రేప్కు గురైన మైనర్ బాలిక పరిస్థితి విషమం | Khandapada rape victim critical in Cuttack hospital | Sakshi
Sakshi News home page

రేప్కు గురైన మైనర్ బాలిక పరిస్థితి విషమం

Aug 24 2013 4:19 PM | Updated on Sep 1 2017 10:05 PM

ఒడిశాలోని నయాగర్ జిల్లాలో అత్యాచారానికి గురైన గిరిజన మైనర్ బాలిక పరిస్థితి విషమంగా ఉందని కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు శనివారం వెల్లడించారు.

ఒడిశా రాష్ట్రంలోని నయాగర్ జిల్లాలో అత్యాచారానికి గురైన గిరిజన మైనర్ బాలిక పరిస్థితి విషమంగా ఉందని కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ బాలిక పాక్షికంగా సృహలో ఉంటుందని తెలిపారు. మైనర్ బాలిక మెడపైన బలమైన గాయానికి శస్త్ర చికిత్స నిర్వహించామని, అయినా ఆ బాలిక  మట్లాడలేకపోతుందని చెప్పారు.

 

ఆగస్టు 20న కందపడ పోలీస్ స్టేషన్ పరిధిలో కందమిరిగి గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులు పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. రక్తపు ముడుగులో విగత జీవిగా ఉన్న ఆ మైనర్ బాలికను కుటుంబ సభ్యులు చూసి భువనేశ్వర్లోని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు.

 

అక్కడ ఆమె పరిస్థితిలో ఎంతకు మార్పు రాకపోవడంతో ఆమెను కటక్లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఘటన తీవ్ర సంచలనం రేపింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement