ప్రీతమ్ విజృంభణ
జింఖానా, న్యూస్‌లైన్: రాజు క్రికెట్ క్లబ్ (సీసీ) బౌలర్ ప్రీతమ్ (5/23) విజృంభించడంతో ఆ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో నేషనల్ సీసీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా తొలిరోజు బ్యాటింగ్ చేసిన నేషనల్ సీసీ జట్టు 115 పరుగుల వద్ద ఆలౌటైంది. ప్రసాద్ 32, మెల్విన్ జాన్ 25 పరుగులు చేశారు. అనంతరం రెండో రోజు బరిలోకి దిగిన రాజు సీసీ రెండే వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రీతమ్ (47), సతీష్ (38 నాటౌట్) మెరుగ్గా ఆడారు.
మరో మ్యాచ్‌లో పాషా బీడీ జట్టు బౌలర్ సౌరవ్ కుమార్ 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేసిన ప్పటికీ జట్టుకు విజయం ద క్కలేదు. జిందా సీసీ జట్టు 273 పరుగుల భారీ తేడాతో పాషా బీడీపై ఘన విజయం సాధించింది. తొలిరోజు బ్యాటింగ్ చేసిన జిందా సీసీ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్యామ్ సుందర్ (123) సెంచరీతో కదంతొక్కగా, ఫరాజ్ నవీద్ (82), సయ్యద్ షాబాజ్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. రెండో రోజు భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన పాషా బీడీ జట్టు 91 పరుగులకే ఆలౌటైంది. జిందా సీసీ బౌలర్ శ్రవణ్, మన్నన్ చెరో మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
వీనస్ సైబర్టె క్: 169 (ప్రసన్న కుమార్ 5/30, సూర్య విక్రమాదిత్య 5/60); అవర్స్: 105(వంశీ రెడ్డి 6/37, నరేష్ 3/32).
చార్మినార్: 408/8 (అబ్దుల్ రెహ్మాన్ 166, అమూది 100 నాటౌట్, యూనస్ అలి 81; మిఖిల్ జైస్వాల్ 3/90); సాయి సత్య: 134 (మణిచంద్ర 50; ఇర్ఫాన్ 3/25, అహ్మద్ 5/36).
బడ్డింగ్ స్టార్: 223 (నిఖిల్ పర్వానీ 54, తుషార్ సక్లాని 55; ఉత్తమ్ కుమార్ 3/40, సంజీవ్ 3/36); పీ అండ్ టీ కాలనీ: 225/4 (ఉత్తమ్ కుమార్ 56, రాణా ప్రతాప్ రెడ్డి 87).
కొసరాజు: 162/6 (రిత్విక్ 31, నిహాల్ 32 నాటౌట్); ఖల్సా: 166/7 (మెల్బింటొ 58).
ఎ-డివిజన్ వన్డే లీగ్:
హైదరాబాద్ పాంథర్స్ ఎలెవన్: 292 (హైదర్ ముబీన్ 100, ఆదిత్య 3/43, సోహైల్ ఖాన్ 5/18); ఇంపీరియల్: 236 (ఉత్తేజ్ 57, కశ్యప్ 35, జీషాన్ అలీ ఖాన్ 5/42).