రూ.750తో పెళ్లి.. విషాదమే వెంటాడింది.. నానా భార్య ఎవరో తెలుసా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు నానా పటేకర్. దశాబ్దాల పాటు విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నానా పటేకర్ సినీ ప్రస్థానం గురించి చాలామందికి తెలుసు. కానీ ఆయన భార్య నీలకంటి పటేకర్ గురించి మాత్రం పెద్దగా తెలియదు.ఐఐటీ ర్యాంకర్.. అయినా నటన వైపేపుణేకు చెందిన నీలకంటి పటేకర్ చిన్నతనం నుంచే చదువులో ప్రతిభావంతురాలు. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన ఐఐటీ ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించారు. మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు ఆమె ముందున్నప్పటికీ.. నాటకరంగంపై ఉన్న ఆసక్తి ఆమెను కళల వైపు నడిపించింది. ఇంజినీరింగ్, సైన్స్ రంగాల్లో కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఉన్నా.. ఆమె థియేటర్ ఆర్టిస్ట్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.ఉత్తమ నటిగా గోల్డ్ మెడల్సినిమాల్లోకి రాకముందే నీలకంటి మరాఠీ నాటకరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో జరిగిన మహారాష్ట్ర స్టేట్ డ్రామా కాంపిటీషన్లో ఉత్తమ నటిగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తర్వాత కూడా నాటకరంగంలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. 1989లో సచిన్ పిల్గాంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆత్మవిశ్వాస్’ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కగా.. మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటి పురస్కారం అందజేసింది.నాటకాలతోనే నానాతో పరిచయంనీలకంటి పటేకర్‌కు నాటకరంగంతో ఉన్న అనుబంధమే నానా పటేకర్‌తో పరిచయానికి కారణమైంది. నాటకాల సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. 1978లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అత్యంత సాదాసీదాగా జరిగిన ఈ పెళ్లికి అప్పట్లో కేవలం రూ.750 మాత్రమే ఖర్చయిందట. అయితే పెళ్లి తర్వాత వారి జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారి మొదటి కుమారుడు రెండున్నరేళ్ల వయసులోనే కన్నుమూశారు. అనంతరం వారికి మల్హర్ పటేకర్ జన్మించారు.ఛావా సినిమాతో..కుటుంబ బాధ్యతల కారణంగా నీలకంటి పటేకర్ చాలా కాలం పాటు నటనకు దూరంగా ఉన్నారు. నాటకరంగంలో ప్రతిభను చాటిన ఆమె.. సినిమాలకు కూడా కొంతకాలం దూరమయ్యారు. అయితే ఇటీవలే ‘ఛావా’ సినిమాతో వెండితెరపైకి తిరిగి వచ్చారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ‘ధరావు’ పాత్రను పోషించారు. చాలా ఏళ్ల తర్వాత తెరపై కనిపించినప్పటికీ.. తన నటనతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.(ఇదీ చదవండి: నవరసాల నానా.. మీమ్స్‌లో ఎప్పటికీ కేరాఫ్! )