రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. ఎదురుగా భారీ సర్పం
నయాగఢ్: ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో ఓ బాలుడి తల రాళ్ల సందులో ఇరుక్కుపోవడంతో పాటు.. పక్కనే భారీ కొండచిలువ(విషసర్పం) కూడా ఉండటంతో తీవ్ర టెన్షన్ నెలకొంది. ఎనిమిది గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు బాలుడిని క్షేమంగా రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.వివరాల్లోకి వెళ్లితే. బాలుడు శిబా ప్రధాన్ తన మామతో కలిసి తేనె సేకరించడానికి కనిపాడ అడవికి వెళ్లాడు. అక్కడ పెద్ద రాళ్ల సందులో తేనెతుట్టెలను చూసి.. వాటిని సేకరించేందుకు శిబా ప్రయత్నించాడు. ఆ క్రమంలో సందు లోపలి భాగంలో ఉన్న తేనెను తీయడానికి ప్రయత్నించినప్పుడు.. ఆ బాలుడి తల రాళ్ల సందులో ఇరుక్కుపోయింది. శిబా మామ అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలమవ్వడంతో.. గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వారు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.A rescue operation is underway near Odagaon in Odisha after a minor boy got trapped between big rocks while collecting honey in the forest.His head is stuck between the rocks, making the rescue extremely challenging. Odisha Fire Services team is working to save him safely. pic.twitter.com/1eNDLvZlM6— Manas Muduli (@manas_muduli) May 6, 2026సమాచారం అందుకున్న ఒడగావ్, నయాగఢ్ నుండి రెండు అగ్నిమాపక బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. రక్షణ చర్యల్లో స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. అయితే, శిబాకు సమీపంలోనే ఒక పెద్ద విషసర్పం ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు కొంత ఆటంకం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది మొదట బాలుడికి ధైర్యం చెప్పి.. ఆపై వివిధ పరికరాలను ఉపయోగించి అతన్ని విజయవంతంగా బయటకు తీశారు. ఎనిమిది గంటల శ్రమ తర్వాత శిబాను సందులోంచి సురక్షితంగా బయటకు తీసి.. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.