breaking news
Neha Chowdhury
-
బిగ్‌బాస్-6 ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్లే.. నో ఛేంజ్
బుల్లితెరపై బిగ్‌బాస్-6 సందడి మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే హౌజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీజన్-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వినోదం పంచనున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ రియాల్టీ షో రేపు(ఆదివారం)నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే నెట్టింట బిగ్‌బాస్ సందడి షూరు అయ్యింది. ఈసారి షోలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీరిలో 20మంది పేర్లు బయటికి రాగా ఇదే ఫైనల్ లిస్ట్ అని లీకు వీరులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం..గీతూ రాయల్, ఆదిరెడ్డి, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, యాంకర్ నేహా చౌదరి, ఆర్జే సూర్య, కమెడియన్ చంటి,నటుడు బాలాదిత్య, షాన్ని, సింగర్ రేవంత్, నటి సుదీప(పింకీ), యాంకర్ ఆరోహీ రావ్, సీరియల్ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా(ఆర్జీవీ వీడియోతో పాపులర్), లేడీ కమెడియన్ ఫైమా, నటి వసంతి, అర్జున్, రాజశేఖర్, రియల్ కపుల్ రోహిత్, మరీనాలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కామనర్స్ కూడా ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. -
ఆదిరెడ్డి, అమర్దీప్.. బిగ్‌బాస్ 6లో ఇంకా ఎవరెవరంటే?
బిగ్‌బాస్ షో కోసం తెగ వెయిట్ చేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్‌బాస్ ఐదో సీజన్ తర్వాత నాన్‌స్టాప్ పేరుతో ఓటీటీలో బిగ్‌బాస్ ప్రారంభమైనా అది అందరికీ చేరువవలేదు. కేవలం హాట్‌స్టార్‌ను వీక్షించేవారు మాత్రమే దాన్ని చూసేందుకు వీలుండటంతో చాలావరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రియాలిటీ షోను మిస్సయ్యారు. అయితే వారి నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే షో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్ ఘనంగా లాంచ్ కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. కానీ కొందరు మాత్రం ఇంకా రావాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్, ఆర్జే సూర్య, యాంకర్ ఉదయభాను, అమర్దీప్, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్, సింగర్ రేవంత్, యాంకర్ అరోహి.. షోలో అడుగు పెట్టబోతున్నారట. గత సీజన్లో సిరి రాగా, ఈసారి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ వస్తుండటంతో అతడి మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక బుల్లితెర నటుడు అమర్దీప్ ఇటీవలే తన ప్రేయసి, సహనటి తేజస్వితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. మరి అతడు పెళ్లిని వాయిదా వేసుకుని వస్తాడా? లేదంటే త్వరగా పెళ్లి చేసేసుకుని బిగ్‌బాస్ షోకు రెడీ అవుతాడా? అన్నది చూడాలి! ప్రతి సీజన్లో ఓ కమెడియన్ ఉన్నట్లే ఈసారి కూడా ఓ హాస్యనటుడిని తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గీతూ రాయల్.. సోషల్ మీడియాలో కొటేషన్లు చెప్తూ బాగా ఫేమస్ అయింది. అలాగే బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చింది. ఆది రెడ్డి కూడా ఈ షోపై రివ్యూలు ఇచ్చిన వ్యక్తే. బిగ్‌బాస్ ఓటీటీలో షోపై రివ్యూలు ఇచ్చిన యాంకర్ శివను లోనికి పంపించారు. ఈలెక్కన ఈసారి వీరిద్దరినీ కూడా హౌస్‌లోకి పంపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అందరినీ మించి ఉదయభాను షోలో అడుగుపెడ్తే ఎలా ఉంటుందో చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి బిగ్‌బాస్‌కు వస్తుండటం కూడా చాలామంది ఆశ్చర్యపరుస్తోంది. మరి వీరిలో ఎవరు చివరిదాకా ఉంటారు? ఎవరు మొదట్లోనే హ్యాండ్ ఇస్తారు? ఇంకా ఎవరెవరు హౌస్‌లోకి రాబోతున్నారు? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే! చదవండి: ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించిన ఈ నటి గురించి తెలుసా? ఆర్ఆర్ఆర్లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే.. -
మేనుకు మేలు.. వెన్నుకు శక్తి..
సమస్థితిలో నిలబడాలి. కుడికాలు ముందుకి ఎడమ కాలు వెనుకకి (కాళ్ళ మధ్యలో 3 లేదా 4 అడుగుల దూరం) ఉంచాలి. కుడి మోకాలు ముందుకు వంచి ఎడమ కాలుని వెనుకకు బాగా స్ట్రెచ్ చేయాలి, నడుమును ట్విస్ట్ చేస్తూ ఛాతీని కుడివైపుకి తిప్పి, ఛాతీని తొడభాగానికి నొక్కుతూ ఎడమ ఆర్మ్పిట్ (చంకభాగం) కుడి మోకాలు మీదకు సపోర్టుగా ఉంచి వెనుకకు చూస్తూ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. కొంచెం సౌకర్యంగా ఉండటానికి ఎడమ మడమను పైకి లేపి పాదాన్ని, కాలి వేళ్ళను ముందు వైపుకి తిప్పవచ్చు. 3 లేదా 5 శ్వాసలు తరువాత తిరిగి వెనుకకు వచ్చి ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. నమస్కార ముద్రలో చేతులు ఉంచలేని వాళ్లు ఎడమ అరచేతిని పూర్తిగా నేలమీద ఉంచి కుడిచేతిని కుడి చెవికి ఆనించి ముందుకు స్ట్రెచ్ చేస్తూ కుడి అరచేతిని చూసే ప్రయత్నం చేయవచ్చు. అలా కూడా చేయడం సాధ్యం కానప్పుడు చేతులు లేని కుర్చీలో కుడి తొడ వెనుక భాగం సపోర్టుగా ఉంచి కూర్చుని, ఎడమకాలుని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ కుర్చి బ్యాక్ రెస్ట్‌ని రెండు చేతులతో పట్టుకుని నడమును కుడివైపుకి బాగా తిప్పుతూ కుడి భుజం మీదుగా వెనుకకు చూడాలి. ఉపయోగాలు: వెన్నెముక సంబంధిత సమస్యలను నివారించి వెన్నెముకను బలంగా చేస్తుంది. సీటు భాగం తగ్గుతుంది. నడుము బలంగా అవుతుంది. పొట్ట దగ్గ అవయవాలకు, కండరాలకు మంచి టోనింగ్ జరిగి జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధక సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది. 1 పార్శ్వోత్థానాసన సమస్థితిలో నిలబడాలి. కుడికాలు ముందుకి, ఎడమకాలు వెనకకు (రెండు కాళ్ళ మధ్య 3 లేదా 4 అడుగుల దూరం) ఉంచాలి. కుడిపాదం ముందుకు ఎడమపాదం పక్కకు చేతులు రెండూ వెనుక నమస్కార ముద్రలో ఉంచి శ్వాస తీసుకుంటూ తల పైకి ఎత్తి శ్వాస వదులుతూ ఉండాలి. తల, ఛాతీ భాగాలను ముందుకు వంచుతూ నుదురు లేదా గడ్డం మోకాలు దగ్గరికి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేచి, అదే విధంగా తిరిగి రెండో వైపు చేయాలి. చేతులు రెండు వెనుక నమస్కార ముద్రలో ఉంచలేని వాళ్ళు, చేతులు వెనుక కట్టుకొని చేయవచ్చు. లేదా చేతులు రెండు ముందుకు స్ట్రెచ్ చేస్తూ కుడిపాదానికి రెండువైపులా భూమికి దగ్గరగా తీసుకురావచ్చు. ఉపయోగాలు: పొట్టలోని జీర్ణావయవాలకు, షోల్డర్ బ్లేడ్స్, ట్రెపిజీయస్, డెల్టాయిడ్ కండరాలకి మంచి టోనింగ్ జరుగుతుంది. 2 పరివృత్త పార్శ్వ కోణాసన యోగావగాహన: మన ఆరోగ్యం మన జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. జీవనశైలికి సంబంధించిన అంశాలను 6 విధాలుగా చెప్పవచ్చు. 1. ఆహారం: ఊబకాయం, మధుమేహ వ్యాధులకు దారితీసే పిండి పదార్థాలను ఎక్కువ శాతం తీసుకోకుండా విటమిన్లు, ఖనిజ పదార్థాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం. 2. విహారం: ఎంచుకునే వ్యాయామం, చేసే యోగా సృష్టి క్రమ, శిక్షణ క్రమ, రక్షణ క్రమ పద్ధతులలో సరైన దానిని మన శరీర గుణాన్ని బట్టి వయస్సును బట్టి ఎంచుకుని సాధన చేయడం. 3. వ్యవహారం: అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహములతో కూడిన యమ, శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ తదితర నియమాలను పాటించుట. 4. విచారం: సెల్యూలార్ మెమొరీలో పాజిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్ నిరంతరం ప్రవహిస్తూ మెదడును ప్రభావితం చేస్తాయి కనుక పాజిటివ్ ఆలోచలను పెంచుకోవడానికి కావలసిన ధ్యాన పద్ధతిని అనుసరించడం. శ్వాస మీద చేసే ధ్యానము సమాధి స్థితికి దారి తీస్తుంది. సమాధి స్థితి వల్ల జన్మరాహిత్యం లేదు. 3 హనుమానాసన సముద్రాన్ని లంఘించినప్పటి హనుమంతుడి భంగిమలో ఈ ఆసనంలో రెండు కాళ్లను బాగా స్ట్రెచ్ చేస్తాం కాబట్టి దీనికి హనుమానాసనమని పేరు. కాళ్ళు రెండూ పూర్తిగా స్ట్రెచ్ చేసి ముందుగా మోకాలు మీద నిలబడి శ్వాస వదులుతూ చేతులు రెండూ నేల మీదకు తీసుకువచ్చి, ఎడమ కాలు కొంచెం కొంచెం ముందుకు, కుడి కాలు కొంచెం కొంచెం వెనుకకు జారుస్తూ రెండు కాళ్ళు ఒకదానికి ఒకటి సమాంతర రేఖలో వచ్చేటట్లుగా ఎడమపాదం వెనుకకు, కుడిపాదం ముందుకు స్ట్రెచ్ చేస్తూ చేతులను నమస్కార ముద్రలోకి తీసుకురావాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసలు తరువాత నెమ్మదిగా చేతులు రెండు క్రిందకి నేల మీదకు సపోర్టుగా పెట్టుకొని మోకాళ్ళ మీద నిలబడి శరీరాన్ని ప్రక్క నుండి వెనుకవైపుకు వ్యతిరేక దిశలోకి తిరిగి రెండోవైపు కూడా చేయాలి. ఫొటోలో చూపిన విధంగా చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు కాబట్టి, కాళ్ళ వెనుకభాగం పూర్తిగా భూమి మీద ఆనించకుండా మోకాళ్లు రెండు పైకి లేచి ఉన్నప్పటికీ పర్వాలేదు. జాగ్రత్తలు: ఈ ఆసనం పూర్తి స్థాయిలో చేయడం ముఖ్యం కాదు. చేసేటప్పుడు కాలి కండరాలను బలవంతంగా సాగదీయకుండా నెమ్మదిగా పూర్తిగా సడలింపచేస్తూ రిలాక్స్డ్ మనస్సుతోటి వీలైనంతవరకు చేయడం ముఖ్యం. రెండు కాళ్ళ క్రింద మోకాలుకు అడుగు భాగంలో బాలిస్టర్లను ఉపయోగించి సాధన చేయడం మంచిది. మోకాలు నొప్పులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా చేయాలి. ఉపయోగాలు: తొడలలో, నడుము క్రింది భాగాల్లో పేరుకుని ఉన్న కొవ్వు కరగడానికి చక్కటి అవకాశం ఉంది. తొడ కీలు భాగాలు తెరుచుకుని పెల్విక్ ప్రాంతం చాలా బలంగా తయారవుతుంది. మోడల్: నేహా చౌదరి