breaking news
national quota
-
సగం సీట్లు ‘ఇతరులకే’..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ మెడికల్ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా 50 శాతం సీట్లను నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజీ మెడికల్ సీట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. ఎంబీబీఎస్‌లో నేషన ల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో ఏకంగా సగం కేటాయిస్తున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ విద్యార్థులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మనోళ్ల అనాసక్తి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి దాదాపు 2,800 పీజీ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 1,200 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వాటిల్లో 600 వరకు (50 శాతం) జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర కౌన్సెలింగ్‌లో నింపుతారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విధానం మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్న రాష్ట్రాల విద్యార్థులకు మేలు చేస్తుండగా, తెలంగాణలాంటి రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం నష్టం కలిగిస్తున్నదని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాదికి చెందిన చాలామంది విద్యార్థులు మన రాష్ట్రంలోని సీట్లపై ఆసక్తి చూపుతారు. కానీ మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో జాతీయ కోటాలో నింపే మన రాష్ట్ర 600 సీట్లలో దాదాపు 300 మంది ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో మన రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని చెబుతున్నారు. -
ముగిసిన నేషనల్ కోటా ‘ఎంబీబీఎస్’ దరఖాస్తు ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: నేషనల్ కోటాలో భర్తీ చేయనున్న ఎంబీబీఎస్ సీట్ల తొలి విడత దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈనెల 19 నుంచి 24 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట ల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు సమయమిచ్చారు. విద్యార్థుల ఆప్షన్లు, ర్యాంకులు, కేటగిరీలవారీగా అందుబాటులో ఉన్న సీట్ల ఆధారం గా, సీట్లు కేటాయించి ఈ నెల 27న అలాట్మెంట్ వివరాలను వెల్లడించనున్నారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 28వ తేదీ నుంచి జూలై 3వ తేదీలోగా సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15శాతం సీట్లను ఈ కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లను జూలై 9 నుంచి ప్రారంభం కానున్న రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలిపోతే, ఏ రాష్ట్రంలోని సీట్లను ఆ రాష్ట్రాలకు బదిలీ చేస్తారు. -
వైద్య విద్య మరింత భారం!
► 30 శాతం ఫీజుల్ని పెంచాలి ► ప్రైవేటు కాలేజీల పైరవీలు ► త్వరలో సర్కారుతో భేటీ ► జాతీయ కోటాలోకి 414 సీట్లు సాక్షి, బెంగళూరు: పేదలు, మధ్యతరగతికి వైద్య విద్య మరింత భారం కానుంది. ఇందుకు సంబంధించిన తెరవెనుక ప్రయత్నాలు ఇప్పటికే మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్య, దంత వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఇక సీట్మాట్రిక్స్ (సీట్ల లభ్యత), ఫీజుల మొత్తాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు కోసం రాష్ట్రంలోని వైద్య సంస్థల యాజమాన్యం వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 58 మెడికల్ కళాశాలలు ఉండగా ప్రభుత్వ కళాశాలల్లో 2,550 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఎస్ఐ కళాశాలల్లో 200, నాన్–మైనారిటీ కళాశాలల్లో 2,015 సీట్లు, మైనారిటీ కళాశాలలో 2,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక డీమ్డ్ యూనివర్శిటీల్లో 1,630 సీట్లు ఉన్నాయి. మొత్తం సంఖ్య 8,395. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువ వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈసారి జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించినందువల్ల కర్ణాటకలోని మొత్తం సీట్లలో ఆల్ ఇండియా కోటా కింద 414 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా కింద 843 సీట్లు వెళ్తాయి. మిగిలిన సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. గతేడాది ఫీజులు ఇవీ ఫీజుల విషయానికి వస్తే గత ఏడాది కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ నిర్వహించిన సీఈటీ ద్వారా ప్రభుత్వ కళాశాలలో సీటు పొందిన వారు ఏడాదికి రూ.16,700 ఫీజు చెల్లించేవారు. ప్రైవేటు కళాశాలలో గవర్నమెంట్ కోటా కింద సీటు పొందినవారు ఏడాదికి రూ.77,500 ఫీజుగా చెల్లించారు. కామెడ్–కే నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రైవేటు కళాశాలల్లో సీటు పొందిన వారు ఏడాదికి రూ.5.75 లక్షలు చెల్లించారు. 30 శాతం పెంచాలని లాబీయింగ్ నిర్వహణ ఖర్చులు పెరిగినందున ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు దాదాపు 30 శాతం ఫీజులు పెంచాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ విషయమై కర్ణాటక రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీ ఫ్రొఫెషనల్ కాలేజస్ అసోసియేషన్ సభ్యుడొకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్‌ను సంప్రదించగా ‘ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఫీజు పెంచాలని కోరుతున్న మాట వాస్తవం. ఈ విషయమై వారంలోపు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నాం.’ అని తెలిపారు. నీట్లో సీఈటీ ర్యాంకర్ల డీలా సీఈటీలో ఉత్తమ ర్యాంకులు పొందిన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే నీట్లో కూడా తమ ప్రతిభను చూపించారు. అందులో ఒక్కరు మాత్రమే (సంకీర్త్ సదానంద...సీఈటీలో–2, నీట్లో–4)పదిలోపు ర్యాంకును పొందారు. ఇక 500లోపు ర్యాంకులు పొందిన వారు ఇతనితో కలిపి ముగ్గురు మాత్రమే. వారిలో రక్షితా రమేష్ (సీఈటీలో–1, నీట్లో–41). మోహిత్ నారాయణ్ (సీఈటీలో–5, నీట్లో–271) ఉన్నారు. సీఈటీలో మూడో ర్యాంకు పొందిన అనన్యకు నీట్లో 1,504 ర్యాంకు వచ్చింది. దీంతో మన వద్ద సెకెండరీ స్థాయి విద్యా వ్యవస్థ నాణ్యత మరింత పెరగాల్సి ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.