-
ఏ మేరే దిల్ కహీ ఔర్ చల్...
గోల్డెన్ ఎరా అంటారు– హిందీ సినిమా సంగీతంలో 1950–60ల మధ్య కాలాన్ని. సంగీతం కూడా విజయాన్ని నిర్దేశించేది. దిలీప్‌కుమార్ తన సినిమాలతో గొప్ప పాటలు ఇచ్చాడు. తను పాడాడు. కొందరి నసీబ్లు మార్చాడు. ఆ పాట కబుర్లు కొన్ని... దేవ్ ఆనంద్ దగ్గరకు ‘జంజీర్’ స్క్రిప్ట్ తీసుకుని వెళితే కథ చాలా బాగుంది... కాని హీరోకు పాటల్లేవు... నా ఇమేజ్‌కు తగినట్టుగా రెండు డ్యూయెట్స్ పెడితే ఈ సినిమా చేస్తాను అన్నాడు. దర్శకుడు ప్రకాష్ మెహ్రా ఒప్పుకోలేదు. అమితాబ్‌తో ఆ సినిమా తీశాడు. ఆ సినిమా ఒక రివెంజ్ స్టోరీ. అందులో పాటలకు వీలు లేదు. నిజమే. కాని ‘మొఘల్–ఏ–ఆజమ్’ ప్రేమ కథ. సలీమ్–అనార్కలీ తల మునకలుగా ప్రేమించుకుంటారు. దిలీప్ కుమార్‌కు దర్శకుడు కె.ఆసిఫ్ కథ చెప్పినప్పుడు ‘నాకు డ్యూయెట్ ఎక్కడ’ అనలేదు దిలీప్ కుమార్. తన మీద ఒక్క డ్యూయెట్ లేకుండానే ఆ సినిమాలో నటించాడు. ‘మొఘల్–ఏ–ఆజమ్’లో నేటికీ నిలబడి ఉన్న గొప్ప పాట ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ మధుబాలపై చిత్రీకరణ జరిగింది. అందులో దిలీప్ కుమార్ కుర్చీలో కూచుని ఆ పాటను తిలకిస్తాడు. రాజ్ కపూర్ అయితే కనీసం ఒక డ్రీమ్ సీక్వెన్స్ అయినా పెట్టి ఉండేవాడు ఇలాంటి కథలో. దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు నౌషాద్, గీతకర్త షకీల్ బదయూని ముగ్గరూ కలిసి ఒక త్రయంగా పాటల మువ్వలకు శ్రావ్యతను ఇచ్చారు. దిలీప్ కుమార్, నౌషాద్‌ల కాంబినేషన్లో ఆ తరం వారు మురిపెంగా చెప్పుకునే ‘అందాజ్’, ‘మేలా’, ‘బాబుల్’, ‘కోహినూర్’, ‘గంగా జమున’, ‘ఉరన్ ఖటోలా’, ‘లీడర్’... లాంటి హిట్స్ వచ్చాయి. ‘మొఘల్ ఏ ఆజమ్’ తలమానికం. ‘కోహినూర్’లో నౌషాద్ చేసిన ‘దో సితారోంకా జమీన్ పర్ హై మిలన్ ఆజ్ కీ రాత్’ పాట తెలుగులో ‘ఈ రేయి నీవూ నేనూ ఎలాగైనా కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి’గా వినిపించింది. ఇదే సినిమాలోని ‘మధుబన్ మే రాధికా నాచేరే’ రఫీ రాగం తీస్తే సముద్ర గర్భంలో ఉన్న బెస్తవాడికి కూడా వినిపించింది. ఈ పాటలో దిలీప్ కుమార్ సితార్ వాయిస్తూ కనిపించేందుకు దాదాపుగా సితార్‌ను నేర్చుకున్నాడు. అందుకే ఆ భాగాన్ని అతనే వాయించినట్టు అనిపిస్తుంది. దిలీప్– నౌషాద్ కాంబినేషన్లో మీరు జేబులో నుంచి తీసేకొద్దీ వచ్చే చిరుతిండ్ల పొట్లాల వంటి పాటలు వచ్చాయి. ‘ఓ దూర్ కే ముసాఫిర్ ముజ్కోభి సాత్ లేలేరే’ (ఉరన్ఖటోలా), ‘ముఝే దునియ వాలో షరాబీన సంఝో’ (లీడర్), ‘ఆజ్ కీ రాత్ మేరే దిల్ కీ సలామీ లేలే’ (రామ్ ఔర్ శ్యామ్), ‘ఆజ్ పురానీ రాహోంసే కోయి ముఝే ఆవాజ్ న దే’ (ఆద్మీ), ‘కోయి సాగర్ దిల్ కో బెహలాతా నహీ’ (దిల్ దియా దర్ద్ లియా).... ఇవన్నీ కడిగిన సరిగమల్లా ఉంటాయి. ఇతర సంగీతకారులు తక్కువ తినలేదు. సలీల్ చౌధరి తన బెంగాళీ రసగుల్లాల్లాంటి పాటలతో ‘మధుమతి’ని నింపేశాడు. దిలీప్ పాడే ‘సుహానా సఫర్ ఔర్ ఏ మౌసమ్ హసీ’ పచ్చటి లోయల్లే వీచే గాలిలా ఉంటుంది. ‘దిల్ తడప్ తడప్ కె కెహ్ రహాహై ఆభిజా’ గుండెను హృదయంగా మార్చదూ?. ఇందులోనే ‘టూటే హుయే ఖ్వాబోనే’ ఒక లలితమైన రోదన. ఇక ఓ.పి. నయ్యర్ హార్మోనియం పెట్టె ముందేసుకుని ‘నయాదౌర్’లో ప్రతి పాటనూ హిట్ చేశాడు. ‘ఏ దేశ్ హై వీర్ జవానోంకా’ దేశభక్తి గీతాలలో మేలిమిది. ఆశాభోంస్లే, రఫీ పాడిన రెండు డ్యూయెట్లు ‘ఉడె జబ్ జబ్ తేరే జుల్ఫే’, ‘మాంగ్ కే సాథ్ తుమ్హారా’ దిలీప్–వైజయంతి మాలలకు మాలలు. ‘సాథీ హాత్ బఢానా ఏక్ అకేలా థక్ జాయేగా మిల్ కర్ బోజ్ ఉఠానా’ కలిసి పని చేయమని ఎంత బాగా చెబుతుంది. దిలీప్ కుమార్‌కు తలత్ మంచి పాటలు పాడాడు. ‘దాగ్’లో ‘ఏ మేరే దిల్ కహీ ఔర్ చల్’ పాట నేటికీ ప్రియమైనది. ‘ఫుట్‌పాత్’లో తలత్ పాడిన విరహ వెన్నెల గీతం ‘షామ్ ఏ గమ్ కీ కసమ్ ఆజ్ గంగీన్ హమ్ ఆభిజా ఆభిజా ఆజ్ మేరే సనమ్’ లేమత్తు పానీయం. దిలీప్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేస్తే అందులోనూ ఆయనకు పాటలు ఇచ్చారు దర్శకులు. ‘కర్మ’లో ‘దిల్ దియాహై జాన్ భీ దేంగే’ పాటకు ముందు కొన్ని లైన్లను ఆయనే పాడి అభిమానులను మురిపించాడు. ‘సౌదాగర్’లో ‘ఇమ్లీకా బూటా’ పెద్ద హిట్. రోజులు గడిచే కొద్ది కొన్ని సుగంధాలకు విలువ పెరుగుతుంది. ఈ పాటల సుగంధం మరో వందేళ్లు. – సాక్షి ఫ్యామిలీ -
‘పోలవరం’పై పిటిషన్ల కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌స్ట్రాయ్ జాయింట్ వెంచర్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోమా తదితర కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నౌషాద్ అలీ బుధవారం తీర్పు వెలువరించారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రజాధనం వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఈ వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. మొదట అనర్హత జాబితాలో చేర్చిన కంపెనీలను తిరిగి అర్హత జాబితాలో చేర్చుతూ రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంటపై సోమా జాయింట్ వెంచర్ హైకోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్‌స్ట్రాయ్ జాయింట్ వెంచర్‌కు మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ మధుకాన్ జాయింట్ వెంచర్ మరో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే టెండర్ నిబంధనలను సడలించడాన్ని సవాలు చేస్తూ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాలక్ష్మి ఇన్ఫ్రా వేర్వేరుగా 2 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ అలీ వాటిని కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించారు. ‘‘పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా ప్రజల చిరకాల వాంఛ. సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని మళ్లించి లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో, కోట్ల మందికి ఆనందంతో పాటు సుసంపన్నత కలిగించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తలపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణం తొలుతలోనే ప్రారంభించి ఉంటే ప్రస్తుత అంచనా వ్యయంలో 4వ వంతు ఖర్చుతోనే సాకారమయ్యేది. ప్రస్తుతం కాంట్రాక్టు కేటాయింపులను ఆమోదించడం వల్ల ఇప్పటికైనా రూ. 600 కోట్ల మేర ప్రజాధనం ఆదా అవుతుంది. ఇదేమీ తక్కువ కాదు. ప్రజల తప్పేమీ లేకపోయినా పోలవరం ప్రాజెక్టు సుదీర్ఘ కాలంగా నిలిచిపోయింది. వాస్తవానికి అంతకాలం వేచిచూడాల్సిన అవసరం లేదు.’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement