breaking news
NATA 2014 meetings
-
అట్లాంటాలో నాటా 2014 మహాసభలకు సన్నాహాలు
అట్లాంటా: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) 2014 జూలై 4 నుంచి 6 వరకు అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ మహాసభలను నిర్వహించేందుకు సన్నహాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8న జరిగిన `టేస్ట్ ఆఫ్ ఇండియా' రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ లో జరిగిన సమావేశంలో పలువురు ప్రముఖులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ బాలా ఇందుర్తి మాట్లాడుతూ.. 2014 మహాసభల కోసం 45 కమిటీలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. కో కన్వీనర్ తంగిరాల సత్యనారాయణ రెడ్డి ఈ నెల 16నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలో నాటా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం చివరిలో క్రికెటర్ భారత రత్న సచిన్ టెండూల్కర్ ను గౌరవిస్తూ కేక్ కట్ చేశారు. -
2014 సమావేశాలకు ‘నాటా’ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 2014 సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. 2014 జూలై 4 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ‘నాటా 2014 కాన్వకేషన్’ ప్రచారంలో భాగంగా అక్టోబర్ 18, 19 తేదీల్లో ‘మీట్ అండ్ గ్రీట్’ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 600 మంది తెలుగు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2014 కాన్వకేషన్ కోసం విరాళాలను సేకరించగా ఒక్క రోజులోనే 7 లక్షల అమెరికన్ డాలర్ల విరాళాలు అందినట్లు నాటా సలహా మండలి అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి వెల్లడించారు. మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న ప్రముఖ ఫిలాంత్రోపిస్ట్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి చెరో లక్ష డాలర్ల విరాళాలు అంద జేశారన్నారు. అట్లాంటాలో జరిగే 2014 నాటా కాన్వకేషన్‌లో 10 వేల మంది తెలుగువారు పాల్గొననున్నారని పేర్కొన్నారు.