breaking news
National Payment Corporation of India
-
ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీపి కబురు అందించింది. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలున్న ఎన్నారైలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఇక నుంచి రోజుకు రూ.1 లక్ష వరకు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులు, ఇతర చెల్లింపులకు నగదు పంపించవచ్చు.ఎన్నారైలు ఇక నుంచి అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి స్మార్ట్‌ఫోన్ నుండి ఉచిత లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించవచ్చు. తద్వారా విదేశాల నుండి లావాదేవీలను నిర్వహించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కొత్తగా నమోదైన యూపీఐ ఐడీల ద్వారా తొలి 24 గంటల్లో రూ.5,000 మాత్రమే పంపేందుకు వీలుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు రూ.1 లక్ష పంపొచ్చు.ఇవీ బ్యాంకులు..యూపీఐ కోసం అంతర్జాతీయ మొబైల్ నంబర్ల అనుసంధానానికి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ మద్దతు ఇస్తున్నాయి.అంతర్జాతీయ మొబైల్ నంబర్లకు అనుకూలమైన యూపీఐ అప్లికేషన్లలో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, భీమ్ ఏయూ, ఫెడ్‌మొబైల్, ఐమొబైల్, భీమ్ ఇండస్ పే, ఎస్ఐబీ మిర్రర్ ప్లస్ వంటివి ఉన్నాయి. ఎన్నారైలు తమ ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్వో ఖాతాల మధ్య, అలాగే భారత్‌లోని ఖాతాలకు యుపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఎన్ఆర్వో ఖాతా నుండి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులను బదిలీ చేయలేరు. విభిన్న బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్న ఎన్నారైలు ప్రతి ఖాతాకు ప్రత్యేక యూపీఐ ఐడీ అవసరం. ఖాతా ఉమ్మడిగా ఉంటే ప్రాథమిక ఖాతాదారు మాత్రమే యూపీఐని ఉపయోగించగలరు. -
ఎస్బీఐ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డ్
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గురువారం రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డ్‌ను ఆవిష్కరించింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో ఈ కార్డు విడుదలయ్యింది. ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఎన్పీసీఐ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ ఏపీ హోత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ కస్టమర్ల జీవన శైలి, ఆకాంక్షలకు అనుగుణంగా తాజా డెబిట్ కార్డ్ ప్రయోజనాలు ఉంటాయని ఈ సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ అన్నారు. ఏటీఎం, పీఓఎస్, ఈ కామర్స్ వంటి అన్ని పేమెంట్ చానెల్స్‌కు వినియోగానికి అనుగుణమైన ఫీచర్‌తో తాజా డెబిట్ కార్డ్‌ను ఆవిష్కరించినట్లు ఎన్పీసీఐ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ ఏపీ హోట అన్నారు. యుటిలిటీ బిల్ పేమెంట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్, 1 శాతం వరకూ ఫ్యూయల్ సర్‌చార్జ్ తగ్గింపు, కాంప్లిమెంటరీ వెల్కమ్ డిస్కౌంట్ వోచర్స్, 2 లక్షల వరకూ బీమా కవరేజ్ వంటి సదుపాయాలు తాజా ఎస్బీఐ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డ్ ద్వారా లభించనున్నాయి.