breaking news
Nevy
-
రాడార్ స్టేషన్‌పై అపోహలొద్దు : రాజ్‌నాథ్ సింగ్
సాక్షి,దామగుండం : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవిలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్ (వీఎల్ఎఫ్) ఏర్పాటుపై అపోహలు వద్దని అన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. మంగళవారం (అక్టోబర్ 15) రాజ్ నాథ్ సింగ్ నేవీ రాడర్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు.. దేశ భద్రతవేరు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అపోహపడుతున్నారు. పర్యావరణ సంరక్షణలో కేంద్రం దృఢనిశ్చయంతో ఉంది. స్థానికులపై ప్రభావం పడుతుందంటే పునరావాసం’ కల్పిస్తామని హామీ ఇచ్చారు.స్థానికులపై వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్)నుంచి ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. స్థానికుల ఆర్థిక ప్రగతికి వీఎల్ఎఫ్ దోహదపడుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయిని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. -
పదో తరగతితో కేంద్ర ప్రభుత్వోద్యోగం
-
పదో తరగతితో కేంద్ర ప్రభుత్వోద్యోగం
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ).. సెక్యూరిటీ అసిస్టెంట్ల (మోటర్ ట్రాన్స్పోర్ట్) నియామకానికి ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అందుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలు.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 209 పోస్టులు ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 209 (ఓపెన్ కేటగిరీ-106, ఓబీసీ-45, ఎస్సీ-30, ఎస్టీ-28). దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల వారీగా పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్‌లో 4 (ఓపెన్-2, ఓబీసీ-1, ఎస్సీ-1), విజయవాడలో 4 (ఓపెన్-2, ఓబీసీ-1, ఎస్సీ-1) పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీలో 45 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను జనరల్ సెంట్రల్ సర్వీస్‌లోని గ్రూప్-సీ (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) కేటగిరీగా పేర్కొన్నారు. వేతనం: రూ.5,200-20,200 ప్లస్ గ్రేడ్ పే రూ.2000 (పీబీ-1). వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇతర అలవెన్సులు. విద్యార్హత-పరిజ్ఞానం: పదో తరగతి/తత్సమానం. మోటర్ మెకానిజం తెలిసుండాలి. వాహనంలో తలెత్తే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించగలగాలి. అనుభవం: లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్ తీసుకున్న తేదీ నుంచి కనీసం ఏడాది పాటు కారు నడిపిన అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. గమనిక: వయసు, విద్యార్హతలు, డ్రైవింగ్ లెసైన్స్, అనుభవం తదితరాలకు కటాఫ్ తేదీగా 2016 ఆగస్టు 6ను పరిగణనలోకి తీసుకుంటారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విధులను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: 100 మార్కులకు నిర్వహించే స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 50 మార్కులను డ్రైవింగ్ టెస్ట్‌కు, 50 మార్కులను మోటర్ మెకానిజం టెస్ట్‌కు కేటాయించారు. డ్రైవింగ్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు ఇన్స్ట్రక్టర్ సూచనల మేరకు వాహనం నడపాలి. మోటర్ మెకానిజం టెస్ట్‌లో భాగంగా వాహనం నిర్వహణ, అందులో తలెత్తే తేలికపాటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైనవారికి క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ (ప్రవర్తన, పూర్వాపరాల తనిఖీ), వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 6, 2016 పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.50 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇచ్చారు. చివరి తేదీ (ఆగస్టు 6)న అప్లై చేసేవాళ్లు 8, 9 తేదీల్లో కూడా ఎగ్జామ్ ఫీజు చెల్లించొచ్చు. వెబ్సైట్: దరఖాస్తు చేసుకునేందుకు, వివరాలకు http://mha.nic.in/vacanciesను చూడొచ్చు. .................................... నేవీలో 262 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నియామకానికి భారత నావికా దళం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి విద్యార్హతతోనే ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు బాటలు వేసే ఈ కొలువులు ఉద్యోగార్థులకు సువర్ణావకాశం లాంటివి. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 262. ఇందులో ఎంటీఎస్ (మినిస్టీరియల్)-246, ఎంటీఎస్ (నాన్ ఇండస్ట్రియల్)-16. కేటగిరీల వారీగా చూస్తే.. 1. ఎంటీఎస్ (మినిస్టీరియల్) మొత్తం పోస్టుల్లో ఎక్స్సర్వీస్మెన్లకు 25, అంధులకు 5, బధిరులకు 7, క్రీడాకారులకు 12 పోస్టులను రిజర్వ్ చేశారు. 2. ఎంటీఎస్ (నాన్-ఇండస్ట్రియల్) మొత్తం పోస్టుల్లో ఎక్స్సర్వీస్మెన్లకు 2, క్రీడాకారులకు 1 పోస్టును రిజర్వ్ చేశారు. వేతనం: రూ.5,200-20,200 ప్లస్ గ్రేడ్ పే రూ.1800 విద్యార్హత: మినిస్టీరియల్ పోస్టులకు పదో తరగతి/తత్సమాన విద్యార్హత, నాన్ ఇండస్ట్రియల్ పోస్టులకు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లలో నైపుణ్యం ఉండాలి. వయసు: మినిస్టీరియల్ పోస్టులకు 18-27 ఏళ్లు. నాన్ ఇండస్ట్రియల్ పోస్టులకు 18-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలు, ప్రభుత్వోద్యోగులు, డిపార్ట్మెంట్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విధులు: మినిస్టీరియల్ సిబ్బంది కింది విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అవి.. 1. సంబంధిత సెక్షన్లు/యూనిట్లలో రికార్డుల నిర్వహణ 2. సెక్షన్లు/యూనిట్లలో పరిశుభ్రత 3. కార్యాలయ భవనాల్లో ఫైల్స్, ఇతర పత్రాల బట్వాడా 4. డాక్యుమెంట్లను జిరాక్స్ తీయడం, ఫ్యాక్స్ చేయడం 5. సెక్షన్లు/యూనిట్లలో ఇతర నాన్ క్లరికల్ పనులు 6. ఉత్తరాల బట్వాడా 7. పహారా, రక్షణ 8. ప్రారంభ, ముగింపు విధులు (ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్) 9. రూమ్‌లు, వాష్ రూమ్‌ల క్లీనింగ్ 10. కార్యాలయ సామగ్రి దుమ్ము దులపడం 11. సంబంధిత పోస్టుకు తగిన పనులు 12. పైఅధికారులు చెప్పే ఇతర పనులు నాన్ ఇండస్ట్రియల్ సిబ్బంది కూడా సంబంధిత పోస్టులకు తగిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపిక విధానం: దరఖాస్తులు భారీగా వస్తే అందరికీ రాత పరీక్ష నిర్వహించడం కష్టంతో కూడిన పని. అందువల్ల పదో తరగతి మార్కుల ఆధారంగా సముచిత సంఖ్యలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష విధానం: అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఇస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సబ్జెక్టుల వారీగా ప్రశ్నల సంఖ్యను పరిశీలిస్తే.. పరీక్ష తేదీ: రాత పరీక్షను 2016 సెప్టెంబర్ 25న (లేదా) అక్టోబర్ 1న నిర్వహించే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలను అడ్మిట్ కార్డ్పైన, నేవీ వెబ్సైట్లో కొద్ది రోజుల తర్వాత పొందుపరుస్తారు. తుది ఎంపిక: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయినవారికి సర్టిఫికెట్ల తనిఖీ, వైద్య పరీక్షలు నిర్వహించి, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి, సెల్ఫ్ అటెస్ట్ చేసిన ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి రిజిస్టర్ పోస్ట్‌లో/స్పీడ్ పోస్ట్‌లో పంపాలి. దరఖాస్తు ఉన్న ఎన్వలప్ కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మినిస్టీరియల్/ నాన్ ఇండస్ట్రియల్) ‘‘...........’’, కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ యూఆర్/ఈఎస్ఎం/ పీడబ్ల్యూడీ) ‘‘......’’ రాయాలి. చిరునామా: ది ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ((ఫర్ స్టాఫ్ ఆఫీసర్(సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్)), హెడ్ క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్, కొచ్చి, 682004. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 5 వెబ్సైట్: దరఖాస్తులు, వివరాలకు www.indiannavy.nic.in/content/civilian చూడొచ్చు. ........................... హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 171 అప్రెంటీస్ పోస్టులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ తన పరిధిలోని వివిధ ప్లాంట్లలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 171 కాగా ఇందులో 101 పోస్టులు రాజస్థాన్‌లోని ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌కు, 42 పోస్టులు జార్ఖండ్‌లోని ఘట్సిలా ప్రాంతంలో గల ఇండియన్ కాపర్ కాంప్లెక్స్‌కు, 28 పోస్టులు గుజరాత్ కాపర్ ప్రాజెక్టుకు సంబంధించినవి. ప్లాంట్లు, ట్రేడ్లు, కేటగిరీల వారీగా వేకెన్సీలు.. 1. ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ ఇందులో బ్లాస్టర్(మైన్స్) ట్రేడ్ శిక్షణ కాల వ్యవధి రెండేళ్లు, మేట్(మైన్స్) ట్రేడ్‌కు మూడేళ్లు, మిగిలిన అన్నిటికి ఏడాది. 2. ఘట్సిలాలోని ఇండియన్ కాపర్ కాంప్లెక్స్ ఈ ట్రేడ్లు అన్నిటికీ శిక్షణ కాల వ్యవధి ఏడాది 3. గుజరాత్ కాపర్ ప్లాంట్ ఇందులో ప్లంబర్ ట్రేడ్ శిక్షణ కాల వ్యవధి రెండేళ్లు. మిగిలినవాటికి ఏడాది. విద్యార్హతలు 1.ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు మెట్రిక్/సెకండరీ/టెన్త్ (10+2 సిస్టమ్) పాస్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. 2014కు ముందు ఐటీఐ పాసైనవారు ఈ మధ్య కాలంలో ఏ సంస్థలోనూ అప్రెంటీస్ చేయలేదని/ఎక్కడా ఉద్యోగంలో చేరలేదని ప్రమాణపత్రాన్ని దాఖలు చేయాలి. బ్లాస్టర్ (మైన్స్), మేట్ (మైన్స్) ట్రేడ్లకు ఐటీఐ, ప్రమాణపత్రాలు అవసరంలేదు. 2.ఘట్సిలా కాంప్లెక్స్‌లోని పోస్టులకు హైస్కూల్/తత్సమాన విద్యార్హతతోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం). 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టుల్లో వెల్డర్, వైర్‌మ్యాన్ ట్రేడ్లకు 8వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లకు సైన్స్, మ్యాథమెటిక్స్‌లతో టెన్త్ (10+2 సిస్టమ్) పాస్ లేదా తత్సమానం. దీంతోపాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత. ప్లంబర్ ట్రేడ్‌కు టెన్త్ పాస్/ఫెయిల్తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు 1.ఖేత్రి కాంప్లెక్స్‌లోని పోస్టుల విషయంలో వయో పరిమితి, విద్యార్హతలకు 2016 జూలై 20వ తేదీని కటాఫ్ డేట్‌గా పరిగణిస్తారు. 2.ఘట్సిలా కాంప్లెక్స్‌లో పోస్టులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 42 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. అర్హతల పరిశీలనకు 2016 ఆగస్టు 31ని కటాఫ్ డేట్‌గా పరిగణిస్తారు. 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు 2016 జూలై 1 నాటికి 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. స్టైపెండ్ 1.ఘట్సిలా కాంప్లెక్స్‌లోని పోస్టులకు మొదటి ఏడాది రూ.4004; రెండో ఏడాది రూ.4576; మూడు, నాలుగో ఏడాది రూ.5148 ఉపకారవేతనం ఇస్తారు. ఖేత్రి కాంప్లెక్స్, గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు నిబంధనల మేరకు స్టైపెండ్ ఇస్తారు. ఎంపిక విధానం 1.ఖేత్రి కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తే అందరినీ రాత పరీక్షకు ఎంపిక చేయరు. సాధారణ/సాంకేతిక విద్యలో పొందిన మార్కుల ఆధారంగా కొందరినే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఎంపికైన అభ్యర్థుల ఫిజికల్ ఫిట్నెస్ను పరిశీలిస్తారు. 2.ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్, గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు కూడా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీలు 1.ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 11 2.ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25 3.గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు రాత పరీక్ష తేదీని పేర్కొనలేదు. దరఖాస్తు విధానం 1.ఆయా ప్లాంట్లలోని పోస్టులకు నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన అర్హతల ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి ఆయా సంస్థల అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్/రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. దరఖాస్తులకు చివరి తేదీలు 1. ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు: ఆగస్టు 16. 2. ఘట్సిలా కాపర్ కాంప్లెక్స్‌లోని పోస్టులకు: సెప్టెంబర్ 10. 3. గుజరాత్ కాపర్ ప్రాజెక్టులోని పోస్టులకు: ఆగస్టు 13. వెబ్సైట్: www.hindustancopper.com ......................... జిప్మర్లో 82 నర్సు పోస్టులు జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 92. వాటిలో సింహ భాగం (82 పోస్టులు) స్టాఫ్ నర్సులు కాగా మరో మూడు రకాల జాబ్‌లు (10 పోస్టులు) ఉన్నాయి. వాటిని కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. వేతనం: అన్ని పోస్టులకూ రూ.9300-34,800 ప్లస్ గ్రేడ్ పే రూ.4,200. స్టాఫ్ నర్సు పోస్టులకు మాత్రం గ్రేడ్ పే రూ.400 అదనం. అంటే మొత్తం గ్రేడ్ పే రూ.4,600. విద్యార్హత: 1.స్టాఫ్ నర్సుకు జీఎన్ఎంలో డిగ్రీ/డిప్లొమా/తత్సమాన అర్హతతోపాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సు అండ్ మిడ్ వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. 2.ఎక్స్‌రే టెక్నీషియన్(ఆర్డీ)కి ఇంటర్/సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన విద్యార్హత. దీంతోపాటు బీఎస్సీ(మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ). రేడియో డయాగ్నోసిస్(ఆర్డీ) /రేడియోథెరపీలో రెండేళ్ల అనుభవం (లేదా) రేడియోలజీలో రెండేళ్ల డిప్లొమా/ తత్సమానంతోపాటు ఆర్డీ/రేడియోథెరపీలో మూడేళ్ల అనుభవం. 3.ఎక్స్‌రే టెక్నీషియన్(ఆర్టీ)కి ఇంటర్/సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన విద్యార్హత. దీంతోపాటు బీఎస్సీ(ఆర్టీ: రేడియోథెరపీ)/బీఎస్సీ ఇన్ మెడికల్ టెక్నాలజీ(ఆర్టీ)/ బీఎస్సీ(మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ)తోపాటు ఆర్టీలో రెండేళ్ల అనుభవం (లేదా) రేడియోథెరపీ టెక్నాలజీలో రెండేళ్ల పీజీ డిప్లొమా/డిప్లొమాతోపాటు ఆర్టీలో మూడేళ్ల అనుభవం. 4.ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్‌తోపాటు బీపీఈడీ, రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: అన్ని పోస్టులకూ 2016 ఆగస్టు 16 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల వారికి నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష రుసుం: ఓసీ, ఓబీసీలు రూ.500; ఎస్సీ/ఎస్టీలు రూ.250 చెల్లించాలి. పీడబ్ల్యూడీలకు మినహాయింపు ఉంది. ఫీజును ‘ది డెరైక్టర్, జిప్మర్’ పేరిట పుదుచ్చేరి (ఎస్బీఐ జిప్మర్ బ్రాంచ్)లో చెల్లుబాటు అయ్యేలా డీడీ తీయాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకునేవారు వేర్వేరు దరఖాస్తులు, డీడీలు పంపాలి. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనా దరఖాస్తును పూర్తి చేసి, విద్యార్హత ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను జత చేసి, ‘ది డెరైక్టర్, జిప్మర్, పుదుచ్చెరి, 605006’ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తును పంపే కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్....... (కోడ్ నంబర్.......)’ అని రాయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 2016 ఆగస్టు 16. వెబ్సైట్: దరఖాస్తులకు, వివరాలకు http://jipmer.edu.in/category/jobs/ను చూడొచ్చు. -
వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
మెంటాడ,నూస్లైన్: అక్కడి గుండెలన్నీ బరువెక్కాయి.... ముష్కరుల దొంగదెబ్బకు బలైన తమ ఊరి బిడ్డను చూసి ఆ గ్రామం తల్లడిల్లిపోయింది. ఆ వీర జవాన్‌కు తుది వీడ్కోలు పలికేందుకు కదిలివచ్చింది... నీవే మాకు ఆదర్శమంటూ నివాళులు అర్పించింది. జమ్మూ-కాశ్మీర్లో సాంబా ప్రాంతం వద్ద గురువారం ఉదయం ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన జవాన్ మీసాల శ్రీనివాసరావు మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన స్వగ్రామం మెంటాడకు తీసుకువచ్చారు. దీంతో ఊరంతా ఒక్కసారిగా గొల్లుమంది. కుటుంబాన్ని పోషిస్తావనుకుంటే ఇంతలోనే వెళ్లిపోయావా నాయినా అంటూ.. శ్రీనివాసరావు తల్లిదండ్రులు అప్పలనాయుడు, అక్కమ్మలు రోదిస్తుంటే స్థానికులు కంటతడి పెట్టారు. ఉద్యోగం వస్తే కష్టాలుండవని అనుకున్నాం.. కానీ మనిషే దక్కడని అనుకోలేదని వారు విలపిస్తుంటే అక్కడికి వచ్చిన అధికారులు, సైనిక సిబ్బంది, పోలీసుల గుండెలు బరువెక్కాయి. భర్త పోయిన దుఃఖంలో షాక్‌కు గురైన భార్య మాధవి .. శ్రీనివాసరావు మృతదేహంపై పడి రోదిస్తుంటే ఆమెను ఆపడం ఎవరి తరమూ కాలేదు. గ్రామస్తులు, బంధువులు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు మధ్య శ్రీనివాసరావు మృత దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో ఆర్మీ, నేవీ, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ సూచికంగా శ్రీనివాసరావు మృతదేహంపై జాతీయపతాకాన్ని కప్పారు. సంతాప సూచికంగా ఏఆర్ సిబ్బంది మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం మీ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవాలని తల్లిదండ్రులకు, బంధువులకు సూచించడంతో హిందూ సంప్రదాయం ప్రకారం దహనక్రియలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ పి.ఎ.శోభ, ఆర్డీఓ జి.రాజకుమారి, ఓఎస్డీ శ్రీనివాసురావు, విజయనగరం జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ వి.వి.రాజారావు, అదనపు డీఎస్పీ టి.మోహనరావు, మెంటాడ మండల ప్రత్యేకాధికారి మార్పు అమ్మాజీరావు, డిప్యూటీ తహశీల్దార్ పి.రామకృష్ణ, గంట్యాడ తహశీల్దార్ సిరిపురపు త్రినాథమ్మ, ఆండ్ర ఎస్ఐ బాబూరావు, మాజీ సైనికుడు దేవర ఈశ్వరరావు, గ్రామ సర్పంచ్ పాండ్రంకి కొండమ్మ, మాజీ సర్పంచ్‌లు రాయిపల్లి రవి, పాండ్రంకి సన్యాసిరావు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. త్రివిధ దళాల నివాళులు విశాఖపట్నం: అంతకు ముందు విశాఖ విమానాశ్రయంలో వీర జవాన్ మృతదేహానికి సైనిక సంప్రదాయాలతో నివాళులర్పించారు. త్రివిధ దళాధిపతులు పుష్పగుచ్ఛాలతో గౌరవ వందనం సమర్పించారు. ఆర్మీ, నేవీ, సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. సైనికులు, నేవీ జవాన్లు గాడ్ ఆఫ్ ఆనర్ చేసి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు అప్పలనాయుడు, అక్కమ్మ విమానాశ్రయానికిచేరుకున్నారు. విశాఖ సైనిక సంక్షేమాధికారి కెప్టెన్ సత్యప్రసాద్, విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దాండే, ఆర్డీవో రాజకుమారి, విశాఖ ఆర్డీవో వేణుగోపాల్, పోలీసు అధికారులు ఏడీసీపీ (క్రైమ్) వరదరాజు, ట్రాఫిక్ ఏసీపీ ఎల్.అర్జున్, నార్త్ ఏసీపీ పీ.ఎం.నాయుడు, ఎయిర్ పోర్టు సీఐ బాబ్జీ రావు, కంచరపాలెం ట్రాఫిక్ సీఐ శేషు తదితరులు పాల్గొన్నారు.