breaking news
Navi Mumbai International Airport
-
కాంగ్రెస్ నిర్వాకాలతో భారీ మూల్యం
నవీ ముంబై: విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చిందని మండిపడ్డారు. ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై సైనిక చర్య చేపట్టకుండా అడ్డుకున్నదెవరో దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. ఈ పార్టీ నిర్వాకాల వల్ల దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ముష్కరులపై సైనిక చర్యకు ఒక దేశం అడ్డుపడినట్లు కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ముంబై మెట్రో రైలు నెట్‌వర్క్‌లో ఆక్వా లైన్‌తోపాటు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా, గొప్ప మెట్రోనగరంగా ప్రఖ్యాతి గాంచిన ముంబైని ఉగ్రవాదులు ఎప్పటినుంచో టార్గెట్ చేశారని చెప్పారు. 2008లో భీకర దాడులు జరిగాయని అన్నారు. అప్పట్లో పాక్ ఉగ్రవాదుల భరతంపట్టాలని ప్రజలంతా కోరుకున్నారని, మన సైనిక దళాలు సైతం అందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. కానీ, మరో దేశం అడ్డుకోవడంతో సైనిక చర్య ఆగినట్లు కేంద్ర హోంమంత్రే చెప్పారని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేయొద్దంటూ అప్పట్లో అమెరికా కోరుకుందని చిదంబరం పేర్కొన్నారు. పౌరుల భద్రతే ముఖ్యం ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను బలోపేతం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ భద్రతపై రాజీపడిందని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఉగ్రవాద దాడులకు తగిన రీతిలో బదులిస్తున్నామని, ముష్కరుల భూభాగంలోకి చొరబడి మరీ బుద్ధి చెప్తున్నామని వివరించారు. దేశంతోపాటు పౌరుల భద్రత కంటే తమకు ఇంకేదీ ముఖ్యం కాదన్నారు. వికసిత్ భారత్‌కు ప్రతీక పద్మం ఆకారంలో నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వికసిత్ భారత్‌కు ఒక ప్రతీక అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రూ.19,650 కోట్లతో 1,160 హెక్టార్లలో ఈ ఎయిర్పోర్ట్ మొదటి దశను నిర్మించారు. దేశంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా ఇది రికార్డుకెక్కింది. డిసెంబర్లో ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాశ్రయ ప్రారం¿ోత్సవంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ముంబై మెట్రో లైన్–3 తుది దశను ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశమంతటా అభివృద్ధి జాడలు వికసిత్ భారత్‌కు గతి(వేగం), ప్రగతి(అభివృద్ధి) అత్యంత కీలకమని ప్రధాఉద్ఘాటించారు. గత 11 ఏళ్లుగా మన దేశం వికసిత్ని భారత్ దిశగా ప్రయాణం సాగిస్తోందన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు. వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టామని, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును వేగవంతం చేశామని అన్నారు. జాతీయ రహదారులు, వంతెనలు, సొరంగాలు నిర్మించామని, నగరాలను అనుసంధానించామని వివరించారు. దేశంలో ఎక్కడ చూసినా అభివృద్ధి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో 2014లో 74 ఎయిర్‌పోర్టులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరిందని చెప్పారు. ‘ఉడాన్’ పథకంతో గత పదేళ్లలో లక్షలాది మంది తొలిసారిగా విమాన ప్రయాణం చేశారని, కలలు నెరవేర్చుకున్నారని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ మనదేనని స్పష్టం చేశారు. మరికొన్నేళ్లలో మనదేశం విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్ఓ) హబ్‌గా మారబోతోందని తేల్చిచెప్పారు. ముంబైలో చారిత్రక భవనాలు దెబ్బతినకుండా 33.5 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ మెట్రో మార్గం నిర్మించిన ఇంజనీర్లు, కార్మికులను ప్రధాని అభినందించారు. -
ఐదేళ్లలో అందుబాటులోకి నవీముంబై విమానాశ్రయం
నాగపూర్: 2019 నాటికల్లా ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. విధానమండలిలో గురువారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెలాఖరులోగా ఈ విమానాశ్రయానికి అవసరమైన అనుమతులన్నింటినీ పొందుతామన్నారు. తొలివిడత కార్యకలాపాలు 2019లో ప్రారంభమవుతాయన్నారు. సంజయ్‌దత్తా, భాయ్ జగ్తాప్, హుస్నబాయి ఖాలిఫ్, శరద్ రణ్పిసే తదితర సభ్యులు సావధాన తీర్మానం కింద అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు. ‘ఈ విమానాశ్రయం కోసం ఇప్పటికే 592 ఎకరాల భూమిని సేకరించాం. వివిధ రకాల అనుమతుల మంజూరు కూడా చకచకా జరిగిపోతోంది. ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉంది. ఇవన్నీ వచ్చే నెలాఖరులోగా వస్తాయి. అనుమతులన్నీ వచ్చాక నిర్మాణ పనుల కోసం టెండర్లను ఆహ్వానిస్తాం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 14,573 కోట్లు. ఈ ప్రాజెక్టుకు సిడ్కో సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. తొలి దశ పూర్తయితే ఏడాదికి దాదాపు 10 మిలియన్ల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయంలో సేవలు అందుబాటులోకి వస్తాయి. నిరుదోగ్యులకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో దీనిని నిర్మిస్తాం. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపు అవుతుంది’ అని పేర్కొన్నారు. ‘విద్యాప్రమాణాల్ని మరింత పెంపొందించాలి’ నాగపూర్: రాష్ర్టవ్యాప్తంగా వివిధ సంస్థల్లో విద్యాప్రమాణాలు నానాటికీ క్షీణించిపోతుండడంపై పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు యోగేష్ సాగర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అన్నిరంగాల్లో రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే విద్యాప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ఇదే అంశంపై మరో సభ్యుడు గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ పాఠశాల విద్యకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా ప్రమాణాల మెరుగునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకుగాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ అదే సమయంలో సభలో ఉన్న విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డేకి సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వైద్య విద్యా కళాశాలల పనితీరు ఎంతమాత్రం బాగాలేదన్నారు. 50 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు తగినంత డొనేషన్ ఇవ్వగలిగితే ఈ కళాశాలలు వారికి ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తున్నాయని, ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇటువంటి కళాశాలల్లో ప్రమాణాలు ఎలా ఉంటాయనే విషయానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. ఇటువంటి కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసి వైద్యవృత్తిని స్వీకరించినా వారు రోగులకు సరైన వైద్యసేవలను అందించలేరన్నారు. రోగులకు తగు పరీక్షలు కూడా చేయలేరన్నారు. -
‘నవీ’ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ మొదలు
సాక్షి, ముంబై: నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం (గ్రీన్‌ఫీల్డ్)గా ఇది రూపుదిద్దుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యం లభించింది. నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ 2000వ సంవత్సరంలో తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. అప్పటినుంచి ఈ ప్రాజెక్టు చర్చల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చొరవ తీసుకోవడంతో ఈ ప్రాజెక్టు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. వివిధ శాఖల నుంచి దాదాపు అనుమతులన్నీ లభించాయి. దీంతో ఈ విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇందుకు అవసరమైన స్థలసేకరణ విషయంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడం, నష్టపరిహారం, పునరావాసం తదితర సమస్యలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు అక్కడి గ్రామాల రైతులు, ప్రజలు స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించడంతో ఈ సమస్యకూడా పరిష్కారమైంది. నష్ట పరిహారం ఎక్కువమొత్తంలో చెల్లించాలనే విషయంలో ఇప్పటికీ ఆరు గ్రామాల ప్రజలు గట్టి పట్టుదలతో ఉన్నారు. త్వరలో స్థానికులతో చర్చలు జరిపి, వారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తామని సిటీ ఇండ ్రస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు వివిధ శాఖల నుంచి అనుమతులు లభించడంతో ఇక టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.