫ్... ఇక చాయిస్ మీదే! రూమర్లంటారో... డేటింగ్ అంటారో!