breaking news
Natwarlal
-
BJP MP: మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమే!
న్యూఢిల్లీ: రేషన్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. "మీ పేరు కేజ్రీవాల్, నాట్వర్లాల్ కాదు, దయచేసి కేంద్రానికి నిరంతరం లేఖలు రాయడం ద్వారా ప్రజలను అంధకారంలో ఉంచడం ఆపండి." అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. "మీరు ఐదేళ్ళకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని రేషన్ షాపుల లైసెన్సులను రద్దు చేసారు. ఎంత మందిని జైలుకు పంపారు. ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటిపై మీరు తీసుకున్న చర్యలేంటి? ప్రధానమంత్రికి లేఖలు రాయడంతోనే మీరు కాలం వెళ్లదీస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమేనని స్పష్టమవుతుంది" అంటూ బీజేపీ ఎంపీ విమర్షలు గుప్పించారు. "రేషన్ డోర్ డెలివరీ చేసే సమయం నుంచి ఈ రేషన్‌ను ఎక్కడ నుండి కొన్నారో.. బడ్జెట్లో కేటాయించిన వాటి వివరాలు కూడా మాకు చెప్పండి. మీరు లబ్ధిదారులుగా గుర్తించిన గృహాలన్నీంటికీ రేషన్ అందించాలనుకుంటే దాన్ని మేం స్వాగతిస్తున్నాం. మీ స్వంతంగా రేషన్ పథకం ద్వారా దాని కోసం ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే మీ వద్ద ఉన్న రేషన్‌ను ఆహార భద్రతా చట్టం ప్రకారం ఢిల్లీకి ఇస్తారు.” అని ఎంపీ మీనాక్షీ లేఖి తెలిపారు. ఇక రేషన్‌ను ఇంటికి పంపిణీ చేయడానికి మార్పులు తేవాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. (చదవండి: 4 భారీ టవర్లు.. 5 దశాబ్దాల సేవ.. 10 సెకన్లలోనే!) -
రూ. 180కోట్ల కుంభకోణంలో ఆర్థిక నేరస్థుడి ఆరెస్ట్
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్పీటీ) తరఫున నకిలీ (ఫోర్జరీ) లేఖలను సృష్టించి, ఆ సంస్థకు సంబంధించిన కోట్లాది రూపాయులను ఓరియుంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌నుంచి దొంగచాటుగా బదలారుుంచుకున్న ఆరోపణలపై గుజరాత్‌కు చెందిన ఒక ఆర్థిక నేరస్థుడిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. విచారణ అనంతరం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌నుంచి నట్వర్లాల్ బంగావాలాను శనివారం రాత్రి తాము అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ సోమవారం ప్రకటించింది. జేఎన్‌పీటీకి సంబంధించిన రూ.180కోట్ల నగదును రెండు ఓబీసీ శాఖలనుంచి ఎవరో దొంగచాటుగా బదలాయించుకున్నారన్న సంస్థ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో దర్యాప్తు కొలిక్కి వచ్చింది, జేఎన్పీటీ పేరిట జవు అరుున మొత్తం సొవుు్మ, ఏడు బ్యాంకులకు 12వుంది ఖాతాదార్లకు ఫోర్జరీ లేఖల ద్వారా బదిలీ అరుునట్టు తేలింది. ఇలా డబ్బును బదలారుుంచుకుని లబ్ధిపొందినవారిలో నట్వర్లాల్ బంగావాలా ఒకరని సీబీఐ తెలిపింది.