breaking news
national education day
-
సంస్కరణల పథాన్ని స్వాగతిద్దాం!
ఏ దేశ అభివృద్ధి అయినా అక్కడి మానవ వనరుల వికాసం మీదే ఆధారపడిఉంటుంది. ఈ మానవ వనరుల అభివృద్ధికి ప్రధానమైనది ‘విద్య’. బ్రిటిష్ కాలంలో కేవలం వారికి అనుకూలమైన గుమస్తాలను తయారుచేసే విద్యా విధానాన్నే అనుసరించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్య శాఖ మంత్రిగా కొన్ని సంస్క రణలకు శ్రీకారం చుట్టారు. ఆయన జయంతినే ‘జాతీయ విద్యా దినోత్సవం (National Education Day 2025 ) గా జరుపుకొంటున్నాం.కేంద్ర పాలకులు 1968లో మొదటి జాతీయ విద్యా విధానాన్ని, 1986లో రెండవ జాతీయ విద్యా విధానాన్ని, 1992లో పరిమిత స్థాయిలో మూడవ జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు. కానీ ప్రపంచ దేశాలతో ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశా లతో సమానంగా పోటీపడి నైపుణ్యాలతో ముందుకు వెళ్లలేక పోయాము. మానవ వనరుల శాఖను కూలంకషంగా చర్చించి 34 ఏళ్ల తరువాత విద్యా రంగంలో కీలకమైన మార్పులు చేయాలనే తలంపుతో డా‘‘ కస్తూరి రంగరాజన్ అధ్యక్షతన ‘జాతీయ నూతన విద్యా కమిషన్’ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ సూచనల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ‘నూతన జాతీయ విద్యా విధానం 2020’ (ఎన్ఈపీ–2020) ప్రకటించింది. ఇది దేశంలో విద్యారంగా నికి సంబంధించి సమగ్రమైన సంస్కరణ. సాంకేతిక విజ్ఞానం, నైతిక విలువ లతో కూడిన విద్య, ఉపాధి కల్పన, పారదర్శకత దీని లక్ష్యం. 2035వ సంవత్సరం నాటికి ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 3 కోట్ల సీట్లు అదనంగా రానున్నాయి. యూజీసీ కోర్సులలో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణలు చేర్చారు. దేశ జీడీపీలో 6% నిధులు విద్యా రంగానికి కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇది 4.4% శాతంగా మాత్రమే ఉంది. విదేశీ విద్యా సంస్థలు తమ ప్రాంగణాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకునేలా ప్రోత్సహిస్తారు. ఇప్పటివరకు – కంటెంట్ కేవలం ఆంగ్లం, హిందీలోనే అందుబాటులో ఉండగా ప్రస్తుతం అది 8 భారతీయ భాషల్లో (ఇందులో తెలుగు కూడా ఉంది) అందు బాటులోకి రానుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను ఒకే వేదిక మీదకు తీసుకువస్తారు. దీనికై ‘నేషనల్ టెక్నాలజీ ఫోరమ్’ను ఏర్పాటు చేస్తారు.పాఠశాల విద్యను ప్రీ–ప్రైమరీ పాఠ్యంశాలను ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేస్తుంది. 3–6 సంవత్సరాల పిల్లలకు ఆటల కార్యక్రమాల ద్వారా సరళమైన పాఠ్యంశాలను అమలు చేస్తారు. 1–3 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక అక్షరాలను, అంకెలను త్వరగా గుర్తుపట్టి చదివేలా తీర్చిదిద్దుతారు. దీనికై ఒక నేషనల్ మిషన్ ఏర్పాటు చేశారు. ‘కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల’ను ఇప్పుడున్న 8 – 10 తరగతుల నుండి 12వ తరగతి వరకు పొడిగిస్తారు. బోర్డు పరీక్షకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గిస్తారు. ఏటా ఒకసారి కాకుండా 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయ టకు వెళ్లే సమయానికి వాళ్ళు ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారో వాటిని ఒక డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ నూతన విద్యా విధానంలో భాగంగా ఏ భాషను కూడా బలవంతంగా రుద్దడం జరగదు. అన్ని స్థాయుల తరగతుల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు పరుస్తారు. ప్రస్తుతం ఉన్న 10+2+3 బదులు... 5+3+3+4 ఉండేలా మార్పులు చేస్తారు. 9–12 తర గతుల విద్యార్థులు ఏ మార్కులు వచ్చినా నచ్చిన సబ్జెక్టు తీసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే వాటితో పాటు విద్యార్థులు తమకు నచ్చిన ఫ్యాషన్ డిజైన్, ఆహార తయారీ, తదితర కోర్సులు నేర్చుకోవచ్చు. డిజిటల్ లాకర్ ద్వారా పాత క్రెడిట్స్ అట్టిపెట్టు కొని... చదువు మానేసినా, తనకు వీలైన సమయంలో తిరిగి చదువు కొనసాగించేలా వెసులుబాటు కల్పించారు. చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంవృత్తి విద్యను 6వ తరగతి నుండే ప్రారంభిస్తారు. దీనిలో ఇంట ర్న్‌షిప్ కూడా ఉంటుంది. యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపా ధ్యాయ మండలి వంటివాటిని విలీనం చేసి మొత్తం విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే రకమైన నిబంధనలను అమలు చేస్తారు. గుర్తింపు ఆధారంగానే స్వయం ప్రతిపత్తి ఇస్తారు. విద్యా ర్థులు, అధ్యాపకులకు మార్గదర్శనం చేయడానికి ‘నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్’ను ఏర్పాటు చేస్తారు.ఈ సంస్కరణలను సంకుచితమైన రాజకీయ దృక్కోణంలో చూడకుండా అన్ని రాష్ట్రాలూ అమలు చేయడానికి ముందుకు రావాలి. మనమందరం కూడా ఈ సంస్కరణ ను స్వాగతిద్దాం. అదే మనం అబుల్ కలావ్‌ు ఆజాద్‌కు ఇచ్చే నిజమైన నివాళి.బండారు దత్తాత్రేయ వ్యాసకర్త మాజీ గవర్నర్(నేడు ‘జాతీయ విద్యా దినోత్సవం) -
విద్య అంటే కేవలం చదువేనా?
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఏటా నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవం(National Education Day)గా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి మౌలానా ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా అనేక దార్శనిక నిర్ణయాలు తీసుకున్నారు.దేశంలోని ప్రతి పౌరుడికి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక విద్య కోసం కృషి చేశారు.దేశంలో పరిశోధనలు, సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి ఆయన అనేక ఉన్నత విద్యా సంస్థలను స్థాపించడంలో కీలక పాత్ర వహించారు.యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs) వంటి సాంకేతిక విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదనే ఉద్దేశంతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ వంటి సంస్థలను స్థాపించారు.సెకండరీ విద్యలో మార్పులు తీసుకురావడానికి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ (ముదలియార్ కమిషన్) ఏర్పాటుకు సహకరించారు.అసలు విద్య అంటే..మౌలానా ఆజాద్ ఆశయాలను నెరవేర్చేందుకు శ్రమిస్తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విద్యా విధానాన్ని అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో నేటి భారతీయ విద్యావ్యవస్థలో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. విద్య అంటే కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమేనా? నిజానికి విద్య అనేది విద్యార్థిని విమర్శనాత్మక ఆలోచనాపరుడిగా, సమస్య పరిష్కరించే వ్యక్తిగా, సృజనాత్మక పౌరుడిగా తీర్చిదిద్దాలి. కానీ ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాల ధోరణి ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతోంది.పాత సిలబస్ - పరిశోధనలకు అవరోధంభారత్లో ఏళ్లుగా వస్తున్న సిలబస్‌నే ఇప్పటికీ చాలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధిస్తున్నారు. సిద్ధాంతాలకే(Theory) ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలు లోపిస్తున్నాయి. గుడ్డిగా బట్టీ పట్టే విధానం వల్ల పిల్లల్లో పరిశోధన, ఆవిష్కరణ, కొత్త ఆలోచనలు చేసే సామర్థ్యం దెబ్బతింటోంది.కొన్ని ప్రైవేట్ సంస్థలు ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థల్లో ఆ మేరకు చర్యలు లేకపోవడంతో మెజారిటీ విద్యార్థులు పాత పద్ధతుల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పరిశోధనలు, ఆవిష్కరణల పరంగా భారత్ భవిష్యత్తులో ప్రపంచ దేశాల కంటే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.భవిష్యత్తు కోసం విద్యా విధానం ఎలా ఉండాలి?భారతదేశం విద్యారంగంలో ప్రపంచంలోనే మెరుగైన స్థాయికి ఎదగాలంటే మన విద్యా విధానాన్ని పూర్తిగా పునర్నిర్మించాలి. జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలి. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా ప్రయోగశాలలు, ప్రాజెక్టులు, ఫీల్డ్ ట్రిప్‌ల ద్వారా విద్యను బోధించాలి. విభిన్న సబ్జెక్టులను (ఉదా: సైన్స్, ఆర్ట్స్, టెక్నాలజీ) కలిపి బోధించాలి. తద్వారా విద్యార్థికి సమగ్ర దృక్పథం ఏర్పడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా సైన్స్, డిజిటల్ అక్షరాస్యత వంటి ఫ్యూచర్ స్కిల్స్‌ను పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, ఆధునిక బోధనా పద్ధతులను నేర్పించాలి. బట్టీ పట్టడాన్ని ప్రోత్సహించే పరీక్షలకు బదులుగా విద్యార్థుల సమస్య పరిష్కార సామర్థ్యాన్ని అంచనా వేసే పద్ధతులు ప్రవేశపెట్టాలి.విద్యా సంస్థల యాజమాన్యాలు చేయాల్సిన తక్షణ చర్యలుచాలా విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఫీజుల వసూళ్లపై (Focus on Fees) అధికంగా దృష్టి సారిస్తున్నాయి. లాభాపేక్ష కంటే విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. ప్రతి పైసా విద్యార్థి అభ్యసన వనరుల కోసం ఖర్చు పెట్టాలి. పాతబడిన తరగతి గదులకు బదులుగా డిజిటల్ లైబ్రరీలు, అత్యాధునిక ప్రయోగశాలలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధనా పరికరాలను అందించాలి. అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించుకోవాలి. వారికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి. మంచి జీతాలు ఇవ్వడం ద్వారా బోధనను గౌరవప్రదమైన వృత్తిగా మార్చాలి.ఫీజుల విషయంలో పారదర్శకత పాటించాలి. పేద విద్యార్థులకు, ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయాన్ని అందించాలి. విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలి. విద్యార్థులు సైద్ధాంతిక పరిజ్ఞానంతో(Theoritical Knowledge)పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడానికి పరిశ్రమ నిపుణులతో శిక్షణ తరగతులు, ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయాలి.ఇదీ చదవండి: మాజీ ఉద్యోగిపై రూ.2 కోట్లు దావా వేసిన ఇంటెల్ -
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: భారతరత్న, డాక్టర్ మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా తన నివాళి ప్రకటించారు.స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు..స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/2OoYBxEPB4— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2024 తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అజాద్ జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రేగ మత్స్యలింగం, విశ్వేసరరాజు, విరూపాక్షి హాజరయ్యారు. -
National Education Day: ఉన్నత విద్యకు ఊపిరి పోసి..
ప్రతి ఏటా నవంబరు 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఆయన 1888 నవంబర్ 11న అఫ్ఘానిస్తాన్‌లోని మక్కాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కు అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగానూ ఆజాద్ గుర్తింపు పొందారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పడి, ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడింది. ఆజాద్‌ను దేశంలో ఉన్నత విద్యకు ఊపిరిపోసిన మహనీయునిగా అభివర్ణిస్తుంటారు.దేశ స్వాతంత్ర్య సముపార్జన, దేశ నిర్మాణంలో ఆజాద్ సహకారం అపారమైనదని చెబుతుంటారు. అతనిని స్వతంత్ర భారతదేశ ప్రధాన వాస్తుశిల్పిగానూ అభివర్ణిస్తుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1920లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జామియా మిలియా ఇస్లామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 1934లో యూనివర్సిటీ క్యాంపస్‌ను న్యూఢిల్లీకి మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు.మొదటి విద్యా మంత్రిగా, స్వాతంత్య్రానంతరం దేశంలోని గ్రామీణ పేదలకు, బాలికలకు విద్యను అందించడంపై ఆయన దృష్టి సారించారు. వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించడం, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యను విస్తరించడంతోపాటు వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆయన విద్యారంగంలో పలు మార్పులు చేశారు. దేశాభివృద్ధిలో ఆజాద్ అదించించిన సహకారం స్వాతంత్ర్య ఉద్యమానికి మించినదని కొందరు అంటుంటారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని తొలిసారిగా 2008 నవంబర్ 11న నిర్వహించారు. నాటి నుంచి ప్రతీటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం -
నంద్యాల ఘటన బాధాకరం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : దేశానికి తొలి విద్యా శాఖ మంత్రిగా అబుల్ కలాం సేవలందించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అబుల్ కలాం జయంతిని జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. అబుల్ కలాం జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య నుంచి వర్సిటీ విద్య వరకు అబుల్ కలాం అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. చదవండి: టపాసుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను అబుల్ కలాం హయాంలో స్థాపించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నిరుపేద విద్యార్థులకు మంచి చదువు అందించేలా నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇంగ్లీష్ మీడియం అందించేలా మార్పులు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు వసతి దీవెన అందిస్తున్నామని, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా రూ.3,428 కోట్లు అందించినట్లు వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నమన్న సీఎం జగన్ మైనార్టీలపై ట్విట్టర్, జూమ్ల్లో మాత్రమే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు సంధించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, చంద్రబాబు పాలనలో కేవలం రూ.2500 కోట్లు మాత్రమే మైనార్టీల సంక్షేమానికి కేటాయించారని దుయ్యబట్టారు. నంద్యాల ఘటన బాధాకరమని తెలిపిన సీఎం జగన్ తన దృష్టికి రాగానే చట్టబద్దంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నంద్యాల ఘటనలోనూ పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారని తెలిపారు. న్యాయస్థానంలో నిందితులకు బెయిల్ కూడా మంజూరైందని, బెయిల్ రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలిపారు. మంచి చేయాలని తాము ఆలోచిస్తుంటే.. ఎలా బురద జల్లాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేస్తున్నమని తెలిపారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను కూడా ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. మదర్సాలకు అమ్మ ఒడిని అనుసంధానించామని, వచ్చే ఏడాది నుంచి పెళ్లి కానుక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ నీలం సాహ్ని, మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మౌలానా అబుల్ కలామ్‌కు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, హైదరాబాద్ : స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (నవంబర్ 11) సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, పాత్రికేయుడిగా మౌలానా కనబర్చిన జాతీయవాద స్ఫూర్తి ఎంతో గొప్పదని జగన్ కీర్తించారు. మౌలానా జయంతి అయిన నవంబర్ 11ను ‘నేషనల్ ఎడ్యుకేషన్ డే’ గా జరుపుకొంటున్న సంగతిని గుర్తుచూస్తూ.. ఆ మహానుభావుడి ఆదర్శాలను నేటి సమాజమంతా అనుసరించాల్సిన అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన చేశారు. ఆజాద్ ఆయన కలం పేరు : మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1988, నవంబర్ 11న మక్కాలో జన్మించారు. తల్లిదండ్రులు ఖైరుద్దీన్ అహమ్మద్, ఆలియా బేగమ్‌లు హజ్ యాత్రలో ఉండగా ఆజాద్ పుట్టారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆజాద్ తన తాతగారి(అమ్మవాళ్ల నాన్న) ఇంట్లో(ఢిల్లీ) పెరిగారు. స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. దాదాపు 10 సంవత్సరాలపాటు జైలుశిక్షను కూడా అనుభవించారు. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రిగా 11 ఏళ్లపాటు పనిచేశారు. విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతి అయిన నవంబర్ 11ను ‘నేషనల్ ఎడ్యుకేషన్ డే’గా జరుపుతాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్'. 'అబుల్ కలాం' అనేది ఆయన బిరుదు. ఇక 'ఆజాద్' ఆయన కలం పేరు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా పరమపదించారు. -
ఈ విప్లవాత్మక మార్పులెవరికని అడిగితే!
విశ్లేషణ మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకే వెలుగునిచ్చాయి. సామాజిక జీవనం మారకుండా పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబా లాంటి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పు లు వచ్చాయి. కానీ ఆ మార్పులన్నీ ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయన్నది కీ లకమైనది. విద్యలో మా ర్పులు, సాంకేతిక సమాచార రంగంలోని విప్లవా లు నేటికీ కొన్ని వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో వచ్చిన గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకు మరింత వెలుగునిచ్చాయి. అదే దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, ఆదివాసీ వర్గాలలో రావాల్సినంత మార్పు జరగలేదు. 20 శాతం మంది పేద వర్గాల విద్యార్థులకు ఈ విద్యా వెలుగులు అందకపోతే దేశాభివృద్ధి కుంటుపడిపోతుంది. చరిత్రాత్మకమైన కొఠారి కమిషన్ మొట్టమొదటిసారి కామన్ స్కూల్ విధానాన్ని (సీఎస్ఎస్) ప్రవేశపెట్టింది. ఈ విధానంవల్ల సమాజంలోని ఆర్థిక అంతస్తులను తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కొఠారి కమిషన్ నిర్దేశించింది. జాతీయ సమగ్రతకు దోహదపడటం కోసం ఒక రాష్ట్రం విద్యార్థులను మరొక రాష్ట్ర విద్యార్థులతో కలపటం కూడా ఇందులో ముఖ్యమైనది. ప్రాథమిక దశలో విద్యార్థులందరికీ, ముఖ్యంగా బీసీ కులాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు, ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలన్నది కొఠారి కమిషన్ సూచనలలో కీలకమైనది. కానీ దీన్ని ఏవిధంగా అమలు జరపాలో చెప్పకపోవటం వలన అది కాగితాలకే పరిమితమైంది. 1986లో మానవ వనరులశాఖ ఒక పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించేందుకు పూనుకున్నది. దీంతోనే 1986లో రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1992లో విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం పునర్ విమర్శన చేసింది. వెనుకబడిన వర్గాల పిల్లల నుంచి డిమాం డ్ లేనందున జాతీయ విద్యావిధానం (ఎన్పీఈ) అంతగా అమలుజరగలేదు. బీద పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పించటం వరకే అక్కడక్కడ ప్రయత్నాలు జరిగాయి. దీనివలన విద్యలో సమత్వం రా దని 1992లో ప్లానింగ్ కమిషన్ పునర్ సమీక్ష చేసిం ది. ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాల పిల్లలు బడికి వ చ్చేందుకై కొన్ని రాయితీలివ్వాలని తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ప్రత్యేక హాస్టల్స్ తెరవాలని, గిరిజన ప్రాంతంలో ఆశ్రమ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాలలోనే బడులు ఏర్పాటు చేయాలని ఎన్పీఈ కమిషన్ సూచించింది. నవోదయ బడులలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రిజ ర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. కానీ ఇవి అంతగా అమలు జరగలేదు. కారణాలు ఎన్నో. ఎస్సీ, ఎస్టీ స్కూళ్ల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయి. వీటికి ప్రభుత్వం డబ్బు కేటాయించకపోగా హాస్టల్స్‌లో నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నా రు. ఎన్పీఈ సిఫార్సులు విద్యారంగంలో మరొక అంతస్తును సృష్టించాయి. ఆశ్రమ స్కూళ్లకు, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో వ్యత్యాసమే ఇంకో అగాధాన్ని సృష్టించింది. జనరల్ స్కూళ్లలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చినా వారి స్థితిగతులను మార్చకుం డా పాఠశాలల్లో చేర్పించినా వారిని నిలబెట్టుకోవటమే కష్టమైపోయింది. మొదటి తరగతిలో చేరిన వాళ్లు రెండో తరగతి వచ్చేసరికి డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2013-14 విద్యాసంవత్సరంలో 5వ తరగతి వరకు చదివే విద్యార్థులలో 22.23 శాతం, 1వ తరగతి నుంచి 7వ తరగతి మధ్య 32.56 శాతం, 1 నుంచి 10వ తరగతి వరకు బడి మానేసిన విద్యార్థుల సంఖ్య 38.21 శాతంగా ఉన్నాయని, ఇటీవల తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పేర్కొంది. ఇదే నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా డ్రాప్ అవుట్ల సంఖ్య కనిపిస్తుంది. ఆ డ్రాప్ అవుట్ విద్యార్థులను పట్టించుకోకపోవటం వలన వారు చదువులో వెనుకబడిపోయారు. ఎన్పీఈ వలన 20 శాతం వర్గాల ఆడపిల్లల చదువులో మార్పు వచ్చింది. వెనుకబడిన వర్గాల ఆడపిల్లల చదువులో అంతగా మార్పు రాలేదు. సామాజిక జీవనం మారకుండా ఆ పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబాలాం టి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. అట్టడుగు వర్గాలలో చైతన్యం కలిగించి వారిని విద్య వైపు మళ్లిం చాలి. భారతదేశ తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బడికిరాని పిల్లల పైన ప్రత్యేకంగా విచారించే యంత్రాంగం కావాలి. డ్రాప్ అవుట్స్‌కు విరుగుళ్లు వెతకాలి. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)


