breaking news
National Youth Festival
-
నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం
న్యూఢిల్లీ: ‘నా భార్య అద్భుతమైనది. ఆమెను తదేకంగా చూడటం నాకు ఇష్టం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మహీంద్రా తాజాగా చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. పని గంటల పరిమాణాన్ని నొక్కి చెప్పడం తప్పు అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ‘మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంత సమయం పని చేశామన్నది కాదు. కాబట్టి 40 గంటలా, 70 గంటలా, 90 గంటలా కాదు. మీరు ఏ అవుట్‌పుట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. 10 గంటలు అయినా మీరు ప్రపంచాన్ని మార్చవచ్చు’ అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపినంత మాత్రాన తాను ఒంటరిగా ఉన్నట్టు కాదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఎక్స్ వేదికగా 1.1 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వివరించారు. -
వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి
నాసిక్: దేశంలో వారసత్వ రాజకీయాల ప్రభావాన్ని తగ్గించాల్సిన బాధ్యత యువతరంపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం వారంతా వెంటనే ఓటర్లుగా నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘మన దేశపు 21వ శతాబ్దపు యువత అత్యంత అదృష్టవంతులని పేర్కొన్నారు. అమృత కాలంలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే అద్భుత అవకాశం వారికి లభించింది’’ అన్నారు. మహారాష్ట్రలో నాసిక్‌లోని తపోవన్ మైదానంలో శుక్రవారం 27వ ‘నేషనల్ యూత్ ఫెస్టివల్’ను మోదీ ప్రారంభించారు. స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ తల్లి జిజాబాయి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. మాదక ద్రవ్యాలకు, అసభ్య పదజాలానికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. యువతకు కర్తవ్య కాలం రాబోయే 25 ఏళ్ల అమృత కాలం యువతకు ‘కర్తవ్య కాలం’ అని మోదీ ఉద్ఘాటించారు. యువత ఓటు ద్వారా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వారు ఎంతగా పాల్గొంటే దేశ భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుందన్నారు. వారసత్వ రాజకీయాల ప్రభావమూ అంతగా తగ్గిపోతుందన్నారు. అరబిందో, వివేకానంద గొప్పతనాన్ని, వారు అందించిన సేవలను ప్రస్తావించారు. నాసిక్ రామకుండ్‌లో పూజలు మోదీ శుక్రవారం మహారాష్ట్రలో నాసిక్‌లోని శ్రీ కాలారామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. రామ్‌కుండ్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు నగరంలో రోడ్ షోలో పాల్గొన్నారు. తర్వాత గోదావరి తీరంలోని రామ్‌కుండ్ వద్ద సంప్రదాయ తలపాగా ధరించి పూజలు చేశారు. జల పూజ, హారతిలో పాలుపంచుకున్నారు. అఖిల భారతీయ స్వామి సమర్థ్ గురుకుల పీఠం అధినేత అన్నాసాహెబ్ మోరే, కైలాస్ మఠాధిపతి స్వామి సంవిదానంద సరస్వతి, తుషార్ బోసలేను కలుసుకున్నారు. తర్వాత పంచవటిలోని ప్రఖ్యాత కాలారామ్ మందిరంలో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మోదీ శ్రమదానం చేశారు. చీపురు చేతపట్టి పరిసరాలను చెత్తాచెదారం ఊడ్చేశారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ 1930 మార్చి 2న ఇదే మందిరంలో అంబేడ్కర్ తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం రూ.30,000 కోట్ల పై చిలుకు విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధాని మోదీ 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట శుక్రవారం నుంచి 11 రోజుల అనుష్ఠానం ప్రారంభించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘‘నాకు చాలా ఉద్వేగంగా ఉంది. జీవితంలో తొలిసారిగా ఇలాంటి భావాలు నా మదిలో వెల్లువెత్తుతున్నాయి. వాటిని అనుభూతి చెందగలను తప్ప మాటల్లో వ్యక్తీకరించలేను. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరికీ, రామ భక్తులకు పవిత్ర సందర్భం. గొప్ప వేడుక. ఈ అరుదైన సందర్భానికి ప్రత్యక్ష సాక్షిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. బాలరాముడి ప్రాణప్రతిష్టకు భారతీయులందరి తరఫున ప్రాతినిధ్యం వహించడానికి భగవంతుడు నన్ను సాధనంగా ఎంచుకున్నాడు. నన్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. అనుష్ఠానంలో భాగంగా మోదీ నిత్యం సూర్యోదయానికి ముందే మేల్కొంటారు. యోగా, ధ్యానం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాతి్వకాహారమే స్వీకరిస్తారు. ‘అటల్ సేతు’ ప్రారంభం ముంబై: 21.8 కిలోమీటర్లతో అత్యంత పొడవైన సముద్ర వారధి ‘అటల్ బిహారీ వాజ్‌పేయి సెవ్రీ–నవా షివా అటల్ సేతు’ను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ‘వికసిత్ భారత్’కు ఈ సేతు ఒక ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. ఈ ఆరు లేన్ల బ్రిడ్జి మహారాష్ట్రలో దక్షిణ ముంబై–నవీ ముంబైని అనుసంధానిస్తుంది. -
ఘనంగా విజ్ఞాన్ మహోత్సవ్-2014
సాక్షి, గుంటూరు: వడ్లమూడిలోని విజ్ఞాన్ క్యాంపస్‌లో రెండ్రోజుల పాటు సాగే నేషనల్ యూత్ ఫెస్ట్ శుక్రవారం మొదలైంది. పలు ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్శిటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. విజ్ఞాన్ మహోత్సవ్ పేరిట గత పద్నాలుగేళ్ళుగా దీన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో 2010 నుంచి 2013 వరకు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 200 మంది విద్యార్ధులకు రూ. కోటి చెక్కుల్ని అకడమిక్ స్కాలర్‌షిప్పుల కింద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరైన ఒరాకిల్ గ్లోబల్ కస్టమర్ సర్వీసెస్ డెరైక్టర్ సునీల్ కుంటేట మాట్లాడుతూ విద్యార్ధులు ఒక రంగంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విజ్ఞాన్ సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ క్లాసు రూం పాఠాలతో 20 శాతమే విజ్ఞానం లభిస్తుందని, దీనితో పాటు భావోద్వేగం, భౌతికం, మానసికం, సామాజికంగా జ్ఞానాన్ని పొందితేనే అది సంపూర్ణమవుతుందన్నారు. యువజనోత్సవాల ద్వారా టీం స్పిరిట్, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. క్యాంపస్‌లో ‘స్ఫూర్తి’ పేరుతో టెక్నికల్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ మహోత్సవ్ కన్వీనర్ ఎ. రఘునాధ్, విజ్ఞాన్ వర్శిటీ ఛాన్సలర్ కె. రామ్మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు.