National Media Centre
-
రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా: మన్మోహన్
-
రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా: మన్మోహన్
న్యూఢిల్లీ: సరైన సమయంలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. సాధారణ ఎన్నికల అనంతరం యూపీఏ కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. ఢిల్లీ రైసినా రోడ్డులోని నేషనల్ మీడియా సెంటర్లో మన్మోహన్ పూర్తిస్థాయి విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తమ ప్రభుత్వం అనేక చారిత్రక చట్టాలను అమల్లోకి తెచ్చిందని తెలిపారు. రాజీనామా చేయాలని ఎప్పుడు అనిపించలేదని, రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానన్నారు. తనను దిగిపోమ్మని ఎవరూ అడగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నుంచి తనకు అనూహ్య మద్దతు లభించిందన్నారు. ఈ పదేళ్లలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు రాలేదన్నారు. రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడు, ఆయన విషయంలో పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. యూపీఏ- 3 ప్రభుత్వం గురించి ఇప్పుడే మాట్లాడడం అసంగతమన్నారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాల మధ్య అంతరం తగ్గుతోంది. ధరల పెరుగుదల ప్రజలను కాంగ్రెస్‌కు దూరం చేసిందన్నారు. ధరాభారం నుంచి పేదలను కాపాడేందుకు కృషి చేశామన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా వ్యవసాయ వృద్ధిరేటు పెరిగిందన్నారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాధాన్యంగా దృష్టి సారించామని చెప్పారు. తాము సాధించిన అభివృద్ధిని విపులంగా చెప్పేందుకు ఇప్పుడు సమయం తక్కువగా ఉందన్నారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి బయటపడుతున్నాయని తెలిపారు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధాని కావడం వినాశకరపరిణామంగా భావిస్తానని మన్మోహన్ అన్నారు. గుజరాత్లో జరిగిన మారణకాండ మళ్లీ దేశంలో జరగాలని కోరుకోవడం లేదన్నారు. ఇప్పుడున్న మీడియాతో పోలిస్తే చరిత్రకారులు తన పట్ల సున్నితంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. -
రిపోర్ట్ కార్డా..? రాజీనామానా?
-
రిపోర్ట్ కార్డా..? రాజీనామానా?
నేటి ప్రధాని ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి పదేళ్లకాలంలో ఇది మూడో మీడియా సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల పదవీకాలంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మీడియా ముందుకు రానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ రైసినా రోడ్డులోని నేషనల్ మీడియా సెంటర్లో ఆయన పూర్తిస్థాయి విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు. యూపీఏ-1 హయాంలో మొదటిసారి ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఒకసారి, యూపీఏ-2 అధికారంలోకి వచ్చిన తరువాత 2009 మేలో మరోసారి ఆయన విలేకరులతో సంభాషించారు. రాజీనామా ప్రకటన, రాహుల్‌గాంధీకి రంగం సిద్ధం చేసే ప్రయత్నం.. ఇలా పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న పరిస్థితుల్లో.. నేటి ప్రధాని ప్రెస్‌మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అవినీతి, ఆర్థికవ్యవస్థ, విదేశాంగ వ్యవహారాలు.. ఈ మూడు రంగాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రెస్మీట్లో ప్రధానంగా ప్రధాని ప్రస్తావించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతి, ధరల పెరుగుదల, విధానపరమైన నిష్క్రియాపరత్వంపై విమర్శలు చెలరేగుతున్న తరుణంలో వాటిని తిప్పికొట్టే దిశగా ఆయన ప్రసంగం సాగవచ్చనుకుంటున్నారు. ముఖ్యంగా లోక్‌పాల్ చట్టం, అవినీతిని అరికట్టే ఉద్దేశంతో రూపొందిస్తున్న ఇతర ప్రతిపాదిత బిల్లులను, ధరల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. విలేకరుల సమావేశం సందర్భంగా రాజీనామా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న ఎవరినుంచైనా వస్తే.. ‘2014 మే తర్వాత రేస్‌లో ఉండను’ అని మన్మోహన్ స్పష్టంగా చెప్పవచ్చని, అలాగే కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ నాయకత్వం వహించాలన్న వైఖరిని పునరుద్ఘాటించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో.. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ‘తరం మార్పు’ను స్వాగతిస్తూ మన్మోహన్ కీలక ప్రకటన చేస్తారా లేక యూపీఏ హయాంపై రిపోర్డు కార్డుతోనే సరిపెడతారా అనేది నేడు తేలనుంది. -
'ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తాం'
2014లో దేశంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో యూపీఏ సంకీర్ణ సర్కారు విజయఢంకా మోగించి, ప్రధానమంత్రి పీఠాన్ని ముచ్చటగా మూడోసారి కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధీమా వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో నేషనల్ మీడియా సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓ వేళ దేశంలో ఎన్నికలు ముందుగా వచ్చిన తమ సంకీర్ణ సర్కార్ వంద శాతం విజయం సాధిస్తుందని సోనియా పేర్కొన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఆహార భద్రత బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూపీఏ -2 ప్రభుత్వ హాయంలో నిత్యవసర ధరలు ఆకాశానంటాయి. అంతేకాదు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల జీవన పరిస్థితులు మరింత దర్భురంగా మారాయని ప్రతిపక్షాలు నిత్యం పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో యూపీఏ సంకీర్ణ సర్కార్ గెలుపొందడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీఏ సర్కార్-2 వచ్చే ఏడాది మే నెలతో ఐదేళ్ల కాలపరిమితి పూర్తి కానుంది.