breaking news
Network18
-
సియట్, నెట్వర్క్18 లాభాలు డౌన్
టైర్ల తయారీ దిగ్గజం సియట్(Ceat) లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 46 శాతంపైగా క్షీణించి రూ. 97 కోట్లకు పరిమితమైంది. పెరిగిన ముడిసరుకుల వ్యయాలు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 181 కోట్లుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,963 కోట్ల నుంచి రూ. 3,300 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,739 కోట్ల నుంచి రూ. 3,176 కోట్లకు పెరిగాయి. ముడిసరుకుల వినియోగ వ్యయాలు రూ. 1,695 కోట్ల నుంచి రూ. 2,117 కోట్లకు ఎగశాయి. అన్ని విభాగాలలోనూ పటిష్ట ఆర్డర్ బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అర్నాబ్ బెనర్జీ పేర్కొన్నారు. స్థిరమైన డిమాండ్ కారణంగా ఆదాయంలో వృద్ధి కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు.ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలునెట్వర్క్18..ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18(Network18) మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో భారీ నష్టాలు చవిచూసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,400 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే అనుకోని పద్దులకు ముందు దాదాపు రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. అనుబంధ సంస్థల గుర్తింపురద్దుతో రూ. 1,426 కోట్ల నష్టం నమోదైనట్లు వెల్లడించింది. వీటిని ప్రొవిజనల్‌గా మదింపు చేసినట్లు తెలియజేసింది. స్టార్ ఇండియాతో అనుబంధ కంపెనీ వయాకామ్18 విలీనం కారణంగా గతేడాది(2023–24) ఫలితాలను పోల్చతగదని పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 1,361 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ఆదాయం రూ. 476 కోట్లను అధిగమించగా.. అనుకోని ఆర్జనతో రూ.3,432 కోట్ల లాభం ఆర్జించింది. -
ఈటీవీ వాటా కొనుగోలు పూర్తి: నెట్వర్క్ 18
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈటీవీకి చెందిన వివిధ చానల్స్‌లోని వాటాల కొనుగోలుకు సంబంధించి అధికారికంగా అన్ని అనుమతులు లభించినట్లు నెట్వర్క్18 గ్రూపు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. 2012లో ఈటీవి ప్రాంతీయ చానల్స్‌లో వాటాలను రూ.2,053 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వాటాల కొనుగోలు ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్లు నెట్వర్క్18 తాజాగా పేర్కొంది. తెలుగు కాకుండా వేరే భాషలకు చెందిన న్యూస్ చానల్స్‌లో 100%, అలాగే వేరే భాషలకు చెందిన వినోద చానల్స్‌లో 50% వాటాను నెట్వర్క్ 18 కొనుగోలు చేసింది. తెలుగు చానల్స్‌లో 24.5% వాటా నెట్వర్క్ 18 పరమయ్యింది. మార్గదర్శి వ్యవహారంతో చిక్కుల్లోపడ్డ రామోజీరావును ఆదుకోవటానికి షెల్ కంపెనీల ద్వారా రూ.2,600 కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈటీవీ గ్రూపులో పెట్ట డం తెలిసిందే. ఆ విషయాన్ని మూడేళ్లపాటు గోప్యంగా ఉంచాక, సాక్షి బయటపెట్టాక... కోర్టులో రిలయన్స్ అంగీకరించింది. రిలయన్స్‌కు ఆ డబ్బు చెల్లించకుండా రిలయన్స్‌తో జట్టుకట్టిన నెట్వర్క్-18కు ఈటీవీ తన చానెళ్లలో వాటాను విక్రయించింది.